మహేంద్రగిరి వారాహి.. గట్టిగా ప్లాన్ చేస్తున్న సుమంత్!
ఈ సినిమాలో ఆడియన్స్ కు ఒక బిగ్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతోంది. ఒక స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే పవర్ ఫుల్ స్పెషల్ రోల్ లో కనిపిస్తారని ప్రొడ్యూసర్ వెల్లడించారు.
హీరో సుమంత్ నటిస్తున్న డివోషనల్ థ్రిల్లర్ 'మహేంద్రగిరి వారాహి' మూవీ రిలీజ్ డేట్ ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. సంతోష్ జాగర్లపూడి డైరెక్ట్ చేసిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తెస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ లో ఒక కోటి వ్యూస్ మార్క్ దాటేసింది. ఈ రెస్పాన్స్ చూశాకే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా క్రేజీ డీల్స్ తో వెంటనే క్లోజ్ అయినట్లు ప్రొడ్యూసర్ మధు కన్ఫర్మ్ చేశారు.
ఈ సినిమాలో ఆడియన్స్ కు ఒక బిగ్ సర్ ప్రైజ్ ఎలిమెంట్ ఉండబోతోంది. ఒక స్టార్ హీరో దాదాపు 20 నిమిషాల నిడివి ఉండే పవర్ ఫుల్ స్పెషల్ రోల్ లో కనిపిస్తారని ప్రొడ్యూసర్ వెల్లడించారు. ఆ క్యారెక్టర్ ఎవరనేది రాబోయే ట్రైలర్ లో రివీల్ చేయబోతున్నారు. ఇక సీనియర్ నటి ఐశ్వర్య రాజేష్ ఇందులో 'వారాహి అమ్మవారు'గా కీలక పాత్రలో కనిపించనుంది. సినిమా గ్రాండ్ గా జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేయడానికి చిత్రయూనిట్ ప్లాన్ చేస్తోంది.
ఈ ప్రాజెక్ట్ జర్నీ గురించి హీరో సుమంత్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ కథ రెండున్నరేళ్ల క్రితమే స్టార్ట్ అయినా, అనుకున్న విజువల్ స్కేల్ కి తగ్గట్టు ప్రాపర్ బడ్జెట్ ఇచ్చే నిర్మాతల కోసం కాస్త వెయిట్ చేయాల్సి వచ్చిందన్నారు. టీజర్ లో చూపించింది కేవలం ఒక చిన్న శాంపిల్ మాత్రమేనని, క్లైమాక్స్ తో పాటు థియేటర్లలో ప్రతి మూమెంట్ లో ఒక ట్విస్ట్ తో ఆడియన్స్ కు సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ దక్కడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
డైరెక్టర్ సంతోష్ కి ఇండియన్ హిస్టరీ, పురాణాలపై మంచి గ్రిప్ ఉందని సుమంత్ చెప్పారు. దేశంలో 'కాంతార' లాంటి డివోషనల్ ట్రెండ్ స్టార్ట్ కావడానికి ముందే తాము ఈ కథను లాక్ చేశామని తెలిపారు. తను పర్సనల్ గా ఒక అత్యున్నతమైన శక్తి ఉందనేది నమ్ముతానని చెప్పుకొచ్చారు. అలాగే మన దేశ చరిత్ర, పురాణాలు, సంస్కృతి వెనుక ఉన్న విషయాలను తెలుసుకోవడం తనకు చాలా ఇష్టమని సుమంత్ క్లారిటీ ఇచ్చారు.
పాన్ ఇండియా లెవెల్ లో గ్రాండ్ గా వస్తున్న ఈ 'మహేంద్రగిరి వారాహి' చిత్రాన్ని పలు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నారు. టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెరగడంతో రాబోయే ప్రమోషనల్ కంటెంట్ పై ఆడియన్స్ లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. ఇండియన్ మైథాలజీ నేపధ్యంలో వస్తున్న ఈ థ్రిల్లర్ కాన్సెప్ట్ థియేటర్లలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.
సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్, ఆర్ట్ వర్క్ కు సంబంధించిన పనులను టీమ్ చాలా కేర్ తీసుకుని పూర్తి చేసినట్లు సమాచారం. డివోషనల్ ఎలిమెంట్స్ మైథలాజికల్ ట్విస్టులు క్లిక్ అయితే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అవే. సెప్టెంబర్ 11న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా సుమంత్ కెరీర్ లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తేలనుంది.