కరీనా కాదమ్మా..విన్నీ ది పూహ్!
బాలీవుడ్‌లో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీ మరోసారి విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్‌తో నెట్టింట హల్ చల్ చేశాడు.
బాలీవుడ్‌లో నిత్యం ట్రెండింగ్‌లో ఉండే సోషల్ మీడియా సెన్సేషన్ ఓరీ మరోసారి విభిన్నమైన ఫ్యాషన్ సెన్స్‌తో నెట్టింట హల్ చల్ చేశాడు. అయితే ఈసారి ఒర్రీ ఎంచుకున్న రూపం సాధారణ ఫ్యాషన్ ట్రెండ్ కాదు. రెండు దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరిస్తున్న కరీనా కపూర్ ఐకానిక్ క్యారెక్టర్ `పూ` (కభీ ఖుషీ కభీ గ్యామ్) గెటప్ కావడం విశేషం. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగాఈ ఘటన వెనుక ఓ ఆసక్తికర కొత్త కోణం బయట పడింది.
ఈ వీడియోలో ఓరీ అచ్చం కరీనా కపూర్ వేసుకున్న బేజ్ ట్యాన్ మినీ స్కర్ట్.. పింక్ షిమ్మర్ క్రాప్ టాప్ ఫాక్స్ ఫర్ స్టోల్ ధరించి కెమెరా ముందుకొచ్చాడు. ఆలియా భట్ కెమెరా పట్టుకుని ఉండగా.. తనను తాను కరీనా గెటప్‌లో చూపిస్తూ `నేను ఎలా కనిపిస్తున్నాను?` అని ఓరీ అడిగాడు. ఆ గెటప్ చూసి ఆలియా భట్ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వుల పువ్వులు పూయించింది. ఈ వీడియో క్లిప్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే ఈ ఫన్నీ వీడియోకు సంబంధించిన అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఓరీ ఈ గెటప్ వేసుకుని రాగానే అంతా దీన్ని `పూ` రీమేక్‌గా భావించారు. కానీ ఆలియా భట్ మాత్రం ఓరీకి కేవలం ఫన్నీగా `విన్నీ ది పూహ్`లాగా దుస్తులు వేసుకుని రమ్మని మాత్రమే చెప్పానని.. అంతేతప్ప కరీనా కపూర్ క్యారెక్టర్ `పూ` లాగా కాదని క్లారిటీ ఇచ్చింది. ఆలియా చేసిన చిన్న పొరపాటు కారణంగానే ఓరీ ఏకంగా `పూ` గెటప్‌లో ప్రత్యక్షమై నవ్వులు పంచాడు.
అలాగే ఆలియా మాటలకి అలిగిపోయినట్లుగా ఓరీ గది నుంచి బయటకు వెళ్లే సీన్ ఈ వీడియోకు మరింత హైలైట్‌గా నిలిచింది. ఫ్యాషన్ ప్రయోగాలు మాత్రమే కాకుండా సెలబ్రిటీల మధ్య ఉండే ఇలాంటి సరదా క్యాజువల్ మూమెంట్స్ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియోపై సోషల్ మీడియాలో అభిమానులు భిన్నమైన కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
ఈ వీడియోపై అసలైన `పూ` అయిన కరీనా కపూర్ కూడా స్పందించడం విశేషం. ఓరీ పోస్ట్ చేసిన ఈ వీడియోను చూసి క్యాట్ మురిసిపోతూ రెడ్ హార్ట్ ఎమోజీతో `టూ గుడ్` అంటూ కామెంట్ చేశారు. ఈ ప్రశంసతో ఓరీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరీనా కపూర్ రియాక్షన్ స్క్రీన్ షాట్లు ఫ్యాన్స్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం ఓవైపు సినిమాలు.. మరోవైపు సోషల్ మీడియాలో ఓరీ హవా కొనసాగుతుంటే మరోవైపు ఆలియా భట్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తోన్న ప్రతిష్టాత్మక `లవ్ అండ్ వార్` సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది.