తెలుగు స్టార్ రైట‌ర్‌నే మోసం చేశారా?

కానీ తాజాగా ఓ స్టార్ రైట‌ర్‌కే స్టోరీ విష‌యంలో అవ‌మానం జ‌రగ‌డం, త‌న‌ని మూవీ చేసిన వాళ్లు అస‌లు లెక్క‌లోకే తీసుకోక‌పోవ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే..;

Update: 2026-03-07 05:14 GMT

ఇండ‌స్ట్రీలో ఊరు పేరు తెలియ‌ని వాళ్ల క‌థ‌ని ఫ్రీగా కొట్టేయ‌డం చాలా కాలంగా జ‌రుగుతూ వ‌స్తోంది. ఒక‌రు చేసుకున్న స్టోరీ మ‌రొక‌రికి వినిపించిన‌ప్పుడు దాంట్లోని మెయిన్ పాయింట్‌ని ప్ర‌ధాన సీన్‌ల‌ని మ‌రొక‌రు లేపేసి తామే సొంతంగా స్టోరీ రాసుకున్నామ‌ని బిల్డ‌ప్‌లిస్తూ సినిమాలు చేసుకోవ‌డం, అది ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్‌, రైట‌ర్స్ అసోసియేష‌న్ దాకా వెళ్ల‌డం..కంటితుడుపుగా డ‌బ్బులు చేతులు మార‌డం చాలా జ‌రిగాయి. ఇప్ప‌టికీ జ‌రుగుతున్నాయి. అయితే తాజాగా జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఇందుకు పూర్తి విరుద్ధం. పేరు లేని రైట‌ర్స్ విష‌యంలో అన్యాయం జ‌రుగుతోంది. వారి క‌థ‌ల చౌర్యం జ‌రుగుతోంది వాళ్ల‌కు ఇండ‌స్ట్రీలో అంత ప‌ట్టులేదు కాబ‌ట్టి అనుకోవ‌చ్చే.

కానీ తాజాగా ఓ స్టార్ రైట‌ర్‌కే స్టోరీ విష‌యంలో అవ‌మానం జ‌రగ‌డం, త‌న‌ని మూవీ చేసిన వాళ్లు అస‌లు లెక్క‌లోకే తీసుకోక‌పోవ‌డం ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళితే.. తెలుగులో ఆయ‌నో స్టార్ రైట‌ర్‌. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌న్ క‌ల్యాణ్, నంద‌మూరి బాల‌కృష్ణ‌, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌, ప్ర‌భాస్ వంటి స్టార్ హీరోల సినిమాల‌కు వ‌ర్క్ చేశాడు. టాలీవుడ్‌లో వ‌న్ ఆఫ్ ద స్టార్ రైట‌ర్ అనిపించుకున్నాడు. అలాంటి త‌ను ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయాల‌ని ఏరి కోరి ఓ క‌థ‌ని రెడీ చేసుకున్నాడు. దాన్ని ఓ న‌టికి వినిపించాడు.

త‌మిళంలో క‌థ‌నాయిక‌గా న‌టించి ఆ త‌రువాత ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన ఓ న‌టి తెలుగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేసింది. అలాంటి న‌టికి స్టార్ రైట‌ర్ ఓ స్టోరీని వినిపించాడు. తాను డైరెక్ట‌ర్‌గా ప‌రిచ‌యం కావాల‌నే ఈ స్టోరీని చేసుకున్నాన‌ని చెప్పాడు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల్ల అది కుద‌ర‌క‌పోవ‌డంతో ఆ క‌థ‌ని స‌ద‌రు న‌టికి ఇచ్చాడు. ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉంది. ఇక్క‌డి నుంచే క‌థ అడ్డం తిరిగింది. సినిమా పూర్త‌యింది. ప్ర‌మోష‌న్స్ జ‌రిగాయి. ఎక్క‌డా రైట‌ర్ పేరు లేదు. ఆయ‌న గురించి మాట్లాడింది లేదు. వ్య‌క్తిగ‌త ప్ర‌మోష‌న్, సినిమా ప్ర‌మోష‌న్ త‌ప్ప స‌ద‌రు న‌టి స్టోరీ ఇచ్చిన తెలుగు రైట‌ర్‌నే ప‌క్క‌న పెట్టేసింది.

త‌ను ఇచ్చిన స్టోరీని మార్చేసి సొంత క‌థ‌ని దానికి అల్లేసి సినిమా తీసింది. ఫ‌లితం యావ‌రేజ్‌. ఇది ఇప్పుడు స్టార్ రైట‌ర్ మ‌న‌సుని తొలిచేస్తోంది. అడిగి మ‌రీ త‌న స్టోరీని పాడుచేసింద‌ని స‌ద‌రు రైట‌ర్ ఫీల‌వుతున్నాడు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న‌కు, త‌న స్టోరీకి జ‌రిగిన అన్యాయాన్ని ప్ర‌శ్నిస్తున్నాడు. స‌ద‌రు న‌టి డైరెక్ట్ చేసి నిర్మించిన సినిమా రీసెంట్‌గా విడుద‌లైన ఆశించిన ఫ‌లితాన్ని ద‌క్కించుకోలేక‌పోయింది. ఇదే విష‌యాన్ని స్టార్ రైట‌ర్ సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డిస్తూ తీవ్ర అస‌హ‌నాన్ని వెల్ల‌గ‌గ్గాడు. సినిమాని నా క‌థ‌తో మొద‌లుపెట్టి వేరే క‌థ‌తో ఎండ్ చేశారు. ఒక్క మాట కూడా త‌న‌కు చెప్ప‌కుండా ఇష్ట‌మొచ్చిన‌ట్టు మార్చేసుకున్నారు.

క‌థ‌ని మాన‌భంగం చేశారు. నాది రివేంజ్ డ్రామా కాదు. నా సోల్ వేరు..అస‌లా క‌థే వేరు` అంటూ ఫైర్ అవుతున్నారు. సినిమా పేరుని ప్రస్తావించ‌కుండా స్టార్ రైట‌ర్ సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయ‌న మాట‌ల ప్ర‌కారం ఆయ‌న ఇచ్చిన క‌థ‌లో స‌ద‌రు న‌టి భారీ మార్పులు చేసిన‌ట్టుగా తెలుస్తోంది. దీంతో క‌థ‌లో ఆత్మ చ‌చ్చిపోయింద‌ని, ఆ కార‌ణంగానే సినిమా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మైంద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో స్టార్ రైట‌ర్ కామెంట్‌ల‌పై స‌ద‌రు న‌టి, డైరెక్ట‌ర్ వివ‌ర‌ణ ఇస్తుందా? లేక ఎప్ప‌టి లాగే లైట్ తీసుకుని త‌న ప‌ని తాను చేసుకుపోతుందా? అన్న‌ది వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News