వార‌ణాసి కోసం నెల రోజులు ముంబైలో భార్యాభ‌ర్త‌లు!

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ డ్రామా `వారణాసి` చిత్రంపై అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నాయి

Update: 2026-10-30 12:30 GMT

దర్శకధీరుడు రాజమౌళి- సూపర్ స్టార్ మహేష్ కలయికలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కుతోన్న పాన్-వరల్డ్ అడ్వెంచర్ డ్రామా `వారణాసి` చిత్రంపై అంతర్జాతీయంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో ముఖ్య పాత్ర పోషిస్తున్న గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఈ సినిమా ప్రమోషన్ల కోసం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే భర్త, పాప్ సింగర్ నిక్ జోనాస్‌తో కలిసి ముంబైలో నెల రోజుల పాటు విడిది చేయడానికి ప్లాన్ చేసినట్లు లీకైంది.

హాలీవుడ్ షెడ్యూల్స్ - బిజీ కెరీర్‌తో నిరంతరం అమెరికాలోనే గడిపే ప్రియాంక చోప్రా ఒక భారతీయ సినిమా ప్రచారం కోసం నెల రోజుల పాటు ముంబైలోనే తిష్ట వేయడం కొత్త చర్చకు దారితీస్తుంది. లాస్ ఏంజెల్స్ నుండి రావడం.. మీడియా ఈవెంట్లలో పాల్గొని వెంటనే వెళ్లిపోవడం కాకుండా భారతీయ ప్రేక్షకులకు ..ఇండియన్ మీడియాకు నేరుగా దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతోనే ముంబై ప్లాన్ రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ ప్లాన్‌లో అత్యంత ప్రత్యేకమైన అంశం ఏంటంటే? ప్రియాంక చోప్రా ఇండియన్ మీడియాలో పాల్గొనే ఈ ప్రమోషనల్ పర్యటనలో ఆమె భర్త నిక్ జోనాస్ కూడా భాగం కానుండటం. ఇప్పటికే `వారణాసి` విశేషాలను, రాజమౌళి విజన్‌ను హాలీవుడ్ టాక్ షోలలో ..ఇంటర్వ్యూలలో ప్రశంసిస్తూ హైప్ పెంచుతున్న నిక్ భారత్‌లో జరిగే ప్రమోషన్స్‌లో నేరుగా హాజరై భార్యకు మద్దతుగా నిలవనున్నారు. ఇది భారతీయ సినిమా ప్రచారంలో ఒక హాలీవుడ్ పాప్ స్టార్ పూర్తి స్థాయిలో పాల్గొనడం వంటి కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది.

కొన్ని సంవత్సరాలుగా హాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండి సుదీర్ఘ విరామం తర్వాత `వారణాసి` చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తున్న ప్రియాంక చోప్రాకు ఈ సినిమా కెరీర్ మైలురాయిగా మారనుంది. ఇందులో పీసీ మందాకిని అనే విభి న్నమైన యాక్షన్ షేడ్స్ కలిగిన పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమాను పాన్-ఇండియా మూవీగానే కాకుండా, పాన్-గ్లోబల్ రేంజ్‌లో విడుదల చేస్తుండ‌టంతో ముంబై కేంద్రంగా జరిగే నెల రోజుల ప్రమోషనల్ హడావుడి అన్ని భాషల మీడియాలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ఎంతగానో తోడ్పడనుంది.

సినిమాకు సంబంధించి పబ్లిసిటీ ప్లాన్‌తో పాటు ముంబైలో బస చేసే సమయంలో ప్రముఖ బాలీవుడ్ ప్రముఖులతో, మీడియా హౌస్‌లతో ప్రత్యేకమైన ముఖాముఖి కార్యక్రమాలు, వినూత్నమైన ప్రమోషనల్ షూట్‌లను కూడా ప్లాన్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. భారత్‌లోని సినీ ప్రియులతో మళ్లీ మునుపటి అనుబంధాన్ని ఏర్పరుచుకోవడానికి ...`వారణాసి` సినిమాకు బాలీవుడ్ ... నేషనల్ బెల్ట్‌లో హైప్ తీసుకురావడానికి ప్రియాంక నిర్ణయం క‌నిపిస్తుంది.

Tags:    

Similar News