గీతూ మోహన్ దాస్ పరిస్థితి ఏంటి?
అయితే ఊహించని రీతిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితాలు తారు మారు అవ్వడంతో? గీతూ మోహన్‌దాస్ డైరెక్టర్ కెరీర్ మళ్లీ డైలమాలో పడింది.
దర్శకుల విజయం బాక్సాఫీస్ అంకెలతోనే కొలవబడుతుందనేది బహిరంగ సత్యం. `లయర్స్ డైసెక్ట్`, `మూథోన్` వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న గీతూ మోహన్‌దాస్ రాకింగ్ స్టార్ యష్‌తో `టాక్సిక్` వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఊహించని రీతిలో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితాలు తారు మారు అవ్వడంతో? గీతూ మోహన్‌దాస్ డైరెక్టర్ కెరీర్ మళ్లీ డైలమాలో పడింది.
`కేజీఎఫ్` సిరీస్ తర్వాత యష్ నటించిన చిత్రం కావడం.. దానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించడంతో `టాక్సిక్` పై అంతర్జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. క్లాస్ అండ్ ఇండీ-ఫిల్మ్ డైరెక్టర్ భారీ మాస్ పాన్-ఇండియా రంగానికి నాయకత్వం వహించడం సినీ వర్గాలలో సంచలనమైంది. ఈ సినిమా హిట్ అయి ఉంటే గీతూ మోహన్‌దాస్ పేరు టాప్ మోస్ట్ పాన్-ఇండియా దర్శకుల సరసన నిలిచేది. బాలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన అగ్ర నటులు ఆమెతో పనిచేయడానికి క్యూ కట్టేవారు. కానీ అంచనాలను అందుకోలేకపోవడం ఆమె భవిష్యత్ ప్రణాళికలపై పెద్ద దెబ్బగానే మారింది.
సంవత్సరాల తరబడి సిద్ధం చేసిన డ్రీమ్ ప్రాజెక్ట్ ప్లాప్ అయినప్పుడు దాని ప్రభావం దర్శకుడి సుదీర్ఘ సమయం పైనే పడుతుంది. ఇండీ సినిమాలతో అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రశంసలు అందుకున్న గీతూ వందల కోట్ల బడ్జెట్ ఉన్న కమర్షియల్ సినిమాను హ్యాండిల్ చేసే క్రమంలో ఎమోషన్స్ , మాస్ ఎలిమెంట్స్ మధ్య సమతుల్యతను దెబ్బతీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. సుదీర్ఘ గ్యాప్ తర్వాత చేసిన సినిమా ఇలాంటి ఫలితాన్ని ఇవ్వడం ఏ దర్శకుడికైనా మానసికంగా, వృత్తిపరంగా పెద్ద నిరాశే.
పరిశ్రమలో ఒక చేదు నిజం ఏమిటంటే? వందల కోట్ల పెట్టుబడులు పెట్టే నిర్మాతలు -పాన్-ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలు ట్రాక్ రికార్డ్‌ను పరిగణిస్తారు. `టాక్సిక్` తెచ్చిన నష్టాల నేపథ్యంలో బిగ్-బడ్జెట్ ప్రాజెక్ట్‌ల కోసం ఆమెను సంప్రదించడానికి ప్రొడక్షన్ హౌస్‌లు మళ్లీ పునరాలోచనలో పడే అవకాశం ఉంటుంది. పెద్ద స్టార్ హీరో ఆమెకు అవకాశం ఇవ్వడం తక్షణమే జరిగే పని కాదు.
ఈ ప్లాప్ గీతూ మోహన్‌దాస్ ప్రతిభను పూర్తిగా ప్రశ్నించేది కాదు. కానీ కమర్షియల్ ఫార్మాట్‌పై ఆమె శైలిని పునపరిశీలించుకునేలా చేసింది. కథ చెప్పడంలో విలక్షణత, డార్క్ రా ఎమోషన్స్‌ను పండించడంలో ఆమె నైపుణ్యం సందేహించలేనిది. అయితే సాధారణ ప్రేక్షకుడికి కావలసిన కమర్షియల్ పల్స్‌ను పట్టుకోవడంలో గీతూ ఎక్కడ తడబడ్డారనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారీ కాన్వాస్ కంటే బలమైన కథా వస్తువే అసలు బలమని గీతూకు ఈ ఫలితం గుర్తు చేస్తుంది.
అయితే ఒక్క ఫ్లాప్‌తో కెరీర్ ముగిసిపోదు. ఎందరో దిగ్గజ దర్శకులు భారీ ప్లాప్‌ల తర్వాత మళ్లీ నిరూపిం చుకున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్‌దాస్ ముందున్న మార్గం మళ్లీ సొంత శైలికి ప్రాధాన్యమిచ్చే మీడియం-బడ్జెట్.. కంటెంట్-ఓరియంటెడ్ సినిమాలతో తిరిగి రావడం. తన బలాన్ని నిరూపించుకునే డ్రామా చిత్రాలను ఎంచుకుని విజయం సాధిస్తే పరిశ్రమ మళ్లీ పూల బాట వేస్తుందనడంలో సందేహం లేదు.