రష్మిక నిజం కాదన్న స్టార్‌ డైరెక్టర్‌

Update: 2020-11-25 11:30 GMT
తమిళంలో కార్తీ మూవీ సుల్తాన్‌ తో హీరోయిన్‌ గా ఎంట్రీ ఇవ్వబోతున్న రష్మిక మందన్నకు రెండవ సినిమాగా సూర్య సినిమాలో నటించే అవకాశం దక్కింది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సూరారై పోట్రూ అనే సూపర్‌ హిట్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య సినిమా అంటూ ప్రస్తుతం అక్కడ యమ క్రేజ్‌ ఉంది. ఇక పాండిరాజ్‌ దర్శకత్వంలో సూర్య సినిమా అనగానే అంచనాలు పీక్స్ లో ఉంటున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా భారీగా సినిమాను దర్శకుడు పాండి రాజ్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.

సూర్య హీరోగా పాండి రాజ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న క్రేజీ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది అంటూ జోరుగా తమిళ మీడియాతో పాటు తెలుగు మీడియాలో వస్తున్న వార్తలకు క్లారిటీ వచ్చింది. దర్శకుడు పాండి రాజ్‌ ఈ విషయమై స్పష్టత ఇచ్చాడు. ఇప్పటి వరకు హీరోయిన్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు.

హీరోయిన్ ఎంపిక అయిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తాం. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం మొత్తం కూడా నిజం కాదంటూ పాండి రాజ్‌ పేర్కొన్నాడు. పాండి రాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో రష్మిక తమిళ ఎంట్రీ అనగానే అక్కడ అంచనాలు భారీగా పెరిగాయి. ఇంతలో ఆయన రష్మిక అభిమానుల ఆనందాన్ని పటాపంచలు చేశాడు.
Tags:    

Similar News