చిరంజీవి-శ్రీకాంత్ ఓదెల మార్చి నుంచి మొదలు పెడతారా?
మెగాస్టార్ చిరంజీవి- `దసరా` వంటి మాస్ బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి- `దసరా` వంటి మాస్ బ్లాక్‌బస్టర్‌తో దర్శకుడిగా నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం లాక్ అయిన సంగతి తెలిసిందే. `దసరా` చిత్రంలో శ్రీకాంత్ ఓదెల చూపించిన రా అండ్ రస్టిక్ మేకింగ్, ఎమోషనల్ గ్రాఫ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాంటి దర్శకుడితో చిరంజీవి జోడీ కడుతుండటంతో చిరు ప్రాజెక్ట్‌పై అంచనాలు స్కైలోనే ఉన్నాయి. మెగాస్టార్ మాస్ ఇమేజ్‌కి -శ్రీకాంత్ టేకింగ్‌కి తగ్గట్టుగా వైవిధ్యమైన స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా కొంత వరకూ పూర్తయ్యాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ప్రారంభించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారుట. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో తెరకెక్కిస్తోన్న `పారడైజ్` చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ ప్రాజెక్ట్ ముగిసిన వెంటనే మార్చిలో చిరంజీవి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈలోగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌ల చిత్రీకరణను ముగించి.. మార్చి నాటికి శ్రీకాంత్ ఓదెల సినిమా కోసం పూర్తిగా అందుబాటులోకి రానున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవిని మునుపెన్నడూ చూడని విలక్షణమైన, రస్టిక్ అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో నిర్మించేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల మార్క్ విజనరీ మేకింగ్, విక్రమ్ మార్క్ యాక్షన్.. దసరా స్థాయి ఎమోషన్స్ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సాంకేతిక నిపుణుల ఎంపిక కూడా దాదాపు పూర్తయిందని సమాచారం.
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు ప్రాజెక్టులున్న సంగతి తెలిసిందే. విశ్వంభర షూటింగ్ పూర్తయింది. ఆ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు పూర్తి చేయాలి. రిలీజ్ సమయం లో ప్రచారంలో పాల్గొనాలి. అందుకు ఇంకా సమయం పడుతుంది. ప్రస్తుతం బాబి దర్శకత్వంలో `కాకా` షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి నుంచి సమ్మర్ కి వాయిదా వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లో విశ్వంభర రిలీజ్ చేస్తే కాకా సమ్మర్ లోనే రిలీజ్ అవుతుంది. అదే సమయంలో శ్రీకాంతో ఓదెల ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.