'హమ్ నే బోల్ దియా' మీమ్స్.. బోయపాటి ఏమన్నారంటే?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;

Update: 2025-12-20 06:00 GMT

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. రీసెంట్ గా అఖండ 2: తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. నటసింహం బాలకృష్ణ లీడ్ రోల్ లో ఆయన తెరకెక్కించిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన థియేటర్స్ లో గ్రాండ్ రిలీజైంది. డిసెంబర్ 5నే విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది

అయితే బాలయ్య సినిమాలు ఇప్పటి వరకు తెలుగుకే పరిమితవ్వగా.. ఈసారి అఖండ-2 పాన్ ఇండియా స్థాయిలో రూపొందింది. అఖండ-1 తెలుగులోనే తెరకెక్కగా.. ఇప్పుడు సీక్వెల్ ను మాత్రం హిందీలో కూడా తెరకెక్కించారు. దీంతో నార్త్ లో ప్రమోషన్స్ నిర్వహించారు మేకర్స్. ముంబైలో సినిమాలోని సాంగ్ ను కూడా లాంచ్ చేశారు.

అదే సమయంలో ఇంటర్వ్యూ నిర్వహించగా.. బోయపాటి శ్రీను హిందీలో మాట్లాడారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారగా.. తన లాంగ్వేజ్ తో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇంటర్వ్యూలో హమ్ నే బోల్ దియా కాషన్ కియా అంటూ చేసిన స్టేట్మెంట్ పై సోషల్ మీడియాలో మీమ్స్ మామూలుగా రాలేదని చెప్పాలి.

ఎక్కడ చూసినా అవే కనిపించాయి.. ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మరో ఇంటర్వ్యూలో ఆ విషయంపై బోయపాటి శ్రీను రెస్పాండ్ అయ్యారు. సింగర్ సునీత హోస్ట్ చేసిన ఇంటర్వ్యూలో.. ఆమె ఆల్రెడీ హమ్ నే బోలో దియా కాషన్ కియా మీమ్ ను ప్లే చేశారు. దీంతో అక్కడే ఉన్న బోయపాటి శ్రీను అది విని ఫుల్ గా నవ్వేశారు.

ఆ తర్వాత హిందీని ఏదైతే నేర్చుకున్నానో అదే అక్కడ మాట్లాడానని తెలిపారు. కానీ తానేం అప్పుడు బూతులు మాట్లాడలేదు కదా అని అన్నారు. ఆ తర్వాత తాను చేసిన ఆమె కామెంట్స్ బాగా వైరల్ అవ్వడమే కాకుండా అదొక టైప్ ప్రమోషన్ లో భాగంగా అఖండ 2 తాండవం సినిమాకు కలిసి వచ్చిందంటూ బోయపాటి చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత తమన్.. న్యూ ఇయర్ సందర్భంగా డీజే సాంగ్ క్రియేట్ చేసి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెబుతారేమో అంటూ సరదాగా అన్నారు. ప్రస్తుతం బోయపాటి, తమన్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా హిందీపై పట్టు లేకపోయినా, ప్రమోషన్స్ కోసం మాట్లాడిన బోయపాటి.. ట్రోల్స్ ఎదుర్కొన్నారు.

ఇక మూవీ విషయానికొస్తే.. పాన్ ఇండియాలో రేంజ్ లో రూపొందించడం వల్ల బోయపాటి శ్రీను.. సినిమాలో డివైన్ ఎలిమెంట్స్ ను కాస్త ఎక్కువ యాడ్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో అనేక సన్నివేశాలు నార్త్ మూవీ లవర్స్ ను ఆకట్టుకునేందుకు జోడించినట్టు స్పష్టంగా అర్థమవుతుందని అనేక మంది నెటిజన్లు ఇప్పటికే అభిప్రాయపడ్డారు.



Tags:    

Similar News