నానిది జాగ్రత్తా ముందుచూపా?
సినిమా పరిశ్రమ మహా విచిత్రమైనది. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో అనే పాట దీనికి సరిగ్గా సరిపోతుంది . అందుకే దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకునే రీతిలో ఫాం లో ఉండగానే వీలైనన్ని సినిమలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునెందుకు ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. చూస్తుంటే నాని కూడా ఇదే వరసలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఏడాదికి కనీసం రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్ చేసుకునే నానికి మొన్న ఏడాది వరకు బాగానే ఉంది. అయితే గత సంవత్సరం కృష్ణార్జున యుద్ధం దేవదాస్ రెండూ గట్టి పాఠాలే నేర్పించాయి. తాను ఇష్టం వచ్చినట్టు రొటీన్ కథలు చేస్తే ప్రేక్షకులు ఒప్పుకోరనే సత్యం నానికి తెలిసి వచ్చింది. అందులోనూ బిగ్ బాస్ షోకి ఆశించిన స్పందన రాకపోవడం కూడా ఊహించనిదే
అయినా నాని వేగం తగ్గించడం లేదు. 19న విడుదల కాబోతున్న జెర్సీ మీద ఇప్పటికే చాలా గట్టి నమ్మకం వ్యక్తం చేశాడు. మరోవైపు విక్రం కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ లీడర్ దసరాను టార్గెట్ చేసుకుని ముస్తాబవుతోంది. ఇవి కాకుండా ఇంద్రగంటి సినిమాలో కీలకమైన రోల్ తో పాటు మరో ఇద్దరు కుర్ర దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. చూస్తుంటే వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేయడం మీద ఫోకస్ పెడుతున్న నాని ఒకవేళ కంటెంట్ మీద కనక సీరియస్ గా దృష్టి పెట్టకపోతే మూసలో పడిపోవడం ఖాయం.
ఈ పొరపాటు వల్లే రవితేజ మార్కెట్ బాగా దెబ్బ తింది. అయితే నాని సినిమాలకు రెమ్యునరేషన్ కాకుండా షేర్ తీసుకోవడం వెనుక కూడా భవిష్యత్ భద్రత అనే కారణం వినిపిస్తోంది. దీని వల్లే నానికి కొందరు పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్ హీరోల కంటే ఎక్కువ ఆదాయం వస్తోందట. అందరూ ఆచి తూచి అడుగులు వేస్తుంటే నాని మాత్రం ఫైనాన్షియల్ గా సేఫ్ రన్ వైపు పరుగులు పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. జెర్సీ గ్యాంగ్ లీడర్ ఫలితాలు చూశాక దీని గురించి మరింత స్పష్టత రావొచ్చు. చూద్దాం