ఇది కూడా గ్లామరే కదా జాన్వి..!
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్ షో కొత్తేమీ కాదు. అయితే ఒక హీరోయిన్ గ్లామర్‌గా కనిపించినప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలవుతుంటాయి.
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు గ్లామర్ షో కొత్తేమీ కాదు. అయితే ఒక హీరోయిన్ గ్లామర్‌గా కనిపించినప్పుడు మాత్రం సోషల్ మీడియాలో రకరకాల చర్చలు మొదలవుతుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. ముఖ్యంగా పెద్ది సినిమా కారణంగా జాన్వీ పేరు సోషల్ మీడియాలో పెద్ద తుహారమే రేపింది.
అచ్చియమ్మ పాత్రపై ఎంతోమంది ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమాలో ఆమె పాత్రను చూపించిన విధానంపై విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాల్లో ఆమెను కేవలం గ్లామర్ కోసమే ఉపయోగించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ విమర్శలపై జాన్వీ కూడా స్పందించారు. తాను మరింత జాగ్రత్తగా ఉండాల్సిందని అంగీకరించారు. దర్శకుడు బుచ్చిబాబు సైతం కొన్ని సన్నివేశాలను మార్చుతామని చెబుతూ క్షమాపణలు చెప్పారు. ఇక ఈ విషయం గురించి మొన్నటి నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించే జాహ్నవి పైన మాట్లాడుకుంటున్న ధరణంలో.. ఇప్పుడు జాన్వీ కపూర్ హార్పర్స్ బజార్ ఇండియా మ్యాగజైన్ డిజిటల్ కవర్‌పై మెరిశారు. ఈ ఫోటోలు బయటకు వచ్చిన తర్వాత మరోసారి ఆమె గురించి సోషల్ మీడియాలో ఇంకొన్ని కామెంట్లు మొదలైంది. ఇందులో జాన్వీ రెండు విభిన్నమైన దుస్తుల్లో కనిపించారు. తెలుపు రంగు గౌనులో చాలా అందంగా కనిపించగా, మరోవైపు ఎరుపు రంగు డ్రెస్‌లో ఆకట్టుకున్నారు. ఈ ఫోటోలకు మంచి స్పందన వస్తోంది.
అయితే కొంతమంది నెటిజన్లు మాత్రం ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తున్నారు. సినిమాలో గ్లామర్ ప్రదర్శనపై విమర్శలు వచ్చినప్పుడు, మ్యాగజైన్ ఫోటోల్లో గ్లామర్‌గా కనిపించడం కూడా అదే కాదా..అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం మ్యాగజైన్ ఫోటోల్లో గ్లామర్‌గా కనిపించడం తప్పేమీ కాదని, సినిమాలో పాత్రను చూపించే విధానం మాత్రమే చర్చనీయాంశమని అంటున్నారు.
మరోవైపు జాన్వీ తన కెరీర్ గురించి కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విభిన్నమైన పాత్రలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. శ్రీదేవి కుమార్తెగా తనకు వచ్చే గుర్తింపు, అవకాశాల విలువ తనకు తెలుసని, అందుకే మరింత కష్టపడాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇక ప్రస్తుతం జాన్వి తెలుగులో అయితే ఎలాంటి సినిమా ఒప్పుకోలేదు. ఈసారైనా జాగ్రత్తగా స్క్రిప్ట్ చూసుకుని సినిమా ఒప్పుకుంటుందా లేదా చూడాలి.