దుల్కర్, జీవీ ప్రకాష్ 'రాధే రాధే'.. స్పెషల్ ఏమిటంటే..

దుల్కర్ సల్మాన్ సినిమాలు అప్పుడప్పుడు ఒక ఫీల్ గుడ్ మ్యూజికల్ జర్నీలా ఉంటాయి.

Update: 2026-11-01 15:04 GMT

దుల్కర్ సల్మాన్ సినిమాలు అప్పుడప్పుడు ఒక ఫీల్ గుడ్ మ్యూజికల్ జర్నీలా ఉంటాయి. ప్రస్తుతం పవన్ సాధినేని దర్శకత్వంలో ఆయన చేస్తున్న 'ఆకాశంలో ఒక తార' (AOT) కూడా అదే ట్రాక్ లో నడుస్తోంది. నవంబర్ 20న రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం మేకర్స్ కొత్త తరహా ప్రమోషన్స్ ప్లాన్ చేశారు. లేటెస్ట్ గా దుల్కర్, మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కలిసి చేసిన 'రాధే రాధే' మ్యూజికల్ కాన్వర్సేషన్ వీడియో ప్రస్తుతం నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.





 


ఒక లైవ్ కాన్సెర్ట్ సెటప్ లో కూర్చుని పాట పాడుతూ సినిమా గురించి, పాటల గురించి ఈ ఇద్దరూ మాట్లాడుకున్న విధానం చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమా ఎంత అందంగా ఉంటుందో, దానికి ప్రాణం పోసిన ఈ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ కూడా అంతే బ్యూటిఫుల్ గా కనిపించింది. గడిచిన ఐదేళ్లలో తాను విన్న బెస్ట్ స్క్రిప్ట్ ఇదేనని జీవీ ప్రకాష్ చెప్పడం, ఈ సినిమాపై ఆయనకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఈ కాన్వర్సేషన్ ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది.

ఈ చిట్ చాట్ లో దుల్కర్ పంచుకున్న ఒక ఆసక్తికరమైన విషయం అందరినీ ఆకర్షించింది. తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అయిన లక్కీ భాస్కర్ సినిమా కంటే ముందే ఆకాశంలో ఒక తార కథను విన్నానని చెప్పి సర్ప్రైజ్ చేశారు. ఆ తర్వాతే మంచి ప్రాజెక్టులు తన దగ్గరకు వచ్చాయని, ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఈ కంటెంట్ దగ్గరికే రావడం డెస్టినీ అని ఆయన చెప్పిన తీరు సినిమాలోని ఎమోషన్ ను హైలైట్ చేసింది.

రాధే రాధే పాట గురించి మాట్లాడుతూ, ఆకాశం కుటుంబం మొత్తం కనెక్ట్ అయిన సాంగ్ ఇదని జీవీ ప్రకాష్ గుర్తుచేసుకున్నారు. గుజరాత్ లోని సహజమైన లొకేషన్లలో దుల్కర్ ప్రయాణాన్ని చూపిస్తూ ఈ పాటను చిత్రీకరించిన విధానం, ఆ విజువల్స్ తనను మరో లోకంలోకి తీసుకెళ్లాయని చెప్పారు. శ్రీమణి అందించిన తెలుగు సాహిత్యం, మిగతా భాషల్లో కేవలం అనువాదంలా కాకుండా ఆయా భాషల నేటివిటీకి తగ్గట్టుగా రాయించామని చెప్పడం విశేషం.

సినిమా టైటిల్ గురించి దుల్కర్ చెప్పిన పాయింట్ కూడా ఆకట్టుకుంది. ఆకాశంలో ఒక తార అంటే కేవలం ఆకాశంలో ఉన్న నక్షత్రం మాత్రమే కాదని, ప్రతి ఆడపిల్ల కలలు కనాలని, ఆ కలలను సాకారం చేసుకోవచ్చని చెప్పే కథ ఇది అని క్లారిటీ ఇచ్చారు. ఒక చిన్న పల్లెటూరి నుంచి వచ్చిన అమ్మాయికి కూడా పెద్ద కలలు ఉండొచ్చని, వాటిని ఎలా సాధిస్తుందనే పాయింట్ తో ఈ కథ రూపుదిద్దుకుందని చెప్పారు. ఈ ఎమోషన్ వల్లే సినిమాకు ప్రాణం వచ్చిందని వివరించారు.

కమర్షియల్ హంగామాకు దూరంగా, మంచి సోల్ ఉన్న కథలను మాత్రమే ఎంచుకునే దుల్కర్, ఈ సినిమాతో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమయ్యారు. జీవీ ప్రకాష్ లాంటి ప్యాషనేట్ మ్యూజిక్ డైరెక్టర్ తోడవ్వడంతో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 20న థియేటర్లలోకి రాబోతున్న ఈ సోల్ ఫుల్ జర్నీ కోసం ప్రేక్షకులతో పాటు మేకర్స్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మరోసారి క్లాస్ సినిమా సత్తా చాటేలా ఈ చిత్రం కనిపిస్తోంది.




Tags:    

Similar News