ప్రభాస్ 'రాజా సాబ్'.. గట్టి కంటెంట్ పడాల్సిందే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.;

Update: 2025-12-20 02:45 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ.. రిలీజ్ కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఆ సినిమా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. పాన్ ఇండియా రేంజ్ లో వరల్డ్ వైడ్ గా జనవరి 9వ తేదీన గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అవ్వనుంది.

మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ లో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్.. మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసిన మేకర్స్.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను జరుపుతున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ కూడా చేపడుతున్నారు. ఇప్పటికే రెండు టీజర్లతోపాటు రెండు సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే అవి అభిమానులను ఫుల్ గా మెప్పించినా.. మిగతా ఆడియన్స్ ను అనుకున్నంత స్థాయిలో మెప్పించలేనట్టుగా అనిపిస్తోంది.

ఎందుకంటే ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. సందడి మామూలుగా ఉండదు. రిలీజ్ కు ముందు భారీ బజ్ ఏర్పడుతుంది. సినీ ప్రియుల్లో ఫుల్ ఉత్సాహం నెలకొంటుంది. కానీ ఇప్పుడు అలా పరిస్థితులు కనిపించడం లేదు. అందుకు కారణం.. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడమేనని తెలుస్తోంది.

హైప్ ను క్రియేట్ చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నా.. దానికి ట్రోలింగ్ బాగా అడ్డుపడుతుందని చెప్పాలి. సాంగ్స్ తో పాటు లుక్స్ పై ఎప్పటికప్పుడు ట్రోల్స్ చేస్తూనే ఉంటోంది ఓ బ్యాచ్. దీంతో అదే పెద్ద మైనస్ గా మారిందని ఇప్పుడు సినీ పండితులు చెబుతున్నారు. కంటెంట్ ఎలా ఉందనేది పక్కనపెడితే.. ట్రోలింగ్ ఎఫెక్ట్ చూపిస్తుందని అంటున్నారు.

ఏదేమైనా ట్రోలర్స్ కు గట్టి సమాధానమిచ్చేలా.. ప్రమోషనల్ కంటెంట్ తో మేకర్స్ సందడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారిగా అందరి దృష్టిని తమ వైపు తిప్పుకోవాలి. ముఖ్యంగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ను ఆకట్టుకోవాలి. అప్పుడు ఓ రేంజ్ లో సినిమాపై అందరిలో సూపర్ బజ్ కచ్చితంగా క్రియేట్ అవుతుంది.

అప్పుడు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వగా.. అనుకున్నట్లు జరగడం లేదని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా అన్నింటికీ ఒకే సొల్యూషన్.. ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ కావాలి.. రావాలి.. దీనిపైనే ఇప్పుడు మేకర్స్ ఫోకస్ చేయాల్సి ఉంది. మరేం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News