విజయ్-రష్మికలది శివపార్వతుల బంధం లాంటిది!
నతాషా రాథోర్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేస్తూ విజయ్-రష్మికల సంబంధాన్ని సమాజం అర్థం చేసుకుంటున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.
కాఫీ విత్ కరణ్ లో పాల్గొన్న తర్వాత విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నల వివాహ బంధం, ప్రేమ ప్రపోజల్ విధానంపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చలు.. విమర్శలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ట్రోలింగ్ .. నెగెటివిటీ మధ్య ఓ కంటెంట్ క్రియేటర్ వీరి ప్రేమ ప్రయాణాన్ని శివపార్వతుల ఆధ్యాత్మిక బంధంతో పోలుస్తూ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోపై రష్మిక స్పందించారు. ఇది తనకు ఎంతగానో ఓదార్పునిచ్చిందని ఎమోషనల్ పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..
నతాషా రాథోర్ అనే కంటెంట్ క్రియేటర్ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ షేర్ చేస్తూ విజయ్-రష్మికల సంబంధాన్ని సమాజం అర్థం చేసుకుంటున్న విధానాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. స్త్రీ, పురుష తత్వాల పట్ల సమాజానికి ఉన్న అవగాహనను పితృస్వామ్య ధోరణి పూర్తిగా మార్చేసిందని అభిప్రాయపడ్డారు. గృహస్థాశ్రమంపై పెద్దగా కోరిక లేని వైరాగి అయిన పరమశివుడిని పొందడానికి పార్వతీ దేవి ఎలా తపస్సు చేసిందో? అలాగే విజయ్ దేవరకొండను రష్మిక ఒక సంవత్సరం పాటు అనుసరించి ప్రపోజ్ చేయడాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కోణంతో పోల్చారు.
విమర్శలపై స్పందిస్తూ ఆ కంటెంట్ క్రియేటర్ ఆలోచించి అడుగువేసే ప్రతి పురుషుడు తప్పించుకునే తత్వం ఉన్నవాడు కాడు. ప్రతిపాదన చేసే ప్రతి స్త్రీ దిగజారిపోయినది కాదు. మీరు అర్థం చేసుకోలేని ప్రతి సంబంధం టాక్సిక్ కాదని రాసుకొచ్చారు. సమాజం రెడ్ ఫ్లాగ్‌లను వెతకడంలో పడిపోయి స్పృహతో కూడిన అసలైన ప్రేమను గుర్తించడమే మరిచిపోయిందని చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి.
ఈ రీల్‌ను రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రీ-పోస్ట్ చేస్తూ `ఇది నన్ను ఎంతో ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న అనుభూతిని ఇస్తోందని రెడ్ హార్ట్ ఎమోజీతో స్పందించారు. ట్రోలింగ్, నెగెటివ్ వ్యాఖ్యలతో సతమతమవుతున్న సమయంలో ఈ విశ్లేషణ తనకు ఎంతటి హృదయపూర్వకమైన నిండైన అనుభూతిని ఇచ్చిందో ఈ రకంగా వ్యక్తపరిచారు.
ఇదే వివాదంపై రష్మిక అంతకుముందు కూడా సోషల్ మీడియాలో సుదీర్ఘ సందేశాన్ని పంచుకున్నారు. తనకు ఏం కావాలో తనకు స్పష్టంగా తెలుసని.. విజయ్ వ్యవహారికమైన అంశాలను ఆలోచించడానికి కొంత సమయం తీసుకోవడంలో ఎలాంటి తప్పు లేదని సమర్థించారు. నేను హృదయంతో ఆలోచిస్తే, తను ఆలోచనాపరుడు. ఒకరి జీవితంలో మరొకరి ఉనికి ఎంతో అవసరం అని రాసుకొచ్చారు. వివాహం అంటే? ఉంగరాలు మార్చుకోవడం, మోకాళ్లపై నుంచొని ప్రపోజ్ చేయడం కాదని ఇద్దరు కలిసి అందమైన జీవితాన్ని నిర్మించుకోవడమేనని అభిప్రాయపడ్డారు.