సినిమా నిర్మాణంలో మేనేజర్ల పాత్ర ఎలా ఉంటుందో ?
సినిమా అంటే? నిర్మాతలే నేరుగా రంగంలోకి దిగాలి. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతోంది? ఏయే విభాగాలకు ఎంత అవసరం? అనే విషయాలపై నిర్మాతకు పూర్తి అవగాహన ఉండాలి.;
సినిమా నిర్మాణం అంటే చిన్న విషయం కాదు. కోట్ల రూపాయల పెట్టుబడి. తెర ముందు జరిగేదే వాస్తవం అనుకో వడానికి లేదు. తెర వెనుక ఎన్నో జరుగుతుంటాయి. నిర్మాణంలో ప్రొడక్షన్ మేనేజర్ల పాత్ర ఎంతో కీలకమైంది.
షూటింగ్ లొకేషన్ల ఎంపిక నుండి నటీనటుల కాల్ షీట్లు సర్దుబాటు చేయడం, సెట్స్‌పై భోజన సదుపాయాలు రోజువారీ ఖర్చుల వరకు ప్రతిదీ మేనేజర్ల పర్యవేక్షణలోనే జరుగుతుంది.మేనేజర్ అంటే? నిర్మాతకు- చిత్ర యూనిట్‌కు మధ్య ఒక వారధిలా పనిచేస్తుంటారు. సినిమా సజావుగా సాగేలా చూడటం వీరి ప్రధాన బాధ్యత.
అయితే ఇటీవల కాలంలో సినిమా నిర్మాణ వ్యయం విపరీతంగా పెరిగిపోవడానికి మేనేజర్ల నిర్వహణ లోపాలే కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై ఓ నిర్మాత తాజా స్పందన అంతే ఆసక్తికరం. నిర్మాతలు కేవలం ఆఫీసుల్లో కూర్చుని మేనేజర్లపైనే పూర్తి భారం వేయడం వల్ల అనవసరపు ఖర్చులు పెరుగుతున్నాయన్నారు. మేనేజర్లు ఇచ్చే లెక్కలనే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల నిర్మాణ బడ్జెట్ అదుపు తప్పుతోందని హెచ్చరించారు.
సినిమా అంటే? నిర్మాతలే నేరుగా రంగంలోకి దిగాలి. ప్రతి రూపాయి ఎక్కడ ఖర్చు అవుతోంది? ఏయే విభాగాలకు ఎంత అవసరం? అనే విషయాలపై నిర్మాతకు పూర్తి అవగాహన ఉండాలి.
కేవలం మేనేజర్లపై ఆధారపడకుండా నిర్మాత స్వయంగా సెట్స్‌పై లో ఉండి పర్యవేక్షిస్తే కనీసం 10 నుండి 20 శాతం బడ్జెట్‌ను ఆదా చేయవచ్చని అభిప్రాయపడ్డారు. మేనేజర్ల పనితీరుపై నమ్మకం ఉన్నా? పర్యవేక్షణ లేకపోతే అది అశ్రద్ధకు దారితీస్తుందన్నది ఆయన భావనగా తెలుస్తోంది. సినిమా మేనేజర్లు కొన్నిసార్లు నటీనటుల రెమ్యున రేషన్లు లేదా ఇతర కాంట్రాక్టుల విషయంలో మధ్యవర్తులుగా ఉంటారు. నిర్మాతలకు వాస్తవ పరిస్థితులను తెలియనీ యకుండా చేస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనివల్ల నిర్మాతపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. కొత్తగా వస్తోన్న కొంత మంది నిర్మాతలు నిర్మాతలు పాత పద్ధతికి స్వస్తి పలికి డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.
దీనివల్ల సినిమా నాణ్యత పెరగడమే కాకుండా వృధా ఖర్చులు తగ్గుతున్నాయి. తక్కువ బడ్జెట్ లోనే మంచి ప్రోడక్ట్ అందించగల్గుతున్నారు..నిర్మాత నేరుగా రంగంలోకి దిగడం వల్ల టెక్నీషియన్లతో -నటీనటులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు మేనేజర్ల ద్వారా కాకుండా నేరుగా చర్చించి పరిష్కరించుకునే వీలుంటుంది. మేనేజర్ల పాత్రను పూర్తిగా కాదనలేము. కానీ వారిని కేవలం సహాయకులుగా మాత్రమే ఉంచుకోవాలని నిర్ణయాధికారం పర్యవేక్షణ మాత్రం నిర్మాత చేతుల్లోనే ఉండాలని మరి కొంతమంది నిర్మాతలు అభిప్రాయపడుతున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా సినిమా నిర్మాణ శైలి కూడా మారాలి. మేనేజర్ల వ్యవస్థపై అతిగా ఆధారపడటం వల్ల నిర్మాతలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఒక సినిమా హిట్టా ఫ్లాపా అన్నది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కానీ బడ్జెట్‌ను అదుపులో ఉంచుకోవడం మాత్రం నిర్మాత చేతుల్లోనే ఉంటుంది. నిర్మాతలు మేల్కొని నేరుగా బాధ్యతలు చేపడితేనే పరిశ్రమ ఆరోగ్యకరంగా ఉంటుంది. గతంలో మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా సెట్స్ లో నిర్మాతలే దగ్గరుండి పర్యవేక్షిస్తే? మంచిదని సూచించిన సందర్భాలున్నాయి.