నాకు చాలా పెద్ద హై మూవ్‌మెంట్ ఇది!

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్‌గా ఎద‌గాలంటే ముందు ఉండాల్సింది టాలెంట్.. భారీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్. అది ఉంటే ఇక్క‌డ ఎద‌గ‌డం చాలా ఈజీ అని నిరూపించిన వారు ఉన్నారు.;

Update: 2026-02-14 19:00 GMT

సినిమా ఇండ‌స్ట్రీలో స్టార్‌గా ఎద‌గాలంటే ముందు ఉండాల్సింది టాలెంట్.. భారీ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్. అది ఉంటే ఇక్క‌డ ఎద‌గ‌డం చాలా ఈజీ అని నిరూపించిన వారు ఉన్నారు. అయితే ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఎంత ఉన్నా టాలెంట్ ఉంటేనే ఎదుగుద‌ల అని నిరూపించిన వారూ కూడా ఉన్నారు. ఎంత టాలెంట్ ఉన్నా.. టాలీవుడ్‌లో ఉన్న ఎన్ని క్రేజీ ప్రొడ‌క్ష‌న్ కంప‌నీలు స‌పోర్ట్ చేసినా అదృష్టంతో పాటు కాలం క‌లిసి వ‌స్తేనే స‌క్సెస్ అని చాలా మంది విష‌యంలో నిజ‌మైంది. అలాంటి ప‌రిస్థితినే ఇంత కాలం ఎదుర్కొంటూ వ‌చ్చాడు యంగ్ హీరో సంతోష్ శోభ‌న్‌.

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌కు `వ‌ర్షం` మూవీతో క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్‌ని అందించి ఆయ‌న‌ కెరీర్‌ని మ‌లుపు తిప్పిన డైరెక్ట‌ర్ శోభ‌న్ త‌న‌యుడే సంతోష్ శోభ‌న్‌. ఆ కృత‌జ్ఞ‌త‌తో సంతోష్ శోభ‌న్‌కు ప్ర‌భాస్ గ‌త కొంత కాలంగా త‌న వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తూ వ‌స్తున్నాడు. త‌న‌ని హీరోగా నిల‌బెట్టాల‌ని త‌న‌కు తోచిన స‌హాయం చేస్తూ వ‌చ్చాడు. ఫైన‌ల్‌గా ఆయ‌న ప్ర‌య‌త్నం ఫ‌లించింది.. సంతోష్ శోభ‌న్ ఇన్నాళ్ల‌కు మంచి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకోవ‌డంతో ప్ర‌భాస్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌జేయ‌డం ఆకట్టుకుంటోంది.

సంతోష్ శోభ‌న్ న‌టించిన లేటెస్ట్ మూవీ `క‌పుల్ ఫ్రెండ్లీ`. అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ ద‌ర్శ‌కుడు. మాన‌స వార‌ణాసి క‌థానాయిక‌గా న‌టించిన ఈ రొమాంటిక్ ల‌వ్ డ్రామా ఈ శ‌నివారం `వాలెంటైన్స్ డే` సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఫ‌స్ట్ షోతోనే హిట్ టాక్‌ని సొంతం చేసుకుని సంతోష్ శోభ‌న్‌కు చాలా రోజుల త‌రువాత స‌క్సెస్‌ని అందించింది. ఈ మూవీ స‌క్సెస్‌తో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఫుల్ ఖుషీ అయ్యారు. టీమ్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు.

ఇది సంతోష్ శోభ‌న్‌కు అంతులేని ఆనందాన్ని క‌లిగించింది. `నార్మ‌ల్‌గా ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ని షేర్ చేసుకోవ‌డానికి చాలా ఇబ్బందిక‌రంగా ఫీల‌వుతాను. ఆలోచిస్తాను. కానీ ఈ సంద‌ర్భంగా ఓ విష‌యాన్ని షేర్ చేసుకుంటున్నాను. నాకు చాలా పెద్ద హై మూవ్‌మెంట్ ఏంటంటే ప్ర‌భాస్ అన్న సినిమా చూశారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. ఆయ‌న ద‌గ్గ‌రి నుంచి `కంగ్రాట్యూలేష‌న్స్` అని వ‌స్తుంద‌ని నేను ఏరోజు అనుకోలేదు. `కంగ్రాట్యూలేష‌న్స్` అనేది చాలా చాలా పెద్ద విష‌యం నాకు. ఆ మాట విన‌గానే నేను గెలిచేశాన‌నే ఫీలింగ్ వ‌స్తోంది డార్లింగ్‌` అంటూ సంతోష్ శోభ‌న్ త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేయ‌డం ఆక‌ట్టుకుంటోంది.

గ‌త కొంత కాలంగా సంతోష్ శోభ‌న్ స‌రైన హిట్టు కోసం ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాడు. త‌ను స‌క్సెస్ కావాల‌ని, రేసులో ఉండాల‌ని ప్ర‌భాస్ త‌న వంతు స‌హాయం చేస్తూ వ‌స్తున్నారు. యువీ కాన్సెప్ట్స్‌ (ప్ర‌భాస్‌), గోల్డ్ బాక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (కొణిదెల సుస్మిత), స్వ‌ప్న సినిమా (ప్రియాంక ద‌త్‌) వంటి ఎన్నో పెద్ద పెద్ద ప్రొడ‌క్ష‌న్ కంప‌నీల్లో సంతోష్ శోభ‌న్ సినిమాలు చేశాడు. కానీ ఏది కూడా అత‌నికి స‌క్సెస్‌ని అందించ‌లేక‌పోయింది. ఫైన‌ల్‌గా ఇప్ప‌టికి `క‌పుల్ ఫ్రెండ్లీ`తో స‌క్సెస్ ల‌భించింది.

Tags:    

Similar News