అల్లు శిరీష్ -నైనిక పెళ్లిలో టాప్ -10 స్టార్లు

యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ప్రీవెడ్డింగ్ వేడుకలో హైలైట్‌గా నిలిచారు.;

Update: 2026-03-07 03:50 GMT

మెగా - అల్లు కుటుంబాల్లో మరో వేడుక అంబరాన్నంటింది. అల్లు అర‌వింద్ కుమారుడు, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సోద‌రుడు అల్లు శిరీష్ వివాహం మార్చి 6న నైనిక రెడ్డితో హైద‌రాబాద్‌ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. వరుణ్ తేజ్ వివాహ సమయంలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో ఈ శుభకార్యానికి దారితీసింది. శిరీష్ వివాహ వేడుక‌ను మెగా అల్లు కుటుంబాలు ఒక‌ పండుగలా జరుపుకున్నాయి.




 


ఈ వివాహ వేడుకలో మెగా ఫ్యామిలీ హడావిడి మామూలుగా లేదు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు స్వయంగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించగా, అల్లు అర్జున్ తన తమ్ముడి పెళ్లి పనులన్నీ దగ్గరుండి పర్యవేక్షించి అన్నగా తన బాధ్యతను చాటుకున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి సందడి చేశారు. మెగా వారసులు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలో సందడి చేస్తూ కనిపించారు.




 


కేవలం మెగా హీరోలే కాకుండా.. టాలీవుడ్, కోలీవుడ్ నుంచి టాప్ స్టార్స్ ఈ వేడుకకు తరలివచ్చారు. అల్లు అరవింద్‌తో ఉన్న సుదీర్ఘ అనుబంధం కారణంగా తమిళ స్టార్ హీరో సూర్య చెన్నై నుండి వచ్చి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇక నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున వంటి అగ్ర హీరోలు ప్రీ-వెడ్డింగ్- పెళ్లి వేడుకల్లో పాల్గొని అల్లు అరవింద్‌తో కలిసి ముచ్చటించడం అందరినీ ఆకట్టుకుంది. నాగచైతన్య, రానా దగ్గుబాటి, రవితేజ వంటి స్టార్ హీరోలు కూడా ఈ వివాహ వేడుకలో పాలుపంచుకున్నారు.




 


యువతలో విపరీతమైన క్రేజ్ ఉన్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న ప్రీవెడ్డింగ్ వేడుకలో హైలైట్‌గా నిలిచారు. ఇదే వేడుక‌కు నేచురల్ స్టార్ నాని తన భార్య అంజనతో కలిసి రాగా, గోపీచంద్, నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి వంటి నటులు వెన్యూ వ‌ద్ద‌ మరింత జోష్‌ను తీసుకొచ్చారు. టాలీవుడ్ ప్రముఖ నటీమణులు మీనాక్షి చౌదరి, రాశీ ఖన్నా, సీనియర్ నటులు మోహన్ బాబు, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబులు నూతన దంపతులకు తమ దీవెనలు అందజేశారు.




 


దర్శక నిర్మాతల విషయానికి వస్తే..`పుష్ప` దర్శకుడు సుకుమార్, `యానిమల్` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా తమ హాజరుతో ప్రత్యేకతను చాటుకున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ దర్శకులు అట్లీ , లోకేష్ కనగరాజ్ ఈ వేడుకలో మెరవడం విశేషం. వీరితో పాటు మలయాళ డైరెక్టర్ బేసిల్ జోసెఫ్ కూడా హాజరై అల్లు ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. చిత్ర పరిశ్రమలోని ప్రముఖులంతా ఒకే చోట చేరడంతో హైదరాబాద్‌లోని వివాహ వేదిక ఒక భారీ సినిమా సెట్‌ను తలపించింది.




 


రాజకీయ రంగం నుండి కూడా హేమాహేమీలు ఈ వివాహానికి విచ్చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి , ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్‌లు పెళ్లికి హాజరై శిరీష్-నైనిక జోడీని ఆశీర్వదించారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖుల కలయికతో అల్లు శిరీష్ వివాహం 2026లోనే అత్యంత గ్రాండ్ సెలబ్రేషన్‌గా నిలిచిపోయింది.

Tags:    

Similar News