టాలీవుడ్ సంచలన కాంబోకి బిగ్ షాక్!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యం రకరకాల వార్తలు.. కాంబినేషన్ల చర్చలు జోరుగా సాగుతుంటాయి.

Update: 2026-10-30 18:30 GMT

తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యం రకరకాల వార్తలు.. కాంబినేషన్ల చర్చలు జోరుగా సాగుతుంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడు మొదలవుతాయి? ఎవరి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటాయనే? అంశాలపై అభిమానుల్లో భారీ ఆసక్తి ఉంటుంది. అయితే తాజాగా టాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఒక ప్రముఖ స్టార్ హీరో - సెన్సేషనల్ డైరెక్టర్ కాంబినేషన్‌లో రావాల్సిన భారీ ప్రాజెక్ట్ గురించి ఊహించని వార్త బయటికి వచ్చింది. టాలీవుడ్ యంగ్ స్టార్ హీరో ప్రెజెంటర్‌గా వ్యవహరించాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ తాత్కాలికంగా నిలిచిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

గతంలో ఓ మాస్ యాక్షన్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన మాస్ బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఆ తర్వాత టాలీవుడ్ మెగా హీరోతో ఓ రా అండ్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఆ హీరోను పూర్తిగా కొత్త కోణంలో.. సరికొత్త మాస్ యాక్షన్ అవతార్‌లో చూపించేలా కథను సిద్ధం చేశారని అప్పట్లో భారీ ప్రచారమే జరిగింది. ఇదే ప్రాజెక్ట్‌కు మరో ప్రముఖ యంగ్ హీరో ప్రెజెంటర్‌గా వ్యవహరించడంతో అంచనాలను మరింత పెంచింది.

అయితే ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా ముందుకు సాగలేదని కొన్ని సృజనాత్మక విభేదాలు త‌లెత్తడంతో ఈ కాంబినేషన్ ఆగిపోయిందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్‌లో పడినట్లే తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇలాంటి భారీ కాంబినేషన్లు సబ్జెక్ట్ పరమైన కారణాల వల్ల ఆగిపోవడం కొత్తేమీ కాదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో వస్తున్న వార్త అభిమానులను నిరాశ పరుస్తోంది.

మరోవైపు ఆ ప్రముఖ హీరో ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు మరో భారీ సోషియో-ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం కూడా ఆయన చేతిలో ఉంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాలపై ఫ్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సినిమాలతో పాటు ప్రముఖ ఓటీటీ వేదికగా ఆ హీరో హోస్ట్‌గా ఓ కొత్త టాక్ షో కూడా త్వరలో ప్రారంభం కానుండటం విశేషం.

Tags:    

Similar News