నిడివి లో ఆ రెండు సినిమాలతో 'రామాయణం' పోటీనా?
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మైథలాజికల్ ఎపిక్ `రామాయణం-1` రన్ టైమ్ - సెన్సార్ విషయాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన మైథలాజికల్ ఎపిక్ `రామాయణం-1` రన్ టైమ్ - సెన్సార్ విషయాలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ఫ్రాంఛైజీ మొదటి భాగాన్ని ఐమాక్స్ సహా అన్ని ప్రధాన భారతీయ థియేటర్లలో విడుదల కానుంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాకి సెన్సార్ యుఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఏకంగా 3 గంటల 15 నిమిషాల (195 నిమిషాలు) సుదీర్ఘ నిడివితో ఉంటుందని సమాచారం. కథలోని విస్తృతి.. సుదీర్ఘమైన పాటలు .. సన్నివేశాల ప్రాధాన్యత దృష్ట్యా ఈ స్థాయి రన్ టైమ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక అంతర్జాతీయ ప్రేక్షకుల కోసం ఓవర్సీస్ వర్షన్‌ను దాదాపు 30 నిమిషాలు కుదించి 2 గంటల 45 నిమిషాల వ్యవధితో విడుదల చేయనుండగా.. రెండు భాగాలు కలిపి దాదాపు 6 గంటల సుదీర్ఘ దృశ్యకావ్యంగా ప్రేక్షకులను అలరించనుందని సమాచారం.
ఇటీవలి కాలంలో 3 గంటలకు పైబడిన సుదీర్ఘ నిడివితో వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో సంచలనం సృష్టించిన చిత్రాలలో రణ్‌బీర్ కపూర్ `యానిమల్` క్యూలో ముందుగా ఉంటుంది. ఆ తర్వాత అదే తరహాలో వచ్చిన ధురంధర్..యు దాని సీక్వెల్ `ధురంధర్ 2` కూడా నిడివి విషయంలో ఏమాత్రం తగ్గుముఖం పట్టకుండా కథా బలంతో ప్రేక్షకాదరణ పొందాయి. సుదీర్ఘ రన్ టైమ్ ఉన్నా కథనంలో వేగం, బలమైన పాత్రలు ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ఈ చిత్రాలు నిరూపించాయి. ఇప్పుడు అదే కోవలో `రామాయణం-1` కూడా 3 గంటల 15 నిమిషాల వ్యవధితో రాబోతుండటంతో రణ్‌బీర్ కపూర్ కెరీర్లో `యానిమల్` తర్వాత మరో భారీ రన్ టైమ్ చిత్రంగా ఇది నిలవనుంది.
మరోవైపు కన్నడ రాకింగ్ స్టార్ యష్ ఈ చిత్రంలో రావణాసురుడిగా నటిస్తుండటం సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది. మొదటి భాగంలో ఆయన పాత్ర స్క్రీన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. రావణుడి పాత్ర కేవలం కొద్ది నిమిషాలకే పరిమితమవుతుందని కొందరు అంటుంటే.. మరికొందరు అభిమానులు మాత్రం అతడి స్క్రీన్ ప్రెజెన్స్ 60 నిమిషాలకు పైగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాముడిగా రణ్‌బీర్ కపూర్, రావణుడిగా యష్ వంటి ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్ బిగ్ స్క్రీన్‌పై ముఖాముఖి తలపడే సన్నివేశాలు థియేటర్లలో సరికొత్త అనుభూతిని అందిస్తాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో.. ఆధునిక విఎఫ్ఎక్స్ మెరుపులతో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్లో చూడటానికి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమిళం సహా పలు ప్రాంతీయ భాషల్లో ఐమాక్స్ వర్షన్స్ -షోస్ కేటాయింపులపై నెట్టింట విస్తృత చర్చ జరుగుతోంది. విజువల్ గ్రాండియారిటీ ఉన్న భారీ చిత్రాలకు ఐమాక్స్ ప్రదర్శన వేదికలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండటంతో ట్రేడ్ వర్గాలు కూడా ఈ విషయమై ప్రత్యేక దృష్టి సారించాయి.
మొత్తానికి, `రామాయణం-1` రన్ టైమ్, రావణుడిగా యష్ పాత్ర ప్రాధాన్యత.. లార్జర్ దాన్ లైఫ్ మేకింగ్ చుట్టూ ఉన్న సోషల్ మీడియా బజ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. కథా విస్తృతిని తగ్గించకుండా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ భారతీయ సినిమా స్థాయిలో కొత్త రికార్డులను సృష్టిస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి. ఈ విజువల్ వండర్ పై చిత్ర యూనిట్ నుండి వచ్చే తదుపరి అధికారిక ప్రకటనల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వేచి చూస్తున్నారు.