సూప‌ర్ స్టార్‌ని వెన‌క్కి నెట్టిన ఐకాన్ స్టార్‌!

జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత స్టార్స్ చేసే ప్ర‌తి సినిమా లార్జెన్ దెన్ లైఫ్ మూవీగానే చేయాల‌ని చూస్తున్నారు.;

Update: 2026-02-14 15:30 GMT

జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన `బాహుబ‌లి` సిరీస్ త‌రువాత స్టార్స్ చేసే ప్ర‌తి సినిమా లార్జెన్ దెన్ లైఫ్ మూవీగానే చేయాల‌ని చూస్తున్నారు. అలాంటి క‌థ‌ల‌నే ఎంచుకుంటున్నారు. బ‌డ్జెట్ విష‌యంలోనూ ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. ప్ర‌తీదీ భారీ స్థాయిలోనే ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో సినిమా బ‌డ్జెట్‌లు ప‌తాక స్థాయికి చేరుకుంటున్నాయి. బ‌డ్జెట్‌ని బ‌ట్టి స్టార్ల పారితోషికాలు కూడా చుక్క‌ల‌ని తాకుతుండ‌టం తెలిసిందే. ఒక‌ప్పుడు భారీ స్థాయిలో రికార్డు స్థాయి పారితోషికాలు అనేవి బాలీవుడ్ వ‌ర‌కే ప‌రిమితంగా ఉండేవి.

కానీ ద‌క్షిణాదిలో పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ మొద‌ల‌య్యాక అది ద‌క్షిణాదికి కూడా పాకింది. ప్ర‌పంచ సినిమాతో పోలిస్తే ఇండియాలోనే సినిమాల నిర్మాణం ఎక్కువ‌. సినిమాల హ‌డావిడీ కూడా ఎక్కువే. బాలీవుడ్ టు టాలీవుడ్ వ‌ర‌కు స్టార్స్ కూడా ఎక్కువే. అయితే పాన్ ఇండియా సినిమాల ప్ర‌వాహం పెరిగిన స్టార్స్ భారీ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ని సొంతం చేసుకుంటున్న నేప‌థ్యంలో ఇండియాలో అత్య‌ధిక‌పారితోషికాన్ని అందుకుంటున్న టాప్ 3 స్టార్స్ ఎవర‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఈ జాబితాలో ఇండియా వైడ్‌గా నిలిచింది ముగ్గురు స్టార్స్. బాలీవుడ్ హీరో షారుక్‌ ఖాన్. టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్‌, కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌. అత్య‌ధిక పారితోషికాన్ని తీసుకుంటూ షారుక్‌ ఖాన్ మొద‌టి స్థానంలో నిలిచాడు. రెండ‌వ స్థానంలో ర‌జ‌నీకాంత్‌ని వెన‌క్కి నెట్టి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలవ‌డం గ‌మ‌నార్హం. మూడ‌వ స్థానంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ నిలిచారు. పారితోషికం విష‌యంలో ఫార్మాట్‌ని మార్చిన ఈ స్టార్స్ ఇప్పుడు సినిమా లాభాల్లో వాటాల‌ని పారితోషికాలుగా డిమాండ్ చేస్తుండ‌టం తెలిసిందే.

బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్‌షాగా పేరు తెచ్చుకున్న షారుక్ ఖాన్ వ‌రుస ఫ్లాపుల త‌రువాత `ప‌ఠాన్‌`తో మ‌ళ్లీ ట్రాక్‌లోకి రావ‌డం తెలిసిందే. ఈ సినిమా లాభాల్లో త‌న వాటా కింద షారుక్ రూ.350 కోట్లు తీసుకున్నాడు. ఇండియ‌న్ సినిమాల్లో ఓ మీరో ఇంత పెద్ద మొత్తంలో పారితోషికంగా తీసుకోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైమ్‌. ఇంత మొత్తం ద‌క్కించుకోవ‌డంతో షారుక్ ఇండియ‌న్ హీరోల్లో అత్య‌ధిక మొత్తం అందుకుంటున్న హీరోగా మొద‌టి స్థానంలో నిలిచాడు. ఆ త‌రువాత స్థానంలో బ‌న్నీ వ‌చ్చి చేరాడు. పుష్ప‌, పుష్ప 2 సినిమాల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌ల‌ని సొంతం చేసుకున్న బ‌న్నీ రూ.300 కోట్లు డిమాండ్ చేస్తున్నాడు.

ఈ జాబితాలో సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ మూడవ స్థానంలో నిలుస్తున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ డైరెక్ష‌న్‌లో ర‌జ‌నీ న‌టించిన మూవీ `జైల‌ర్‌`. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని రజ‌నీ కెరీర్‌లోనే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఈ సినిమా నుంచే ర‌జ‌నీ రూ.200 కోట్ల‌కు మించి ఒక్కో సినిమాకు డిమాండ్‌చేస్తున్నార‌ట‌. అయితే ప్ర‌స్తుతం చేస్తున్న 174వ ప్రాజెక్ట్‌కు మాత్రం ఆ మొత్తాన్ని పెంచేశార‌ని, రూ.225 కోట్లు ఈ ప్రాజెక్ట్‌కు తీసుకుంటున్నార‌ని తెలిసింది. రానున్న రోజుల్లో ఈ జాబితాలోకి మ‌హేష్ వ‌చ్చి చేర‌తాడా?.. లేక ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌లు చేర‌తారా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News