రామ్ చరణ్ ను ఈ ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ కొత్త చూపిస్తారా? వాళ్ళతో మూవీ ఎప్పుడు...
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ తనదైన స్టైలిష్ మేకింగ్ యాక్షన్ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన కెరీర్ లో అత్యంత కీలకమైన దశలో ఉన్నాడు. 'ఆర్ఆర్ఆర్' మూవీతో ఆయన క్రేజ్ అంతర్జాతీయ స్థాయికి చేరడంతో ఆయన నటిస్తున్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఆయన సుకుమార్ డైరెక్షన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ మూవీ మీదనే పూర్తి ఫోకస్ చేస్తున్నాడు. ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండబోతుందట. తొందర్లోనే ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్లబోతోంది...రామ్ చరణ్ భవిష్యత్ లో చేయబోయే ప్రాజెక్ట్ ల మీద టాలీవుడ్ కోలీవుడ్ సర్కిల్ లో చర్చలు జరుగుతున్నాయి. విభిన్న కథాంశాలతో హీరోలను కొత్తగా చూపించగలిగే ఇద్దరు దర్శకులతో రామ్ చరణ్ జత కట్టబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ దర్శకులు లోకేష్ కనకరాజ్, వివేక్ ఆత్రేయ...
లోకేష్ కనకరాజ్ కాంబో పై భారీ అంచనాలు
తమిళ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనక రాజ్ తనదైన స్టైలిష్ మేకింగ్ యాక్షన్ సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కార్తీ, కమల్ హాసన్, విజయ్, రజినీకాంత్ లను డిఫరెంట్ షేడ్స్ లో చూపించిన లోకేష్, భవిష్యత్ లోను రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ చేసే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోకేష్ డిఫరెంట్ మేకింగ్ కి రామ్ చరణ్ పర్ఫామెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు నమోదవుతాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ ఇతర ప్రాజెక్టులతో బిజీ గా ఉన్నారు...
వివేక్ ఆత్రేయ తో చర్చలు జరుగుతున్నాయా?
ప్రస్తుతం ఉన్న యంగ్ మేకర్స్ లో వివేక్ ఆత్రేయ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. రవితేజ తో 'తులాభారం' మూవీ చేస్తున్నాడు. వివేక్ స్క్రీన్ ప్లే చాలా ఎంజింగ్ గా రాసుకుంటాడు. అందుకే మిగతా దర్శకుల కంటే ఆయన చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ కోసం ఆల్రెడీ ఒక సబ్జెక్ట్ ను రెడీ చేశాడట. చరణ్ డేట్స్ ఇస్తే మాత్రం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో ఎవ్వరు ఊహించని విధంగా రామ్ చరణ్ ను చూపిస్తాడట. నిజానికి చరణ్ సైతం కొత్త స్టోరీస్ కోసం వెతుకుతున్నాడు. ఈ జనరేషన్ ప్రేక్షకుల అభిరుచి తెలుసుకొని సినిమాలను చేసే దర్శకుల మీద ఆయన ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు... తొందర్లోనే వీళ్ళ కాంబోలో మూవీ వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.