బైకర్ లో రాజశేఖర్.. యాటిట్యూడ్, డైలాగ్స్ మామూలుగా లేవుగా!

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. హీరోగా సినిమాలు తగ్గించిన ఈ యాంగ్రీ యాక్టర్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు.;

Update: 2026-02-04 06:32 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ వెండితెరపై కనిపించి చాలా కాలమైంది. హీరోగా సినిమాలు తగ్గించిన ఈ యాంగ్రీ యాక్టర్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమయ్యారు. ఇదివరకే నితిన్ ఎక్స్ట్రా ఆర్డినరీ సినిమాలో ఒక స్పెషల్ పాత్రలో కనిపించినప్పటికి అదేమీ అంతగా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి శర్వానంద్ బైకర్ సినిమాలో మాత్రం అసలైన పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.




 


ఇక తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక క్రేజీ గిఫ్ట్ ఇచ్చారు. 'బైకర్' సినిమాలో రాజశేఖర్ ఒక ఇంటెన్సిటీ ఉన్న బులెట్ సునీల్ అనే రోల్ ప్లే చేస్తున్నారు. విడుదలైన గ్లింప్స్ లో ఆయన ఇంట్రో సీన్స్ డైలాగ్స్ చూస్తుంటే పక్కాగా మరో 'గరుడ వేగ' రేంజ్ ఇంపాక్ట్ ఉండబోతోందని అర్థమవుతోంది. వింటేజ్ బైక్ పక్కన రాజశేఖర్ నిలబడిన తీరు చూస్తుంటే మళ్ళీ పాత రోజులు గుర్తొస్తున్నాయి.

ఈ గ్లింప్స్ లో రాజశేఖర్ చెప్పిన డైలాగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఇండియన్ రేసర్స్ డిజర్వింగ్ కాదు.. దే ఆర్ జస్ట్ లూజర్స్ అనే ఒపీనియన్ ఉంది" అని ఒకరు అడిగితే.. దానికి రాజశేఖర్ తనదైన స్టైల్ లో "ఒపీనియనే కదా.. మారుద్దాం" అని కూల్ గా సమాధానం ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క డైలాగ్ తోనే రాజశేఖర్ క్యారెక్టర్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉండబోతోందో క్లియర్ గా అర్థమవుతోంది.

వర్షంలో గొడుగు పట్టుకుని ఆయన నడుచుకుంటూ వచ్చే సీన్ తోనే అతని స్టైల్ హైలెట్ గా నిలిచింది. సన్ గ్లాసెస్ పెట్టుకుని చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. సినిమాలో ఆయన 'బుల్లెట్ సునీల్' అనే మాజీ మోటోక్రాస్ రేసర్ పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. 18 ఇండియన్ ఛాంపియన్‌షిప్స్, 57 సౌత్ జోన్ టైటిల్స్ గెలిచిన ఒక లెజెండరీ రేసర్ గా రాజశేఖర్ ని ఈ సినిమాలో పరిచయం చేస్తున్నారు.

రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ అడ్వెంచర్ లో శర్వానంద్ కు రాజశేఖర్ ఒక మెంటార్ లాగా ఉండబోతున్నారని తెలుస్తోంది. గ్లింప్స్ లో చూసిన విజువల్స్ ఆ మోటార్ సైకిల్ సౌండ్స్ ఆడియన్స్ కి ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇస్తాయనిపిస్తోంది. రాజశేఖర్ గెటప్ లోని ఆ డీటెయిలింగ్, ముఖ్యంగా ఆయన కళ్ళల్లోని ఆ ఇంటెన్సిటీ ఈ పాత్రకు ఒక ప్రత్యేకమైన వెయిట్ ఇచ్చాయి. అభిలాష్ రెడ్డి కంకర ఈ సినిమాను హై స్టాండర్డ్స్ లో డిజైన్ చేశారని మేకర్స్ చెబుతున్నారు.

ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. ఇదే ఏడాది ఏప్రిల్ 3 'బైకర్' ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ కమ్ బ్యాక్ పక్కాగా ఒక ప్లస్ పాయింట్ అవ్వనుంది. శర్వానంద్ రాజశేఖర్ కాంబో లో వచ్చే ఈ రేసింగ్ డ్రామా థియేటర్లలో ఏ రేంజ్ లో స్పీడ్ చూపిస్తుందో చూడాలి.




Tags:    

Similar News