గ్రేట్ స్టార్ వైవ్స్: భర్తకు ప్రియురాలు ఉందని తెలిస్తే.. ఆ భార్య ఫీలింగ్?
షో ప్రారంభంలోనే వీరిద్దరి కలయికపై ప్రజల్లో ఉన్న ఉత్సుకతను మాజీ ప్రేయసి ప్రస్తావించారు. మనమిద్దరం ఈ సోఫాపై కలిసి కూర్చోవడం చూసి అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.
స్టార్ హీరోల పర్సనల్ లైఫ్.. వారి గతం, వర్తమానం గురించి తెలుసుకోవడానికి అభిమానులు ఎప్పుడూ ఆసక్తిని చూపిస్తుంటారు. ముఖ్యంగా ఒకప్పటి ప్రేమకథలు ముగిసిన తర్వాత.. సదరు హీరోల మాజీ ప్రియురాళ్లు .. ప్రస్తుత భార్య మధ్య ఉండే సంబంధాలు ఎలా ఉంటాయనేది నిరంతరం చర్చనీయాంశమే. తాజాగా ఒక ప్రముఖ టాక్ షో ద్వారా మాజీ ప్రేయసి- ప్రస్తుత భార్య ఒకే వేదికను పంచుకోవడం నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోతో ప్రేమలో ఉండి విడిపోయిన మాజీ ప్రేయసి ఆ తర్వాత ఆ హీరో పెళ్లి చేసుకున్న ప్రస్తుత భార్యను తన షోకి ఆహ్వానించి మాట్లాడటం... వారిద్దరి మధ్య ఉన్న ఆరోగ్యకరమైన ర్యాపోను ప్రపంచానికి చాటిచెప్పింది.
షో ప్రారంభంలోనే వీరిద్దరి కలయికపై ప్రజల్లో ఉన్న ఉత్సుకతను మాజీ ప్రేయసి ప్రస్తావించారు. మనమిద్దరం ఈ సోఫాపై కలిసి కూర్చోవడం చూసి అందరూ చాలా ఎగ్జైట్ అవుతున్నారు. కానీ మనం మాత్రం మహిళలకు ఏం కావాలో దాని గురించే మాట్లాడదాం! అని ఆమె నవ్వుతూ సంభాషణను మొదలుపెట్టారు. దానికి ప్రస్తుత భార్య కూడా అంతే సరదాగా స్పందిస్తూ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేశారు. ఈ క్రమంలోనే తన గురించి విన్న విచిత్రమైన రూమర్లపై స్పందిస్తూ పిల్లల పెంపకం గురించి సరదాగా ముచ్చటించారు. అలాగే మాజీ ప్రేయసిని ``మీరు అసలైన స్టార్`` అని ప్రస్తుత భార్య కొనియాడగా.. ఇద్దరి మధ్య పరస్పర గౌరవం స్పష్టంగా కనిపించింది. అయితే ఈ విషయాలన్నీ షాహిద్ కపూర్ మాజీ ప్రేయసి కరీనాకపూర్.. ప్రస్తుత భార్య మీరా రాజ్ పుత్ షో గురించేనని మీకు తెలుసు.
కుటుంబం, భార్యాభర్తల సంబంధాలు, కాపురం వంటి విషయాలపై వీరిద్దరి సంభాషణ ఎంతో ఆసక్తికరంగా సాగింది. సంభాషణలో భాగంగా తన గురించి విన్న అత్యంత విచిత్రమైన రూమర్ ఏంటని కరీనా అడగ్గా, ``నేను మరొక బిడ్డకు జన్మనివ్వబోతున్నాననే వార్త`` అని మీరా సమాధానమిచ్చారు. దానికి కరీనా సరదాగా ```అది నిజం కూడా కావచ్చు కదా!`` అని అనగా, ``ఏమాత్రం ఛాన్స్ లేదు.. మా పిల్లల పెంపకం ఇక పూర్తయినట్లే`` అని మీరా చెప్పారు. అలాగే కరీనాను మీరా ``మీరు అసలైన బాలీవుడ్ స్టార్`` అని కొనియాడగా, ``నేను బాలీవుడ్ స్టార్‌నే కాక.. బాలీవుడ్ వైఫ్‌గా మారాలని ఆశపడేదాన్ని కూడా`` అని కరీనా చిలిపిగా బదులిచ్చారు.
భార్యాభర్తల మధ్య బహుమతుల విషయమై మాట్లాడుతూ.. కొందరు భర్తలు ఏడాది ప్రారంభంలోనే తమ భార్యలకు ఏం కావాలో అడిగి తెలుసుకుంటారని మీరా చెప్పారు. ఈ ఆలోచన తనకు బాగా నచ్చిందని.. తాను కూడా త్వరలోనే దీనిని ఇంట్లో అమల్లోకి తెస్తానని కరీనా సరదాగా వ్యాఖ్యానించారు. ఇక మహిళలతో వాదించేటప్పుడు పాటించాల్సిన మొదటి నియమం ఏంటని అడగ్గా, ``అస్సలు వాదించకండి.. లొంగిపోవడమే ఉత్తమం`` అని మీరా ఇచ్చిన సమాధానం నెటిజన్లను గొప్పగా ఆకట్టుకుంటోంది.
రేపు పూర్తి స్థాయిలో విడుదల కానున్న ఈ ఎపిసోడ్ బాలీవుడ్ వర్గాల్లోనూ, అభిమానుల్లోనూ ఆసక్తిని పెంచేసింది. గతం కంటే వర్తమానానికే ప్రాధాన్యమిస్తూ.. ఏమాత్రం సంకోచం లేకుండా ఒకరికొకరు మర్యాద ఇస్తూ సాగిన వీరి సంభాషణ టాక్ షోలలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనడంలో సందేహం లేదు.