రంగులు మార్చే నటుడు.. ప్రకాష్‌రాజ్‌పై తణికెళ్ల భరణి కామెంట్!
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇటీవల ఒక ప్రత్యేక సంభాషణలో ఒక ప్రముఖ నటుడి అసాధారణ నటనా పటిమను, భాషా ప్రావీణ్యాన్ని ఎంతో ఆప్యాయంగా కొనియాడారు.
ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ఇటీవల ఒక ప్రత్యేక సంభాషణలో ఒక ప్రముఖ నటుడి అసాధారణ నటనా పటిమను, భాషా ప్రావీణ్యాన్ని ఎంతో ఆప్యాయంగా కొనియాడారు. సదరు నటుడు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతపు భాషను, సంస్కృతిని, ఆహార అలవాట్లను పూర్తిగా సొంతం చేసుకుంటారని, నటుల్లో అలాంటి వైవిధ్యమైన ఊసరవెల్లి(పాజిటివ్ గా) వ్యక్తిత్వం అత్యంత అరుదుగా కనిపిస్తుందని భరణి పేర్కొన్నారు.
ఆ నటుడు కేవలం 33 ఏళ్ల పిన్న వయస్సులోనే మూడు జాతీయ చలనచిత్ర పురస్కారాలను సాధించడం ఆయన ప్రతిభకు నిదర్శనమని తనికెళ్ల భరణి గుర్తుచేసుకున్నారు. నల్లటి దుస్తులు ధరించి ఆయన జాతీయ అవార్డు అందుకున్న ప్రతీసారి తాను టీవీలో చూసి ఎంతో సంతోషంతో ఫోన్ చేసి అభినందించేవాడినని తెలిపారు.
ఏ భాషా చిత్రంలో నటించినా.. ఆ ప్రాంత యాసను, భాషను అత్యంత శ్రద్ధతో నేర్చుకోవడం ఆయనలోని ప్రత్యేకత అని వ్యాఖ్యానించారు. ఇతర భాషల్లో నటించి సొంతంగా డబ్బింగ్ చెప్పే ధైర్యం అందరికీ ఉండదని... కానీ ఆయన తమిళం, మరాఠీ వంటి భాషల్లో కూడా ఎలాంటి లోపం లేకుండా అత్యంత స్పష్టతతో డబ్బింగ్ చెప్పగలరని భరణి ప్రశంసించారు. ఆ లక్షణం అసలు మన దగ్గర లేదని కూడా పెదవి విరిచేసారు.
తమ ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధం గురించి మాట్లాడుతూ.. అతడు తమకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. ప్రతిరోజూ మాట్లాడుకోకపోయినా.. వారి మధ్య ఉన్న బంధం ప్రత్యేకమైనదని.. ఆ వ్యక్తి కేవలం నటుడే కాకుండా ప్రకృతిని, కవిత్వాన్ని అమితంగా ప్రేమించే ఒక భావుకుడని అభివర్ణించారు.
తమ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ఇటువంటి విలక్షణ నటులు చాలా అరుదుగా ఉంటారని భరణి కితాబిచ్చారు. ప్రతిష్టాత్మకమైన జాతీయ అవార్డులు సాధించడమే కాకుండా.. విభిన్న భాషా చిత్రాలలో తనదైన ముద్ర వేస్తూ సాగిన ఆ నటుడి క్రమశిక్షణ, శ్రద్ధ భావితరాలకు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన స్పష్టం చేశారు.
ఇదంతా ఎవరి గురించో గెస్ చేయగలరా? కచ్ఛితంగా 33 ఏళ్ల వయసులోపు 3 జాతీయ అవార్డులు అందుకున్న ప్రతిభావంతుడు కేవలం ప్రకాష్ రాజ్ మాత్రమే. అంతటి విలక్షణ నటుడు వేరొకరు లేరని కూడా దిగ్గజ రచయిత, నటుడు భరణి అంగీకరించారు. ఇటీవల రాజకీయాలతో అంటకాగడం.. రకరకాల వివాదాల కారణంగా ప్రకాష్ రాజ్ పేరు మీడియా హెడ్ లైన్స్ లోకొచ్చింది. కానీ అతడు ఎలా ఉన్నా తనకు బెస్ట్ ఫ్రెండ్ అని అంటున్నారు తణికెళ్ల భరణి. ప్రకాష్ రాజ్ సూటిగా ఉండే వ్యక్తిత్వం గురించి అతడు ప్రశంసించారు. భరణి, బ్రహ్మానందం వంటి నటులు అరేయ్ ఒరేయ్ అనేంతగా ప్రకాష్ రాజ్ కి సన్నిహితులు.