దర్శకరత్న నుంచి సుజీత్ వరకు ఒకే ఒక్కడు!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజ దర్శకులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక తరానికి మరో తరానికి ఆలోచనా విధానంలో, కథలు చెప్పే శైలిలో భారీ మార్పులు వస్తుంటాయి.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది దిగ్గజ దర్శకులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఒక తరానికి మరో తరానికి ఆలోచనా విధానంలో, కథలు చెప్పే శైలిలో భారీ మార్పులు వస్తుంటాయి. కానీ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావు నుంచి నేటి యువ దర్శకుడు సుజిత్ వరకు టాలీవుడ్‌లోని ప్రతి అగ్ర దర్శకుడు మనస్ఫూర్తిగా మెచ్చిన ఒకే ఒక్కడు పూరి జగన్నాథ్. ఇది టాలీవుడ్ చరిత్రలో ఎవరూ సాధించని అరుదైన రికార్డు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
పూరి జగన్నాథ్ సినిమాల మేకింగ్ స్టైల్, ఆయన రాసే మాటల తూటాలు, పాత్రల తీరుతెన్నులు ఎప్పుడూ ఒక ప్రత్యేక ట్రెండ్‌ను సృష్టిస్తాయి. ఆయన చిత్రాల గురించి, వ్యక్తిత్వం గురించి, అసాధారణమైన టాలెంట్ గురించి టాలీవుడ్‌లోని ప్రతి దర్శకుడు ఎంతో గొప్పగా, నిజాయితీగా మాట్లాడుతుంటారు. ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో హీరోల బాడీ లాంగ్వేజ్‌ను మార్చేయడంలో పూరి చూపించే ప్రతిభ అందరినీ ఆశ్చర్యపరిచింది. సాధారణ యువకుడిని కూడా వెండితెరపై తిరుగులేని మాస్ హీరోగా చూపించగలగడం పూరికే చెల్లింది.
ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ నుంచి రాజమౌళి వరకు పూరి ప్రతిభను అనేక సందర్భాలలో కొనియాడారు. వివి వినాయక్, హరీష్ శంకర్, సుకుమార్ వంటి స్టార్ డైరెక్టర్లు పూరితో తమకు ఉన్న అనుబంధాన్ని, ఆయన నుంచి తాము నేర్చుకున్న విషయాలను బహిరంగంగానే పంచుకున్నారు. నేటి ట్రెండ్‌లో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న సందీప్ రెడ్డి వంగా, విభిన్న కథలతో దూసుకెళ్తున్న వంశీ పైడిపల్లి వంటి ఎంతోమంది ప్రముఖ దర్శకులు పూరిని తమకు ఎప్పటికీ ఇన్‌స్పిరేషన్‌గా భావిస్తుంటారు.
ఎవరికీ తలవంచని ఆత్మగౌరవం, ఎవరిని లెక్కచేయని బోల్డ్ వ్యక్తిత్వం పూరి జగన్నాథ్ సొంతం. సక్సెస్‌లతో సంబంధం లేకుండా ఆయనలోని సినిమా పిచ్చిని, మేకింగ్ పై ఉన్న ప్యాషన్‌ను తోటి దర్శకులు ఎప్పుడూ గౌరవిస్తుంటారు. షూటింగ్ స్పీడ్ విషయంలో పూరి ప్రణాళికలు, హీరోల పరిమిత డేట్స్ లోనే కొద్ది రోజుల్లోనే సినిమాలను పూర్తి చేసే పూరి వర్క్ స్టైల్ ఇండస్ట్రీలో ఒక పాఠంలాంటిదని చాలామంది డైరెక్టర్లు చెబుతుంటారు.
సినిమా ఇండస్ట్రీలో పోటీ ఎంత తీవ్రంగా ఉన్నా? పూరి జగన్నాథ్ పట్ల తోటి దర్శకులకు ఉండే ఆరాధన భావం ఎప్పుడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఎంతటి స్టార్ హీరోనైనా సరే తనదైన శైలిలో కొత్త కోణంలో చూపించగల సత్తా ఒక్క పూరికే ఉందని టాలీవుడ్ ప్రముఖులు నమ్ముతారు. ఆయన అందించిన ఎన్నో క్లాసిక్ .. కల్ట్ చిత్రాలు నేటి తరానికి చెందిన యువ దర్శకులకు రోడ్ మ్యాప్‌గా నిలిచాయి. అందుకే దాసరి నుంచి సుజిత్ తరం వరకు ప్రతి ఒక్కరి మనసులో పూరి స్థానం ఎప్పటికీ ప్రత్యేకమే.
చివరిగా పూరి జగన్నాథ్ దర్శకుడు మాత్రమే కాదు. టాలీవుడ్ కమర్షియల్ సినిమా రూపురేఖలను మార్చేసిన శక్తి. కాలం ఏదైనా? ట్రెండ్ ఏదైనా? పూరి మార్క్ సినిమా శైలి ఎప్పటికీ నిలిచిపోతుంది. తోటి దర్శకుల చేత సైతం గ్రేట్ డైరెక్టర్' అనిపిం చుకున్న డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలో అద్భుతమైన అధ్యాయంగా నిలిచిపోతుంది.