AA22xA6: మరో బాలీవుడ్ బ్యూటీ.. అట్లీ మ్యాజిక్ మామూలుగా లేదుగా!

జాన్వీ అల్లు అర్జున్ తో నటించాలని ఉన్నట్లు గతంలోనే తన కోరికను బయపెట్టింది.;

Update: 2026-02-14 13:30 GMT

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ ప్రాజెక్ట్ AA22xA6 ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ అవేటెడ్ మూవీగా మారింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే అట్లీ ప్లాన్ చూస్తుంటే ఈ సినిమాను కేవలం ఒక రీజనల్ మూవీలా కాకుండా, గ్లోబల్ లెవెల్ ప్యాన్ఇండియా వండర్‌గా తీర్చిదిద్దేలా కనిపిస్తోంది.

ఈ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ మూవీలో క్యాస్టింగ్ విషయంలో అట్లీ ఎక్కడా రాజీ పడటం లేదు. ఇప్పటికే రష్మిక మందన్న నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేస్తోందనే వార్తలతో పాటు, మృణాల్ ఠాకూర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తోందని వినికిడి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఏంటంటే.. ఈ మెగా క్యాస్టింగ్‌లో మరో స్టార్ హీరోయిన్ చేరబోతోంది.

శ్రీదేవి వారసురాలు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మరో కథానాయికగా ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే జాన్వీ పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా, మేకర్స్ త్వరలోనే దీనిపై ఒక అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందట. ఒకే సినిమాలో దీపికా, రష్మిక, మృణాల్‌లతో పాటు జాన్వీ కూడా తోడవ్వడం అంటే అట్లీ ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

జాన్వీ అల్లు అర్జున్ తో నటించాలని ఉన్నట్లు గతంలోనే తన కోరికను బయపెట్టింది. ఇప్పుడు ఏకంగా అట్లీ లాంటి భారీ చిత్రాల దర్శకుడితో కలిసి పనిచేయడం ఆమె కెరీర్‌కు గట్టి బూస్ట్‌ను ఇస్తుందని చెప్పడంలో డౌట్ లేదు. ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో ఆమె త్వరలోనే జాయిన్ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ విషయంలో గానీ, వాడే టెక్నాలజీ విషయంలో గానీ సన్ పిక్చర్స్ భారీగా ఖర్చు చేస్తోంది. హాలీవుడ్ లెవెల్ వీఎఫ్ఎక్స్ వాడటంతో పాటు, అల్లు అర్జున్‌ను గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో చూపించబోతున్నారట. జాన్వీ పాత్ర కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమయ్యేలా ఉంటుందని టాక్. AA22xA6 రోజురోజుకీ ఒక పెద్ద మూవీలా తయారవుతోంది. దీపికా పదుకొణె ‘లక్కీ స్టార్’ అని అట్లీ ఇప్పటికే కితాబు ఇచ్చారు, ఇప్పుడు జాన్వీ కూడా చేరడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏ స్థాయికి వెళ్తుందో చూడాలి. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags:    

Similar News