వంగా అన్నాడు.. సుమంత్ మాత్రం లైట్ తీసుకున్నారు!

ఒకరి అభిప్రాయం నచ్చకపోతే వెంటనే కౌంటర్ ఇవ్వడం.. తన సినిమాలు, రోల్స్ ను సమర్థించుకోవడం.. ఇదంతా సినీ ఇండస్ట్రీలో కామన్.

Update: 2026-09-13 04:17 GMT

ఒకరి అభిప్రాయం నచ్చకపోతే వెంటనే కౌంటర్ ఇవ్వడం.. తన సినిమాలు, రోల్స్ ను సమర్థించుకోవడం.. ఇదంతా సినీ ఇండస్ట్రీలో కామన్. కానీ టాలీవుడ్ హీరో సుమంత్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటారు. తన గురించి ఎవరేం అన్నా పెద్దగా పట్టించుకోకుండా.. ఎవరి అభిప్రాయం వాళ్లదేనంటూ హుందాగా రెస్పాండ్ అవ్వడం ఆయన స్టైల్. రీసెంట్ గా శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యల విషయంలోనూ సుమంత్ స్పందించిన తీరు ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఎపిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ లో సందీప్ రెడ్డి వంగా శేఖర్ కమ్ముల సినిమాల హీరోలపై తన అభిప్రాయాన్ని చెప్పారు. శేఖర్ కమ్ముల హీరోలు తనకు నచ్చరని.. అయితే ఆయన సినిమాల్లోని హీరోయిన్లు మాత్రం బాగుంటారని అన్నారు. శేఖర్ కమ్ముల హీరోలు చాలా సాఫ్ట్‌ గా, అమాయకంగా ఉంటారని అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో సందీప్ వంగా కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

ఎందుకంటే శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరో రోల్స్ కు ఇండస్ట్రీలో స్పెషల్ క్రేజ్ ఉంది. ఆయన కథల్లో హీరో అంటే తప్పనిసరిగా మాస్‌ గా, ఫుల్ స్పీడ్ గా ఉండాల్సిన అవసరం ఉండదు. నార్మల్ పర్సన్ లా.. తన చుట్టూ ఉన్న పరిస్థితులకు తగ్గట్టు ఉండే రోల్స్ నే ఆయన ఎక్కువగా చూపిస్తుంటారు. అలాంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సుమంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గోదావరి.

2006లో వచ్చిన ఆ సినిమాలో శ్రీరామ్ రోల్ లో సుమంత్ ఎంతో నేచురల్ గా కనిపించారు. పెద్దగా హడావుడి లేకుండా.. తన ఆలోచనలతో, మాట తీరుతో ఆకట్టుకునే యువకుడిగా కనిపించారు. ముఖ్యంగా ఆ రోల్ లో కనిపించే డిగ్నిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయాయి. అయితే ఇప్పుడు శేఖర్ కమ్ముల హీరోలపై వచ్చిన కామెంట్స్‌ కు సుమంత్ రెస్పాండ్ అయిన విధానం కూడా ఆయన పర్సనాలిటీ తగ్గట్టుగానే కనిపించింది.

ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం.. ఎవరికీ నచ్చేది వాళ్లకు నచ్చుతుంది.. అన్న టైప్ లో ఆయన సందీప్ వంగా కామెంట్స్ ను లైట్ తీసుకున్నారు. వెంటనే విమర్శలు చేయడం కానీ.. తన రోల్ ను సమర్థించుకునేందుకు ప్రయత్నించడం కానీ చేయలేదు. అంతే కాకుండా సందీప్ వంగా అర్జున్ రెడ్డి తన ఫేవరెట్ సినిమాల్లో ఒకటని చెప్పారు. నిజానికి సుమంత్‌ కు ఇండస్ట్రీలో ఉన్న గుర్తింపు ఇదే.

సినిమాల విషయంలో అయినా.. పర్సనల్ విషయాల్లో అయినా.. ఎక్కువగా వివాదాలకు దూరంగా ఉంటూ తన పని తాను చేసుకుంటూ వెళ్లే సెలబ్రిటీగా కనిపిస్తారు. గోదావరిలో శ్రీరామ్ రోల్ లో కనిపించిన ఆ డిగ్నిటీ.. బయట కూడా సుమంత్ పర్సనాలిటీలో కనిపిస్తుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. అందుకే శేఖర్ కమ్ముల హీరోలపై సందీప్ రెడ్డి వంగా అభిప్రాయం ఏదైనా.. సుమంత్ మాత్రం తన డిగ్నిటీ మాత్రం ఎప్పటిలాగే కాపాడుకున్నారు.

Tags:    

Similar News