అనిరుధ్‌పై శ్రీకాంత్‌కు అంత నమ్మకమా?
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్‌పై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి.
నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్‌పై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయిలో ఉన్నాయి. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన దసరా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి నెలకొంది. దీనికి తోడు సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండటం మరో మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. అయితే ఇప్పుడు ది ప్యారడైజ్‌కు అనిరుధ్ అందించబోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై ప్రత్యేకమైన చర్చ మొదలైంది. స్వయంగా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల.. ఈ సినిమాతో అనిరుధ్ తన బెస్ట్ వర్క్ ఇస్తాడనే నమ్మకాన్ని వ్యక్తం చేయడం ఆసక్తిని పెంచుతోంది.
అనిరుధ్‌తో వర్క్ చేయడానికి ముందు తనను చాలామంది భయపెట్టారని శ్రీకాంత్ ఓదెల చెప్పడం గమనార్హం. టైమింగ్స్, షెడ్యూల్స్ విషయంలో అనిరుధ్‌తో వర్క్ చేయడం కష్టమవుతుందని పలువురు చెప్పినా, ఆయనను కలిసిన తర్వాత తెలియకుండానే కనెక్ట్ అయ్యానని శ్రీకాంత్ తెలిపారు. ఆ అనుబంధమే ఇప్పుడు ది ప్యారడైజ్ మ్యూజిక్‌పై డైరెక్టర్ కు నమ్మకంగా మారింది. ముఖ్యంగా సినిమా మాస్ టోన్‌కు తగ్గట్టుగా మాత్రమే కాకుండా కథలోని ఎమోషన్‌ను కూడా మరింత బలంగా ఎలివేట్ చేసేలా అనిరుధ్ పని చేశాడనే అంచనాలున్నాయి.
ఇప్పటికే ది ప్యారడైజ్ నుంచి వచ్చిన ఆయా షేర్, యేషనాగుల సాంగ్స్ ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. టీజర్‌లో వినిపించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ఉన్న మాస్ ఇంపాక్ట్‌ను మరింత పెంచింది. దీంతో అసలు సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది. గత కొంతకాలంగా కొన్ని సినిమాల్లో అనిరుధ్ సాంగ్స్, బీజీఎం ఆశించిన స్థాయిలో ఇంపాక్ట్ చూపలేదనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ది ప్యారడైజ్ ఆయనకు కూడా కీలకమైన ప్రాజెక్ట్‌గా మారింది.
రీసెంట్ గా వచ్చిన డీసీ తర్వాత అనిరుధ్‌పై మళ్లీ అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ఆ ఊపును ది ప్యారడైజ్ కొనసాగిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఫైనల్ ఎడిట్ లాక్ చేసి సినిమాను అనిరుధ్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కోసం పంపినట్టు తెలుస్తోంది. అంటే చివరి దశలో ఆయన మ్యూజిక్ సినిమా ఎక్స్‌పీరియెన్స్ ను డిసైడ్ చేసే కీలక అంశంగా మారనుంది. శ్రీకాంత్ ఓదెల చెప్పినట్టుగా ది ప్యారడైజ్ అనిరుధ్ కెరీర్‌లోనే బెస్ట్ వర్క్‌గా నిలిస్తే.. సినిమా ఇంపాక్ట్‌ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే క్రెడిట్ ఆయన మ్యూజిక్‌కే దక్కే అవకాశం ఉంది. సెప్టెంబర్ 24న తెలుగు, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ది ప్యారడైజ్‌లో అనిరుధ్ అసలు బ్లాస్ట్ ఎలా ఉండబోతుందనే దానిపై ఇప్పుడు అందరి ఆసక్తి నెలకొంది.