ప్రభాస్ సినిమా.. హార్ట్ అయిన హీరోయిన్

తను ‘ది రాజాసాబ్’ కోసం నిజంగానే రిస్క్ తీసుకుని స్టంట్స్ చేశానని నిరూపించడానికి మాళవిక కొన్ని మేకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.;

Update: 2026-02-14 13:00 GMT

ఈ మధ్య కాలంలో సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో ట్రోల్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాల్లో చిన్న పొరపాటు దొరికినా నెటిజన్లు వదిలిపెట్టడం లేదు.రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ది రాజాసాబ్’ విషయంలో కూడా ఇదే జరుగుతోంది. సినిమాలో వాడిన గ్రాఫిక్స్, బాడీ డబుల్స్ మీద వస్తున్న విమర్శలు హీరోయిన్ మాళవిక మోహనన్‌ను బాగా ఇబ్బంది పెట్టినట్లు కనిపిస్తోంది.

సాధారణంగా నటీనటులు తమపై వచ్చే విమర్శలను పట్టించుకోరు. కానీ కొన్నిసార్లు తాము పడ్డ కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తే ఎవరికైనా కోపం రావడం సహజం. మాళవిక విషయంలో కూడా అదే జరిగింది. ఆమె తన సొంతంగా స్టంట్స్ చేయలేదని, కేవలం బాడీ డబుల్స్ తోనే పనైపోయిందని వస్తున్న కథనాలు ఆమెను బాగా హర్ట్ చేశాయి. అందుకే ఈసారి కేవలం మాటలతో కాకుండా, ఏకంగా సాక్ష్యాలతో రంగంలోకి దిగింది ఈ ముద్దుగుమ్మ.

తను ‘ది రాజాసాబ్’ కోసం నిజంగానే రిస్క్ తీసుకుని స్టంట్స్ చేశానని నిరూపించడానికి మాళవిక కొన్ని మేకింగ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నెట్టింట వైరల్ అవుతున్న బాడీ డబుల్ ఫోటోలపై క్లారిటీ ఇస్తూ.. తను చిన్నప్పటి నుండే చాలా స్పోర్టివ్‌గా ఉంటానని, ఫిజికల్‌గా ఛాలెంజింగ్ పనులు చేయడం తనకి ఇష్టమని క్లియర్ గా చెప్పేసింది. కేవలం షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా, ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసం తను పడ్డ కష్టాన్ని కళ్లకి కట్టినట్టు చూపించింది.

ప్రతి సినిమాలోనూ స్టంట్ డబుల్స్ ఉండటం సర్వసాధారణమని, రిస్క్ ఎక్కువగా ఉన్న సీన్లలో లేదా రిహార్సల్స్ టైమ్ లో ప్రొఫెషనల్స్ హెల్ప్ తీసుకోవడం తప్పేమీ కాదని ఆమె వివరించింది. నిపుణులు చెప్పినట్లుగా షాట్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం తను కూడా చాలా ప్రాక్టీస్ చేశానని వీడియోల ద్వారా ప్రూవ్ చేసింది. బాడీ డబుల్ సెటైర్లకు చెక్ పెట్టడానికే ఆమె ఈ రేంజ్ లో స్పందించినట్లు అర్థమవుతోంది. తనకి శిక్షణ ఇచ్చిన స్టంట్ డబుల్ కి కూడా ఆమె కృతజ్ఞతలు చెప్పడం విశేషం.

సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా, ఒక నటిగా తను పెట్టిన ఎఫర్ట్స్ ని తక్కువ చేయొద్దని మాళవిక పరోక్షంగా కోరింది. సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివిటీని చూస్తూ కూర్చోకుండా, పక్కాగా వీడియో సాక్ష్యాలతో సమాధానం ఇవ్వడం చూస్తుంటే ఆమె డెడికేషన్ క్లియర్ గా తెలుస్తోంది. ఈ వీడియోలు చూసిన తర్వాత అయినా ట్రోలర్స్ తమ రూటు మారుస్తారేమో చూడాలి. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మాళవిక తెగువను చూసి అప్రిషియేట్ చేస్తున్నారు.

‘రాజాసాబ్’ ట్రోల్స్ పర్వంలో మాళవిక మోహనన్ తన వంతుగా గట్టి కౌంటర్ ఇచ్చి సైలెంట్ చేసే ప్రయత్నం చేసింది. కష్టపడి చేసిన పనికి గుర్తింపు రాకపోయినా పర్లేదు కానీ, చేయలేదని ముద్ర వేయడం మాత్రం కరెక్ట్ కాదని ఆమె చెప్పకనే చేపింది. మరి ఈ వివరణ తర్వాత నెటిజన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. మాళవిక షేర్ చేసిన ఆ యాక్షన్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి.


Tags:    

Similar News