సంయుక్త మేనన్ గ్లామర్ షో… మత్తెక్కించే లుక్స్‌తో ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్‌లో వరుస విజయాలతో 'గోల్డెన్ లెగ్' అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్, ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి.;
టాలీవుడ్‌లో వరుస విజయాలతో 'గోల్డెన్ లెగ్' అని పేరు తెచ్చుకున్న సంయుక్త మీనన్, ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు నెటిజన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. తనదైన స్టైల్ మరియు మత్తెక్కించే చూపులతో గ్లామర్ డోస్ పెంచేసిన ఈ భామ, ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పిక్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కేవలం అందంతోనే కాదు, తన నటనతోనూ మెప్పిస్తున్న సంయుక్త రాబోయే సినిమాలతో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతోంది. ఆ విశేషాలు చూద్దాం ..
ఇన్స్టాగ్రామ్‌లో మంట పుట్టిస్తున్న సంయుక్త:
సంయుక్త మీనన్ తన లేటెస్ట్ ఫోటోషూట్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ "In the making……" అంటూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోల్లో ఆమె లుక్స్ చాలా డిఫరెంట్‌గా, ఎంతో గ్లామరస్‌గా ఉన్నాయి. జస్ట్ బాట్ రూబ్ తో మెరిసిపోతూ, తన మత్తెక్కించే కళ్లతో ఫ్యాన్స్‌ను కట్టిపడేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు "బ్యూటీ విత్ సింపుల్", "టాలీవుడ్ క్వీన్" అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. ఆమె ఫిట్‌నెస్ మరియు స్టైలింగ్ ఇప్పుడున్న హీరోయిన్లలో ఆమెను స్పెషల్‌గా నిలబెడుతున్నాయి.
అఖండ 2 తో మెరిసిన కేరళ కుట్టి:
గతేడాది నందమూరి బాలకృష్ణ సరసన 'అఖండ 2' వంటి భారీ ప్రాజెక్టులో నటించి అందరి దృష్టిని ఆకర్షించింది సంయుక్త. ఈ సినిమాలో తన నటనతో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌తోనూ మార్కులు కొట్టేసింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుండి భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష వంటి హిట్లతో అలాగే ఈ ఏడాది సంక్రాంతి కి నారి నారి నడుమ మురారి తో హిట్ కొట్టి లక్కీ హ్యాండ్ అని ప్రూవ్ చేసుకుంది. పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ రేసులోకి దూసుకుపోతోంది.
‘స్వయంభూ’తో రాబోతున్న భారీ యాక్షన్:
ప్రస్తుతం సంయుక్త మీనన్ నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’లో నటిస్తోంది. ఈ సినిమా కోసం ఆమె కత్తిసాము, గుర్రపు స్వారీ వంటి విద్యలను కూడా నేర్చుకుంటోంది. సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతోందని సమాచారం. తాజాగా షేర్ చేసిన ఫోటోషూట్ కూడా ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసినదే కావచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ మూవీ తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని సంయుక్త చాలా నమ్మకంగా ఉంది.
గ్లామర్ మరియు టాలెంట్ కలయిక:
సంయుక్త మీనన్ కేవలం గ్లామర్ షోకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో తన అభిరుచిని చాటుకుంటోంది. అందుకే ఆమెకు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి. అటు ట్రెండీ ఫోటోషూట్‌లతో కుర్రకారును అలరిస్తూనే, ఇటు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో మెప్పిస్తోంది. రాబోయే రోజుల్లో సంయుక్త మరిన్ని హిట్లను తన ఖాతాలో వేసుకోవాలని మనందరం కోరుకుందాం.