నగినా నాగినిలా మారిపోయిన జాన్వీ కపూర్!

ఈ లుక్‌కు సంబంధించి జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు.

Update: 2026-11-01 05:17 GMT

బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అద్భుతమైన రూపంతో సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించారు. సాధారణంగా హలోవీన్ అనగానే విదేశీ తరహా దెయ్యాల వేషాలు, భయానక రూపాలు గుర్తుకు వస్తాయి. కానీ జాన్వీ కపూర్ మాత్రం పూర్తిగా భిన్నంగా ఆలోచించి తల్లి, దివంగత నటి శ్రీదేవి అరుదైన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1986లో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన క్లాసిక్ ఫాంటసీ డ్రామా `నగినా` చిత్రంలోని శ్రీదేవి ఐకానిక్ లుక్‌ను అచ్చం అలాగే రీక్రియేట్ చేసి జాన్వీ అందరినీ ఆశ్చర్యపరిచారు.

`నగినా` చిత్రంలో శ్రీదేవి అద్భుతమైన అభినయం, క్లైమాక్స్ పాము నాట్యం చలనచిత్ర చరిత్రలోనే నిలిచి పోయాయి. ఆ సినిమాలోని నాగిని గెటప్‌ను తలపించేలా జాన్వీ కపూర్ సరిగ్గా అదే రకమైన కాస్ట్యూమ్స్, మేకప్, హెయిర్‌స్టైల్‌తో కెమెరా ముందుకొచ్చారు. చిన్నపాటి డీటెయిల్స్ సైతం మిస్ కాకుండా అమ్మ‌డు పడిన శ్రమ ఫోటోలలో స్పష్టంగా కనిపిస్తోంది. అచ్చం శ్రీదేవి లాగే జాన్వీ పోజులివ్వడం చూసిన నెటిజన్లు, అభిమానులు ఒక్కసారిగా గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. తల్లి పోలికలతో అచ్చం శ్రీదేవిలాగే కనిపిస్తున్న జాన్వీని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ లుక్‌కు సంబంధించి జాన్వీ కపూర్ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలను పంచుకున్నారు. `హ్యాపీ హలోవీన్` సినిమా చరిత్రలోనే అత్యంత అద్భుతమైన ఐకానిక్ క్షణాలలో ఒకదానిని నేను రీక్రియేట్ చేయాల్సిందే అనుకున్నాను` అని క్యాప్షన్ రాసుకొచ్చారు. అలాగే తల్లి శ్రీదేవితో పాటు ఆ చిత్రంలోని ఇతర ప్రముఖ పాత్రలను ఉద్దేశించి.. `అమ్మ, రిషి అంకుల్, అమ్రిష్ సర్ కంటే ఐకానిక్ ఎవరూ ఉండగలరు` అంటూ వారిపై అభిమానం చాటుకున్నారు.

ఈ ఫొటోషూట్‌లో జాన్వీతో పాటు ఆమె స్నేహితులు కూడా భాగస్వామ్యం కావడం విశేషం. సోషల్ మీడియా సెలబ్రిటీ ఒరి చిత్రంలో రిషి కపూర్ పాత్రను పోలి ఉండే గెటప్‌లో కనిపించగా.. మరో వ్యక్తి అమ్రిష్ పూరి పాత్రను తలపించేలా పోజులిచ్చారు. `నగినా` చిత్రంలోని ప్రధాన పాత్రలైన నాగిని.. ఆమె భర్త, విలన్ పాత్రలను ఇలా సరదాగా రీక్రియేట్ చేసిన తీరు నెట్టింట నవ్వులు పూయిస్తుంది.

సినిమాల పరంగా చూస్తే జాన్వీ కపూర్ వరుస ప్రాజెక్టులతో దూసుకెళ్తున్నారు. ఇటీవలి కాలంలో విభిన్న కథాంశాలను ఎంచుకుంటూ నటిగా పరిధిని విస్తరించుకుంటున్నారు. సోషల్ మీడియాలో మాత్రం కుటుంబ జ్ఞాపకాలను, అమ్మ శ్రీదేవిని తరచుగా గుర్తుచేసుకుంటూ ఉంటారు. హలోవీన్ వేడుకలను సరదా పార్టీలా కాకుండా తల్లికి అంకితం చేసిన అద్భుతమైన ట్రిబ్యూట్‌గా మార్చడం ద్వారా జాన్వీ మరోసారి తల్లిపై ప్రేమను చాటుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ వర్గాలతో పాటు కోట్లాది మంది అభిమానులు జాన్వీ కపూర్ ఆలోచనను, ఆమె చేసిన ఈ అద్భుతమైన రీక్రియేషన్‌ను తెగ ప్రశంసిస్తున్నారు. అమ్మ జ్ఞాపకాలను ఇలా సరికొత్త తరహాలో వెండితెర నాటి రోజులను గుర్తుచేసేలా చేయడం నిజంగా ప్రశంసనీయమని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News