రాజమౌళి చెప్పగానే భయపడిన మహేష్
రీసెంట్ గా ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ కొలైడర్ కు ఈ సినిమా టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.;
ప్రస్తుతం గ్లోబల్ సినిమా వరల్డ్ లో 'వారణాసి' పేరు మరింత గట్టిగా వినబడేలా ఉంది. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ మొదటి హాలీవుడ్ సైడ్ నుంచే మొదలైంది.
రీసెంట్ గా ప్రముఖ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ కొలైడర్ కు ఈ సినిమా టీమ్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. హాలీవుడ్ సైడ్ నుండే ప్రమోషన్స్ స్టార్ట్ చేయడం చూస్తుంటే రాజమౌళి టార్గెట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ కూడా పాల్గొన్న ఈ చిట్ చాట్ లో మహేష్ బాబు కొన్ని క్రేజీ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇవి విన్న ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
మహేష్ బాబు మాట్లాడుతూ.. రాజమౌళి తనకు ఈ సినిమా కథ చెప్పినప్పుడు నిజంగానే భయం వేసిందని ఓపెన్ గా చెప్పారు. కేవలం అడ్వెంచర్ మాత్రమే కాదు, ఆ పాత్రలోని డెప్త్, స్టోరీ స్పాన్ చూసి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అని మహేష్ కు అప్పుడే అర్థమైందట. ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్ నుండి నడక వరకు ప్రతిదీ మార్చుకోవాల్సి వచ్చిందని, ఇది తన కెరీర్ లోనే అత్యంత కష్టమైన జర్నీ అని ఆయన చెప్పుకొచ్చారు.
అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే.. సినిమాలో కనిపించే ఒకే ఒక్క ఫ్రేమ్ కోసం మహేష్ బాబు ఏకంగా 6 నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. 'కలరీపయట్టు' అనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ పొంది, రాముడిని పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడానికి దాదాపు ఏడాది కాలం ప్రిపరేషన్ చేశారట. ఆ ఒక్క షాట్ కోసం అంత కష్టపడటం చూస్తుంటే జక్కన్న పర్ఫెక్షన్ ఏ రేంజ్ లో ఉంటుందో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు.
రాజమౌళి టీమ్ లో 'ఓకే' అనిపించుకోవడం ఎంత కష్టమో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ కూడా సరదాగా పంచుకున్నారు. ఒక్కో సీన్ కోసం వందకు పైగా టేకులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనేది డైరెక్టర్ ఉద్దేశమని వారు తెలిపారు. మహేష్ బాబు పడ్డ శ్రమ అంతా ఆ ఒక్క విజువల్ చూసినప్పుడు మర్చిపోయానని చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఇక 'వారణాసి' సినిమాతో ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ఎక్కడికో వెళ్లబోతున్నాయని అర్ధమవుతుంది. 2027 ఏప్రిల్ 7న రిలీజ్ కాబోతున్న ఈ గ్లోబల్ ఎపిక్ లో మహేష్ బాబు చేసిన ఈ సాహసం ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. కేవలం అడ్వెంచర్ మాత్రమే కాకుండా ఇందులో ఉండే ఎమోషన్స్ కూడా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయని టీమ్ నమ్మకంగా ఉంది. మరి ఈ రాముడి పాత్రలో ఉన్న మ్యాజిక్ ఏంటో తెలియాలంటే థియేటర్లలో చూడాల్సిందే.