సీనియర్ అయినా కాళ్లు ఒణుకుతూనే ఉన్నాయ్!
సుదీర్ఘ కాలం పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండి అకస్మాత్తుగా మళ్లీ లైట్స్, కెమెరా, యాక్షన్ హడావుడిలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని అనుభవపూర్వకంగా తెలిపారు.
వెండితెరకు సుదీర్ఘ విరామం తర్వాత రీఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ నటి ప్రీతి జింటా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత అమ్మడు మళ్లీ కెమెరా ముందుకు రావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎంతటి అనుభవజ్ఞురాలైన సీనియర్ నటి అయినప్పటికీ రీఎంట్రీ ఇస్తున్న సమయంలో కెమెరాను ఎదుర్కొనేటప్పుడు మాత్రం కొత్త నటిలాగే కాళ్లు ఒణికాయని స్వయంగా ఓ సందర్భంలో పంచుకున్నారు.
సుదీర్ఘ కాలం పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండి అకస్మాత్తుగా మళ్లీ లైట్స్, కెమెరా, యాక్షన్ హడావుడిలోకి అడుగుపెట్టడం అంత సులభం కాదని అనుభవపూర్వకంగా తెలిపారు. దశాబ్దాల పాటు వందలాది సీన్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ ఆ గ్యాప్ వల్ల కలిగిన ఆందోళన మాత్రం మామూలుగా లేదని ఆమె పేర్కొన్నారు. మొదటి రోజు షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టినప్పుడు కలిగిన ఆ అనుభూతిని గుర్తుచేసుకుని ఆశ్చర్యపోయారు.
కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ఎన్నో అద్భుతమైన పాత్రలతో అలరించిన ప్రీతి జింటా ఈ తరం ట్రెండ్‌కు తగ్గట్టుగా మళ్లీ రీఎంట్రీ ఇవ్వడం విశేషం. అయితే ఇండస్ట్రీలో ఎంత అనుభవం ఉన్నా? సుదీర్ఘ విరామం తర్వాత కెమెరా ముందు నిలబడినప్పుడు హృదయ స్పందనలు పెరిగినట్లు తెలిపారు. ఒక కొత్త నటికి ఉండే భయం, టెన్షన్ తనకు కూడా మొదటి రోజు షూటింగ్‌లో అనుభవానికి వచ్చిందని నవ్వుతూ పంచుకున్నారు.
కాలం మారుతున్న కొద్దీ చిత్రికరణ విధానాలు, సాంకేతికత పూర్తిగా మారిపోవడంతో ఈ మార్పులకు అలవాటు పడేందుకు కొద్దిగా సమయం పట్టిందని తెలిపారు. సెట్లో ఉన్న కొత్త వాతావరణం, తోటి నటీనటులు, సాంకేతిక నిపుణుల మధ్య మళ్లీ నైపుణ్యాన్ని నిరూపించుకోవాలనే చిన్నపాటి ఒత్తిడి ప్రతి సీనియర్ నటుడిని వెంటాడు తుందనడానికి ప్రతీ అనుభవమే నిదర్శనం. ఆ టెన్షనే తనలో నటనపై ఉన్న ప్యాషన్‌ను మరోసారి బయటికి తెచ్చిందని భావిస్తున్నారు.
అయితే కెమెరా కాస్త అలవాటు కాగానే ఆ ఒణుకు ఉత్సాహంగా మారిపోయిందని.. అలవాటైన నటన మళ్లీ సహజంగానే బయటికి వచ్చిందని ప్రీతి పేర్కొన్నారు. ఎనిమిదేళ్ల గ్యాప్ తర్వాత కూడా తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలు చూశాక ఆ భయమంతా చిటికెలో మాయమైపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. తనదైన నటనతో, చిరునవ్వుతో వెండితెరపై మళ్లీ మ్యాజిక్ చేయడానికి ప్రీతీజింటా ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు.
అనుభవం ఎంత ఉన్నా? సుదీర్ఘ విరామం తర్వాత కెమెరాను ఎదుర్కొనేటప్పుడు కలిగే ఆ టెన్షన్ ప్రతి కళాకారుడికి సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ప్రీతి జింటా లాంటి స్టార్ హీరోయిన్ కూడా ఆ అనుభూతిని బహిరంగంగా పంచుకోవడం ఆమె నిరాడంబరతకు నిదర్శనం చెప్పొచ్చు. ప్రతీ జింటా కంబ్యాక్ అవుతున్న బట్వారా 1947 ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.