సో క్యూట్.. సామ్ 2025 మెమోరీస్ చూశారా?

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సోషల్ మీడియాలో 2025 మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు.;

Update: 2025-12-26 04:49 GMT

స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్ గా సోషల్ మీడియాలో 2025 మెమోరీస్ ను షేర్ చేసుకున్నారు. కృతజ్ఞతతో కూడిన ఒక సంవత్సరం అంటూ వివిధ పిక్స్ ను షేర్ చేశారు. ఈ ఏడాది తన జీవితంలో జరిగిన అనేక విషయాలను పంచుకుంటూ ఫోటోస్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మెహందీ పెట్టుకున్న పిక్ తో స్టార్ట్ చేసిన సామ్.. చివరగా పెర్ఫ్యూమ్ పై తన పేరు రాసిన ఫోటోతో పోస్ట్ ను ఎండ్ చేశారు. ఆ మధ్యలో ఎన్నో మెమోరీస్ ను యాడ్ చేశారు. రీసెంట్ గా రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్న ఆమె.. అన్ సీన్ వెడ్డింగ్ పిక్ రివీల్ చేశారు. అందులో రాజ్ ఫన్నీగా ముఖం పెడితే , పక్కనే ఆమె నవ్వుతూ కనిపించారు.

పెళ్లిలో అది ర్యాండమ్ పిక్ గా తెలుస్తోంది. దాంతోపాటు తన ప్రొడక్షన్ డెబ్యూ మూవీ శుభంలోని క్యామియో లుక్ నూ పోస్ట్ చేశారు. ఆ సినిమా టాప్-10లో ఉన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లోని ట్రీ పిక్ ను షేర్ చేశారు. ముఖ్యంగా జిమ్ లో తాను ఎంత కష్టపడ్డారో తెలిసేలా ఉన్న వీడియో హైలెట్ గా నిలిచింది.

మొత్తానికి 2025.. సమంతకు మంచి జ్ఞాపకాలు అందించిందనే చెప్పాలి. రూమర్స్‌ ను నిజం చేస్తూ రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించడం విశేషం. కోయంబత్తూర్‌ లోని ఈశా ఫౌండేషన్‌ లోని లింగ భైరవి దేవి సన్నిధిలో భూత శుద్ధి ఆచార పద్ధతిలో సామ్, రాజ్ పెళ్లి చేసుకున్నారు. చాలా సింపుల్ గా జంటగా మారారు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలోనూ సమంత 2025 గురించి మాట్లాడారు. తాను ఈ ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టానని తెలిపారు. అది గొప్ప విషయమని, నిర్మాతగా కూడా అడుగులు వేశానని చెప్పారు. సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నానంటూ సామ్ ఆనందం వ్యక్తం చేశారు.

ఇక సామ్ కెరీర్ విషయానికొస్తే.. ఈ ఏడాది శుభం మూవీలో క్యామియో రోల్ తో సందడి చేశారు. ప్రస్తుతం రాజ్ & డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న రక్త్ బ్రహ్మాండ్: ది బ్లడీ కింగ్‌ డమ్ అనే వెబ్ సిరీస్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆ ప్రాజెక్టు స్ట్రీమింగ్ కానుంది. దాంతోపాటు మా ఇంటి బంగారం మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ సమంత.

ఆ సినిమాను తెలుగులో తన నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సినిమాలో లీడ్ రోల్ కూడా పోషిస్తున్నారు. ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో రానున్న ఆ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 2026లో మా ఇంటి బంగారం చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News