హారర్‌కూ పాన్ ఇండియా మోజు.. 418తో కొత్త ట్రెండ్ మొదలవుతుందా?
అయితే ఇప్పుడు ఈ సినిమాకు సౌత్ మార్కెట్లను దాటి నార్త్ ఇండియాలో కూడా అవకాశాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది.
సినిమా మార్కెట్‌లో పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు కేవలం స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకే పరిమితం కావడం లేదు. ఒకప్పుడు యాక్షన్, పీరియాడిక్, విజువల్ గ్రాండియర్ ఉన్న సినిమాలకే ఇతర భాషల్లో మార్కెట్ ఉంటుందనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు కథలోని యూనివర్సల్ అప్పీల్ ఉంటే జానర్‌తో సంబంధం లేకుండా సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా కనెక్ట్ అయ్యే హారర్, థ్రిల్లర్ కంటెంట్‌కు ఈ అవకాశాలు మరింతగా కనిపిస్తున్నాయి. ఈ మారుతున్న మార్కెట్ లెక్కల్లో 418 ఒక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ గా నిలుస్తోంది.
ప్రశాంత్ నీల్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ హారర్ మూవీపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సౌత్ మార్కెట్లను దాటి నార్త్ ఇండియాలో కూడా అవకాశాలు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. ఇతర భాషలకు చెందిన ఎగ్జిబిటర్లు సినిమాను చూసిన తర్వాత పాజిటివ్‌గా రెస్పాండ్ అవడంతో పాటు, ముఖ్యంగా హిందీ ఎగ్జిబిటర్ వర్గాల నుంచి కూడా ఆసక్తి వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఇదే అంశం 418 మార్కెట్‌ను మరింత విస్తరించే ఆలోచనకు కారణంగా మారింది. సాధారణంగా హిందీ మార్కెట్‌లోకి సౌత్ నుంచి వెళ్లే సినిమాలకు స్టార్ ఇమేజ్ కీలకంగా ఉంటుంది. కానీ కంటెంట్ ఆధారంగా ఒక హారర్ మూవీకి అక్కడి ఎగ్జిబిటర్లు ఆసక్తి చూపడం మాత్రం జానర్ సినిమాలకు పెరుగుతున్న అవకాశాలను సూచిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక్కడ మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. హారర్‌కు భాష పెద్ద అడ్డంకి కాకపోవడం. భయం, సస్పెన్స్, మిస్టరీ వంటి ఎమోషన్స్ ఏ భాష ఆడియన్స్ కైనా ఈజీగా కనెక్ట్ అయ్యే అంశాలు. అందుకే కథ, మేకింగ్, టెక్నికల్ క్వాలిటీ స్ట్రాంగ్ గా ఉంటే డబ్బింగ్ లేదా మల్టీలాంగ్వేజ్ రిలీజ్ ద్వారా కొత్త మార్కెట్లను అందుకోవచ్చనే ఆలోచనకు బలం చేకూరుతోంది. 418 సినిమా విషయంలో కూడా ట్రైలర్‌కు వచ్చిన రెస్పాన్స్ తో పాటు సెలెక్టెడ్ ఆడియన్స్, ఇండస్ట్రీ వర్గాల నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ సినిమాను మరింత భారీ స్థాయిలో తీసుకెళ్లాలనే ఆలోచనకు దారితీసినట్లు కనిపిస్తోంది.
ఈ కారణాల వల్ల సినిమాను ముందుగా సెప్టెంబర్ 18న రిలీజ్ చేయాలని మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికీప ఇప్పుడు మరిన్ని భాషల్లో, ముఖ్యంగా హిందీలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేలా రిలీజ్ ప్లాన్‌ను విస్తరించే ఉద్దేశంతో ఆ డేట్‌ను పోస్ట్‌పోన్ చేశారు. కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేయనున్నారు. అంటే ఈ పోస్ట్‌పోన్ కేవలం ఆలస్యంగా కాకుండా.. సినిమాకు మరింత పెద్ద మార్కెట్‌ను వెతికే ప్రయత్నంగా మారింది. హారర్ సినిమాలకు కూడా పాన్ ఇండియా స్థాయి మార్కెట్ సాధ్యమేనా అనే డిస్కషన్ కు 418 ఒక పరీక్షగా మారడం ఆసక్తికరంగా కనిపిస్తోంది.