ఫ్యాన్స్ వల్ల స్టార్ హీరోల మధ్య దూరం పెరుగుతుందా...లేదంటే హీరోల వల్ల ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయా...

'అభిమానులు లేనిదే హీరోలు లేరులే' అనే మాట అందరు నమ్మాల్సిందే. కారణమేంటంటే ఒక సాధారణ వ్యక్తి స్క్రీన్ మీద కనిపించిన మామూలు నటుడి సినిమాలు చూస్తారు.

Update: 2026-09-15 15:30 GMT

'అభిమానులు లేనిదే హీరోలు లేరులే' అనే మాట అందరు నమ్మాల్సిందే. కారణమేంటంటే ఒక సాధారణ వ్యక్తి స్క్రీన్ మీద కనిపించిన మామూలు నటుడి సినిమాలు చూస్తారు. వాళ్ళ మూవీస్ స్నచ్చడంతో ఆ హీరోలను ఓన్ చేసుకొని ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా కూడా వాళ్ళ నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా హీరోల బాగు కోరుకునేది ఒక్క అభిమాని మాత్రమే.. అలాంటి హీరోలు వాళ్ళ అభిమానుల కోసం ఏం చేయడానికైనా రెడీ గా ఉన్నాం అని చెబుతారు కానీ ఏమి చేయరు. ఫ్యాన్స్ కి ఏదైనా ఆపద వస్తే హీరోలు సాయంగా నిల్చిన సందర్భాలు చాలా తక్కువ. మొత్తానికి హీరోలు అభిమానుల కోసం ఏదైనా చేస్తాం అంటే దాని అర్థం ఎలాంటి సినిమా అయిన చేస్తామని, ఎంతటి రిస్క్ ను ఎదుర్కొనైనా అభిమానిని తమ సినిమాలతో అలరిస్తామని అంటుంటారు. నిజానికి హీరోలు రిస్క్ చేసేది అభిమానుల కోసమైతే కాదు. వాళ్ళ సినిమాలు ఆడటానికి దాని వల్ల వాళ్ల మార్కెట్ పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు...

ఇదంతా తెలియక ఫ్యాన్స్ మాత్రం హీరోల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. వాళ్ళ ఫేవరేట్ హీరో సినిమా ఆడలేదని బాధపడతారు. ఇండస్ట్రీ హిట్ కొట్టలేదని ఏడుస్తారు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మన హీరో మూవీ ఆడకపోయినా అవతల హీరో మూవీ ఆడితే ఒప్పుకోరు. దాని మీద నెగెటివ్ ప్రచారం చేస్తారు. దీనివల్ల ఫ్యాన్స్ మధ్య తీవ్రమైన గొడవలు జరుగుతుంటాయి... హీరోలు బాగానే ఉంటారు కానీ వాళ్ళ కోసం అభిమానులు కొట్టుకు చస్తుంటారు. నిజానికి ఫ్యాన్ వార్స్ జరగటానికి ముఖ్య కారణం హీరోల, లేదంటే అభిమానుల అనే చర్చ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది...

మొదట హీరోలు వాళ్ళ ఫ్యాన్స్ ను అదుపులో పెట్టాల్సిన అవసరముంది. మన సినిమా గురించి మాత్రమే ఆలోచించండి అవతల హీరో సినిమా మనకు అవసరం లేదు. వీలైతే మన సినిమా కి సపోర్ట్ చేయండి కానీ వేరే హీరో మూవీకి నెగెటివ్ ప్రచారం చేయకండని చెప్పాలి.అలాగే హీరోల మధ్య సత్సంబంధాలు ఉన్నప్పుడే ఫ్యాన్స్ మధ్య గొడవలు తగ్గుతాయి. ఫ్యాన్ వార్ కి అసలు కారణం హీరోలే అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక కొంతమంది ఫ్యాన్స్ చేసే అతి వల్ల హీరోల మనోభావాలు దెబ్బతింటున్నాయి. దాని ద్వారా తెలియకుండానే హీరోల మధ్య కోల్డ్ వార్స్ జరుగుతున్నాయి. ఏది ఏమైనా కూడా హీరోలు చాలా ఫ్రెండ్లీ గా ఉన్నప్పుడే ఇలాంటి వాటికి చెక్ పెట్టే అవకాశం ఉంటుంది...

Tags:    

Similar News