Thaman: నాగ వంశీని ‘హై’గా ఉంటే తట్టుకోలేము ‘లో’గా ఉంటే చూడలేము..!

ఆదర్శ కుటుంబం సినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది.

Update: 2026-10-30 16:36 GMT

ఆదర్శ కుటుంబం సినిమా ఈరోజు విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటోంది. కథ, నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయంలో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

సాధారణంగా ఒక సినిమా అంటే కథతో పాటు పాటలు కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పాటలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పాటలు బాగుంటే సినిమాపై అంచనాలు కూడా పెరుగుతాయి. అయితే ఆదర్శ కుటుంబం విషయంలో మాత్రం తమన్ చెప్పిన మాటలు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

సక్సెస్ మీట్‌లో తమన్ మాట్లాడుతూ "ఆదర్శ కుటుంబం మ్యూజికల్ సినిమా కాదు.. ఇది డైలాగ్స్‌తో నడిచే సినిమా" అని అన్నారు. ఈ సినిమాలో పాటల కంటే డైలాగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. దర్శకుడు త్రివిక్రమ్ రాసిన కథ, మాటల్లో ఉన్న బలం తనకు బాగా నచ్చిందని చెప్పారు. ఈ సినిమా పాటల గురించి ముందు నుంచే కొంచెం నెగిటివిటీ ఉండగా ఇప్పుడు తమనమన్ చెప్పిన ఈ మాటలు ఇంకాస్త వైరల్ అవుతున్నాయి.

ఇక ఆ తర్వాత ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించడం తనకు చాలా సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. గత 25 రోజులుగా టీమ్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభూతిని ఇచ్చిందని చెప్పారు. త్రివిక్రమ్ సినిమాలో ఇంత కామెడీ ఎప్పుడూ చూడలేదని, సినిమా చూస్తున్నంతసేపు తాను చాలా నవ్వుకున్నానని తమన్ వెల్లడించారు.

నాగవంశీ గురించి కూడా తమన్ ఆసక్తికరంగా మాట్లాడారు. ఆయన మంచి మూడ్‌లో ఉన్నప్పుడు తట్టుకోవడం కష్టమని, అదే ఆయన బాధలో ఉంటే చూడటం ఇంకా కష్టమని అన్నారు. ఎప్పుడూ ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటానని చెప్పారు. నాగ వంశీ.. స్పీచ్ లు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన సినిమా హిట్ అయిన అలానే ఫ్లాప్ అయినా ఎలాంటి స్పీచ్ ఇస్తారో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తమన్ నాగవంశీ గురించి అన్న ఈ మాటలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.

హీరోయిన్ శ్రీనిధి గురించి సరదాగా మాట్లాడుతూ, మ్యూజిక్ కంపోజింగ్ సమయంలో.. సాధారణంగా త్రివిక్రమ్ బాగా ఇచ్చినప్పుడు కొడుతూ ఉంటారని.. అయితే ఈ సినిమా మ్యూజిక్ అప్పుడు శ్రీనిధి కూడా తనను కొట్టేదని, ఆమెను పెళ్లి చేసుకునే వ్యక్తికి కష్టాలు తప్పవని తమాషాగా కామెంట్ చేశారు. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో రామాయణం సినిమా వస్తే చూడాలని తన కోరికను బయటపెట్టారు.

Tags:    

Similar News