రిలీజ్‌కు ముందే ధురంధర్2 టీమ్‌కు షాక్!
రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్`. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది.;
రణ్‌వీర్ సింగ్ కథానాయకుడిగా నటించిన సెన్సేషనల్ స్పై యాక్షన్ డ్రామా `ధురంధర్`. దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. విమర్శలు ఎన్ని వెళ్లువెత్తినా దానికి ధీటుగా బాక్సాఫీస్ వద్ద ధీటుగా నిలబడి రికార్డు స్థాయి వసూళ్లని రాబట్టింది. గత ఏడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ అదే ఊపుని కొనసాగిస్తూ బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ సీక్వెల్ `ధురంధర్ 2 :ది రివేంజ్`పై సర్వత్రా అంచనాలు ఏర్పడ్డాయి.
పార్ట్ 1లో ఆశ్చర్యపరిచే అంశాలని, సన్నివేశాలని, కీలక ఘట్టాలని చూపించిన దర్శకుడు ఆదిత్యధర్ పార్ట్ 2లో ఎలాంటి అంశాలని, ఎలాంటి సీక్రెట్స్‌ని బయటపెట్టబోతున్నాడా? అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీని హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 19న భారీ స్థాయిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ మూవీ టీజర్‌ని తాజాగా విడుదల చేయడం తెలిసిందే. టీజర్‌లో ఫస్ట్ పార్ట్‌కి మించి భీభత్సాన్ని, అత్యంత భయానక సన్నివేశాలని, బ్రటల్ మర్డర్స్‌ని చూపించి షాక్ ఇచ్చారు.
దీంతో పార్ట్ 2 భీభత్సమేనని, ఇందులో రణ్‌వీర్ సింగ్ విశ్వరూపం చూపించడం ఖాయమని స్పష్టమవుతోంది. పార్ట్ 1లో సైలెంట్‌గా, రెహమాన్ డకాయత్‌కు అనుచరిగా మాత్రమే కనిపించిన రణ్‌వీర్ పార్ట్ 2లో మాత్రం ఊహించని వైలెన్స్‌తో యాక్షన్ సన్నివేశాలని పీక్స్‌కి తీసుకెళ్లి తన విశ్వరూపాన్ని చూపించడం ఖాయం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ టీమ్‌పై ముంబయి పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఈ మూవీకి సంబంధించిన లొకేషన్ మేనేజర్‌పై లీగల్ యాక్షన్ తీసుకున్నారట.
సౌత్ ముంబయిలోని ఫోర్ట్ ఏరియాలో ఎలాంటి అనుమతి లేకుండా మూవీ లొకేషన్ మేనేజర్ రింకూ రాజ్‌పాల్ వాల్మీకీపై ముంబయి పోలీసులు కేసు ఫైల్ చేశారట. అండర్ సెక్షన్ 223 భారతీయ న్యాయ సంహిత ప్రకారం రింకూ రాజ్‌పాల్ వాల్మీకీపై కేసు ఫైల్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సౌత్ ముంబయి ఏరియాలోని ఫోర్ట్‌లపై అనుమతి లేకుండా డ్రోన్‌లు ఎగిరేయడం నిషేధం. అక్కడ నిత్యం సీసీ కెమెరాలతో పోలీసులు పర్యవేక్షిస్తుంటారట.
అలాంటి ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరేయడంతో ధురంధర్ టీమ్ లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. `ధురంధర్ 2`కు కోసం సంజయ్‌దత్ పాల్గొనగా పాకిస్థాన్ లోని ఓ ఓల్డ్ స్ట్రీట్‌కు సంబంధించిన సన్నివేశాలకు సంబంధించిన ప్యాచ్ వర్క్‌ని పూర్తి చేస్తున్నారట. ఆ సమయంలోనే డ్రోన్ అనధికారికంగా ఎగిరేయాల్సి వచ్చిందని, దాని వల్లే కేసు ఫైల్ చేశామని పోలీసులు చెప్పడం గమనార్హం.