పారితోషికంలో చుక్కలు చూపిస్తున్న భామలు
ఐశ్వర్యారాయ్ , అనుష్క శర్మ కెరీర్ ఇటీవల స్లో ఫేజ్ లో ఉంది. ఐష్ 40 ప్లస్ ఏజ్ లో సినిమాలను తగ్గించగా మణిరత్నం `పొన్నియన్ సెల్వన్`తో కంబ్యాక్ అయ్యారు.;
భారతదేశంలో 100 కోట్లు, అదనంగా లాభాల్లో వాటాలు తీసుకుంటున్న హీరోలకు కొదవేమీ లేదు. 200-300 కోట్ల పారితోషికాలు అందుకున్న హీరోల గురించి చాలా చర్చ సాగుతోంది. కానీ స్టార్ హీరోలతో సమానంగా సినిమా ఆద్యంతం కనిపించే కథానాయికలకు ఇచ్చే పారితోషికాలు ఆ స్థాయిలో ఎందుకు లేవు? చాలా మంది సీనియర్ కథానాయికలు దీనిని ఎప్పుడూ నిలదీస్తూనే ఉన్నారు. హీరోలకు తాము ఎందులోను తక్కువ కాదని బహిరంగంగా వాదించే కథానాయికలు ఉన్నారు. దీపిక, కత్రిన, ఆలియా, కరీనా, నయనతార లాంటి స్టార్లు పలు సందర్భాల్లో రెమ్యునరేషన్ వ్యత్యాసంపై అసహనం వ్యక్తం చేసారు.
అయినా కథానాయికలు కూడా కోట్లాది రూపాయల పారితోషికాలు అందుకుంటున్న జాబితాలో ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి చిత్రం కోసం ఏకంగా 25-30 కోట్ల పారితోషికం అందుకుంటున్న ప్రియాంక చోప్రా టాప్ ఎర్నర్ గా మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చారు. ప్రియాంక చోప్రా హాలీవుడ్ లోను పాపులర్ నటి. అందువల్ల వారణాసి (ఎస్.ఎస్.ఎం.బి 29) టీమ్ ఇంత పెద్ద మొత్తాన్ని పీసీకి ఆఫర్ చేసారని తెలిసింది. ఇప్పటివరకూ భారతదేశంలో ఒక కథానాయికకు ఇదే అత్యుత్తమ పారితోషకం. ఇక దీపిక పదుకొనే కల్కి 2898 ఏడి చిత్రానికి 20కోట్లు డిమాండ్ చేయగా నిర్మాతలు 18కోట్లు చెల్లించారని కూడా కథనాలొచ్చాయి. క్వీన్ కంగన రనౌత్ తను వెడ్స్ మను, క్వీన్ ఫ్రాంఛైజీలతో ఫామ్ లో ఉన్నప్పుడు ఏకంగా 15-30 కోట్ల మధ్య అందుకుందని కథనాలొచ్చాయి. కానీ ఇటీవల కంగన డౌన్ ట్రెండ్ లో ఉంది. కొన్ని వరస పరాజయాలతో తన మార్కెట్ పడిపోవడంతో పారితోషికం రేంజు భారీగా తగ్గించిందని తెలిసింది.
వరుస సక్సెస్ లతో దూకుడు ప్రదర్శిస్తున్న ఆలియా భట్ ఏకంగా 8-15 కోట్ల మధ్య అందుకుంటోందని కథనాలొస్తున్నాయి. ఆలియా కూడా దీపిక, ప్రియాంక చోప్రాకు ధీటుగా ఇప్పుడు స్టంట్స్ చేసేందుకు సిద్ధమవుతోంది. యష్ రాజ్ ఫిలింస్ నిర్మిస్తున్న ప్రతిష్ఠాత్మక స్పై చిత్రం `ఆల్పా`లో ఆలియా స్టంట్స్ అభిమానులకు స్పెషల్ ట్రీటివ్వనున్నాయి. ఈ సినిమా కోసం ఆలియా సుమారు 14 కోట్లు అందుకుంటోందని సమాచారం. స్త్రీ2తో బంపర్ హిట్ అందుకున్న శ్రద్ధాకపూర్ భారీగా పారితోషికం పెంచేసింది. ఈ భామ కూడా 10- 12 కోట్ల రేంజులో డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపించాయి.
ఇటీవల హాలీవుడ్ హీరోయిన్ల తరహాలో యాక్షన్ పాత్రల్లో కథానాయికలు అవకాశాలు అందుకుంటున్నారు. స్టార్ హీరోలతో పోటీపడుతూ నాయికలు రిస్కీ స్టంట్స్ చేస్తున్నారు. దీపిక పదుకొనే, ప్రియాంక చోప్రా, ఆలియా, సమంత, నయనతార సహా పలువురు కథానాయికలు రిస్కీ యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నారు. దీంతో వీరంతా భారీ పారితోషికాల్లో ట్రెండ్ ని మార్చే దిశగా సాగుతున్నారు. ప్రియాంక చోప్రా, దీపిక పదుకొనే, ఆలియా భట్ .. ఈ ముగ్గురూ ఇటీవల భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. దానికి తగ్గట్టు పారితోషికాల్లోను టాప్ లో ఉన్నారు.
నయనతార, సమంత సౌత్ క్వీన్స్ గా హృదయాలను ఏల్తున్నారు. ఆ ఇద్దరూ స్టంట్స్ తోను ఆకట్టుకుంటున్నారు. శ్రద్ధా కపూర్ సెలెక్టివ్‌గా ఉన్నా రేంజును పెంచుకునేందుకు చాలా హార్డ్ వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరంతా చెప్పుకోదగ్గ రేంజులో పారితోషికాలు అందుకుంటున్నారు. అయితే పైన లెక్కలన్నీ అధికారికమైనవి కావు. రకరకాల సోర్సెస్ నుంచి సేకరించిన వివరాలు మాత్రమే. సక్సెస్ రేటు, ప్రజల్లో క్రేజ్ ను బట్టి స్టార్ల పారితోషికాలు మారుతూనే ఉంటాయి. ఈ రంగంలో స్థిరంగా పారితోషికాలు అందుకోవడం కుదరదు. సక్సెస్ రేటు ప్రతిదీ నిర్ణయిస్తుంది.
భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నాయికలు:
ప్రియాంక చోప్రా 20 - 30 కోట్లు
దీపికా పదుకొనే 15 - 20 కోట్లు
ఆలియా భట్ 10- 20 కోట్లు
కరీనా కపూర్ 8-12 కోట్లు
కంగనా రనౌత్- 8-10 కోట్లు
శ్రద్ధా కపూర్ 8-12ట్లు
విద్యాబాలన్ 3- 4 కోట్లు
దిశా పటానీ 4 -8 కోట్లు
నయనతార 6- 10కోట్లు
సమంత- 4 కోట్లు
పూజా హెగ్డే- 3 కోట్లు
కాజోల్ 2 - 4 కోట్లు
కృతి సనన్ 3 -4 కోట్లు
మాధురీ దీక్షిత్ 2-3 కోట్లు
మామ్ అయ్యాక రేంజ్ తగ్గిన కథానాయికలు:
ఐశ్వర్యారాయ్ , అనుష్క శర్మ కెరీర్ ఇటీవల స్లో ఫేజ్ లో ఉంది. ఐష్ 40 ప్లస్ ఏజ్ లో సినిమాలను తగ్గించగా మణిరత్నం `పొన్నియన్ సెల్వన్`తో కంబ్యాక్ అయ్యారు. 5కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నారని కథనాలొచ్చాయి. అలాగే కత్రినా కైఫ్ ఇటీవలే మామ్ అయ్యారు. 10-12 కోట్ల రేంజులో పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో ఉన్నా కానీ, కొంతకాలంగా కత్రిన సినిమాలకు దూరంగా ఉన్నారు. అనుష్క శర్మ 6 కోట్లు రేంజులో పారితోషికం అందుకున్నా, ఇటీవల సినిమాలు చేయడం లేదు. కియారా అద్వానీ 4-5 కోట్ల రేంజులో పారితోషికం అందుకుంటున్నారు. సిద్ధార్థ్ మల్హోత్రాను పెళ్లాడిన కియరా ఇటీవల మామ్ అయిన తర్వాత చాలా సినిమాలను వదులుకున్న సంగతి తెలిసిందే.