క్రియేటివిటీ పీక్స్: RC17 పోస్టర్‌తోనే సుక్కూ మాస్టర్ స్ట్రోక్ ఆ లెవల్లో!
`రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో సినిమా గురించి అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే.
నెమలి పించం.. పొడవాటి గిరజాల జుట్టు.. గుబురు గడ్డం.. ఆ మూడింటిని మెర్జ్ చేసిన పోస్టర్.. లాంచింగ్ డే ఈ సరికొత్త ట్విస్టేంటి? మాస్టర్ మైండ్ సుకుమార్ క్రియేటివిటీ పీక్స్ లో వికశించింది! ఆర్.సి 17 పోస్టర్ ని విశ్లేషిస్తే అదీ సంగతి..
`రంగస్థలం` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ - సుకుమార్ కలయికలో సినిమా గురించి అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్న సంగతి తెలిసిందే. అన్నిటికీ తెర దించుతూ నేడు RC17 పూజా కార్యక్రమాలతో హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైన విషయం తెలిసిందే. మెగాస్టార్ అతిథిగా సినిమాని లాంచ్ చేయగా చిత్రబృందం పాల్గొంది.
ఈ ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ చూస్తే సుకుమార్ లోని క్రియేటివిటీ - కళాత్మక పంథా స్పష్టంగా అర్థమవుతోంది. నెమలి పించం.. పొడవాటి గిరజాల జుట్టు.. గుబురు గడ్డం..ఈ మూడింటినీ అత్యంత ప్రతిభావంతంగా మెర్జ్ చేస్తూ రూపొందించిన ఈ డిజైనర్ లుక్ సుక్కూ విజన్‌కు అద్దం పడుతోంది. నీలం, ఆకుపచ్చ, బంగారు రంగుల కుంచెల టచ్ తో నెమలి పించం ఆకారంలో రామ్ చరణ్ ప్రొఫైల్‌ను మెర్జ్ చేస్తూ తెచ్చిన ఈ ఆర్టిస్టిక్ ప్రీ-లుక్ కేవలం ఒక క్రియేటివ్ లుక్ మాత్రమే కాదు.. ఈ సినిమా కథానాయకుడు ఎలా కనిపిస్తాడు? కథలో ఇంటెన్స్ టోన్ ఎలా ఉండబోతోందో హింట్ ఇస్తోంది.
దీనికి జోడించిన `యు కెన్ ఇమాజిన్` అనే ట్యాగ్‌లైన్ అభిమానుల ఊహలకు, అంచనాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఒక ఊహాతీతమైన, కొత్త సినిమాటిక్ ప్రపంచాన్ని సుకుమార్ ఆవిష్కరించబోతున్నారనే గొప్ప కుతూహలాన్ని పెంచుతోంది. ఒక చిన్న విజువల్ ఎలిమెంట్‌తో కథలోని అంతరార్థాన్ని, హీరో పాత్రలోని ప్రత్యేకతను ప్రతిబింబించేలా చేయడం సుకుమార్‌కు మాత్రమే చెల్లిన ప్రత్యేక విద్య. ఈ పోస్టర్ చూడగానే ఆయన ఆలోచనా విధానాన్ని, పోస్టర్ డిజైనింగ్‌లో అతడు చూపించిన సృజనాత్మక శైలిని ప్రశంసించకుండా ఉండలేము.
ఈ ప్రాజెక్ట్ కోసం రామ్ చరణ్ సరికొత్త మేకోవర్‌ను ప్రయత్నిస్తున్నారని లాంచింగ్ ఈవెంట్ లో అతడి లుక్ చెబుతోంది. ఆర్.ఆర్.ఆర్ లోని అల్లూరి సీతారామరాజు పాత్ర తర్వాత మళ్లీ పొడవాటి జుట్టు .. వైల్డ్ ఇంటెన్స్ రగ్గడ్ లుక్‌లో అతడు కనిపిస్తున్నాడు. ఈ పాత్ర రూపకల్పన - బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ కోసం చరణ్ ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. `చిట్టిబాబు` వంటి చారిత్రాత్మక పాత్రను అందించిన సుకుమార్, ఈ సినిమాలో చరణ్‌లోని అసలైన నటనను.. సరికొత్త ఎమోషనల్ యాక్షన్ షేడ్స్‌ను మరింత లార్జర్ ద్యాన్ లైఫ్ స్థాయిలో వెలికితీసేందుకు పక్కా ప్లాన్‌తో సిద్ధమయ్యారు.
మైత్రీ మూవీ మేకర్స్- సుకుమార్ రైటింగ్స్- టి సిరీస్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ ఎపిక్ ఎంటర్‌టైనర్ భారతీయ చలనచిత్ర రంగానికి మరొక మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం దీనికి అదనపు బలం. ఈ పాన్-ఇండియా విజువల్ వండర్‌ను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మాస్టర్ మైండ్ సుకుమార్ - హార్డ్ వర్కింగ్ స్టార్ రామ్ చరణ్ కలసి ఈ భారీ మాస్ యాక్షన్ విందును ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులకు అందించనున్నారు.