53వ ఏట వరల్డ్ క్వీన్ ఐశ్వర్య రాయ్ సంపద ఎంతంటే?
ప్రపంచ సుందరిగా కీర్తిగడించి.. భారతీయ సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అగ్రకథానాయిక ఐశ్వర్య రాయ్ బచ్చన్ జీవితంలో మరో మైలురాయిని అందుకున్నారు.
ప్రపంచ సుందరిగా కీర్తిగడించి.. భారతీయ సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన అగ్రకథానాయిక ఐశ్వర్య రాయ్ బచ్చన్ జీవితంలో మరో మైలురాయిని అందుకున్నారు. నవంబర్ 1న 53వ పుట్టినరోజును జరుపుకుంటున్న బ్యూటీ క్వీన్ మూడు దశాబ్దాల ప్రయాణంలో నటనతో పాటు వ్యాపార రంగంలోనూ అసాధారణ విజయాలు అందుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఐష్ వ్యక్తిగత సంపదకు సంబంధించిన అంచనాలు చర్చనీయాంశంగా మారాయి. ఆర్థిక అంచనాల సంస్థల ప్రకారం ఐశ్వర్య రాయ్ నికర ఆస్తుల విలువ దాదాపు 100 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు 830 కోట్లకు పైగా) ఉంటుందని అంచనా.
నటనకే పరిమితం కాకుండా గ్లోబల్ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ఐశ్వర్య తనకంటూ ప్రత్యేక ఆర్థిక స్థిరత్వాన్ని సృష్టించుకున్నారు. అంతర్జాతీయ సౌందర్య సాధనాల సంస్థలు .. లగ్జరీ వాచ్ బ్రాండ్లతో ఆమెకు దశాబ్దాలుగా ఉన్న అనుబంధం ఐష్ వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించింది. విదేశాల్లోనూ భారతీయ సినిమా గళాన్ని వినిపిస్తూ గ్లోబల్ బ్రాండ్ క్యాంపెయిన్లలో స్థానం సంపాదించుకున్న తొలి భారతీయ నటీమణులలో ఐష్ ఒకరుగా నిలిచారు. సినిమాలతో పాటు ఎండార్స్మెంట్ల ద్వారా వచ్చే ఆదాయమే ఆమె సంపదను భారీగా పెంచడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
బచ్చన్ కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ ఆస్తుల విషయానికి వస్తే ముంబైలోని ప్రముఖ ప్రాంతాలతో పాటు దుబాయ్‌లోని పామ్ జుమేరా (సానిక్టరీ ఫాల్స్) ప్రాంతంలో 16 కోట్ల విలువైన లగ్జరీ విల్లాను కూడా ఈ దంపతులు కలిగి ఉన్నారు. ముంబైలోని బొరివలి, ములుంద్ ప్రాంతాల్లో బచ్చన్ కుటుంబానికి ఉన్న బహుళ అపార్ట్మెంట్లు ..నివాసాలు వారి భారీ ఆస్తుల జాబితాలో భాగమై ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక అంచనాలు వివిధ బహిరంగ నివేదికలు ..పబ్లిక్ సోర్సెస్ ఆధారంగా రూపొందించబడినవే అయినా? ఐష్ రేంజ్ ఏంటో ఇవి చెప్పకనే చెబుతున్నాయి.
వెండితెరపై ఐశ్వర్యారాయ్ చివరిసారిగా మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన `పొన్నియిన్ సెల్వన్: II`లో నందిని -ఊమై రాణిగా ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అటుపై గ్యాప్ తీసుకున్నా? ఆమె గ్లామర్, గ్లోబల్ ప్రొఫైల్ , బ్రాండ్ వాల్యూ ఏమాత్రం తగ్గలేదని చెప్పడానికి ఆమె పుట్టినరోజు సందర్భంగా ట్రెండ్ అవుతున్న వార్తలే నిదర్శనం.
భారతీయ చలనచిత్ర పరిశ్రమకు ఐశ్వర్యారాయ్ అందించిన సేవలు, విదేశీ వేదికలపై ప్రదర్శించిన ప్రతిభ ప్రశంసలనే కాకుండా బలమైన ఆర్థిక ఆధారాన్ని కూడా తెచ్చిపెట్టాయి. మాజీ మిస్ వరల్డ్‌గా గ్లామర్‌ను నిలబెట్టుకుంటూనే కుటుంబ బాధ్యతలను ..వ్యాపార సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్న తీరు నేటి యువ నటీమణులకు గొప్ప పాఠం లాంటిది.
53వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటిగా మాత్రమే కాకుండా శక్తివంతమైన గ్లోబల్ ఐకాన్‌గా ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఐష్ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లు విజయవంతం కావాలని, మరిన్ని అద్భుతమైన పాత్రలతో మళ్లీ అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.