నైజాం నవాబ్ ఈజ్ బ్యాక్: డిస్ట్రిబ్యూటర్‌గా రాజుగారి రియల్ డామినేషన్!
తెలుగు సినీ పరిశ్రమలో `దిల్` రాజు అనే పేరు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌కే పరిమితం కాదు. సినిమాల నాడి పసిగట్టడంలో.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అగ్ర వ్యాపారవేత్త.
తెలుగు సినీ పరిశ్రమలో `దిల్` రాజు అనే పేరు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌కే పరిమితం కాదు. సినిమాల నాడి పసిగట్టడంలో.. డిస్ట్రిబ్యూషన్ రంగంలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న అగ్ర వ్యాపారవేత్త. గత కొంతకాలంగా నిర్మాణ రంగానికే ఎక్కువ సమయాన్ని కేటాయించిన రాజుగా ఇప్పుడు మళ్లీ పంపిణీదారుడిగా (డిస్ట్రిబ్యూటర్) పాత రోజులను గుర్తుచేస్తూ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బిగ్ డామినేషన్‌ను స్టార్ట్ చేశారు. వరుసగా రాబోయే బడా ప్రాజెక్టుల నైజాం హక్కులను చేజిక్కించుకుంటూ బాక్సాఫీస్ వేటలో ముందంజలో ఉన్నారు.
ఈ ఏడాదితో పాటు రాబోయే సీజన్‌లో విడుదలయ్యే భారీ చిత్రాల హక్కులన్నీ రాజుగారి ఖాతాలోనే పడటం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నవంబర్ మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా విజువల్ వండర్‌గా రాబోతున్న రూ. 4000 కోట్ల బడ్జెట్ చిత్రం `రామాయణ పార్ట్-1` (నవంబర్ 5) నైజాం పంపిణీ హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి దక్కించుకున్నారు. ఈ సినిమాపై ఉన్న గ్లోబల్ హైప్‌ను ముందే పసిగట్టిన రాజుగా నైజాం ఏరియాలో బిగ్గెస్ట్ రిలీజ్‌కు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
అలాగే నవంబర్ 6న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ మూవీ నైజాం రైట్స్‌ను కూడా రాజుగారే సొంతం చేసుకున్నారు. సూర్య మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు దిల్ రాజు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు.
ఇంకా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా `మైసా` (నవంబర్ 27) చిత్ర హక్కులను కూడా దిల్ రాజు దక్కించుకోవడం విశేషం. రష్మికకున్న క్రేజ్.. కంటెంట్‌లోని సత్తాను నమ్మి నైజాం రీజియన్‌ను సొంతం చేసుకున్నారు. దీంతో పాటు అక్కినేని నాగచైతన్య హీరోగా విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న `వృషకర్మ` (డిసెంబర్ 4) హక్కులను కూడా దిల్ రాజు సొంతం చేసుకోవడంతో డిసెంబర్ రేసులోనూ రాజుగారే ముందంజలో ఉన్నారు.
ఒకవైపు సొంత బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టులను నిర్మిస్తూనే మరోవైపు నైజాం రీజియన్‌లో థియేటర్ల నెట్‌వర్క్‌ను .. డిస్ట్రిబ్యూషన్ మార్కెట్‌ను పూర్తిగా గుప్పిట్లోకి తీసుకోవడం రాజుగారి వ్యాపార చతురతకు నిదర్శనం. ప్రతి సినిమా విడుదల తేదీల మధ్య గ్యాప్ చూసుకుంటూ థియేటర్ల కేటాయింపులో తనదే పైచేయి అనేలా రాజుగారు వేసిన స్కెచ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఆ రకంగా నవంబర్ - డిసెంబర్ నెలల్లో రాబోయే కీలకమైన పాన్-ఇండియా చిత్రాలన్నింటికీ దిల్ రాజే కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్నారు. నిర్మాతగా అంతర్జాతీయ స్థాయిలో ప్రయోగాలు చేస్తూనే.. డిస్ట్రిబ్యూటర్‌గా బాక్సాఫీస్ సుల్తాన్‌గా స్థానాన్ని మరింత భద్రపరుచుకుంటున్నారు. రాజుగారి రికార్డు స్థాయి డామినేషన్ చూస్తుంటే? రాబోయే సీజన్‌లో నైజాం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవడం ఖాయంగా కనిపిస్తోంది.