'డ్రాగన్' అణుబాంబు.. రాజీవ్‌ కనకాల అలా అనేశాడేంటి!

ఇంతకు రాజీవ్‌ కనకాల ఏమన్నాడంటే... డ్రాగన్‌ సినిమా అందరి అంచనాలను అందుకుంటుంది అన్నాడు.

Update: 2026-10-29 14:49 GMT

ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో రూపొందుతున్న 'డ్రాగన్‌' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రశాంత్‌ నీల్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రశాంత్‌ నీల్‌ గత చిత్రాలు కేజీఎఫ్‌, కేజీఎఫ్‌ 2, సలార్‌ ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంత్‌ నీల్‌ వంటి పవర్‌ ఫుల్‌ దర్శకుడి చేతిలో పవర్‌ హౌస్‌ వంటి ఎన్టీఆర్‌ పడితే ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే ఊహకు సైతం అందని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ చాలా ప్రశాంతంగా సినిమాను చేస్తూ ఉన్నాడు. ఎన్టీఆర్‌ గాయం కారణంగా ఇన్ని రోజులు షూట్‌ కి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్‌ షూట్‌ లో పాల్గొంటున్నాడనే వార్తలతో అంచనాలు మరింతగా పెరిగాయి.

ప్రశాంత్‌ నీల్‌ పాన్ ఇండియా మూవీ...

ప్రశాంత్‌ నీల్‌ సినిమా అంటే పాన్‌ ఇండియా రేంజ్‌లో అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా పెరుగుతున్నాయి. హిందీలో కేజీఎఫ్‌, సలార్‌ సాధించిన వసూళ్లను బాక్సాఫీస్‌ వర్గాల వారు, బాలీవుడ్‌ స్టార్స్‌ సైతం మర్చిపోలేక పోతున్నారు. ఏ హిందీ సినిమా సాధించని రికార్డ్‌లను ప్రశాంత్‌ నీల్‌ తన సినిమాలతో సాధించడంతో ఇప్పుడు ఆయన నుంచి రాబోతున్న సినిమాపై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అంచనాలకు తగ్గట్లుగా, చాలా సమయం తీసుకుని ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్‌ ను రూపొందిస్తున్నాడు. ఎన్టీఆర్‌ కు చాలా ఆప్తుడిగా పేరున్న రాజీవ్‌ కనకాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ కు ఒక వైపు సంతోషాన్ని కలిగిస్తూనే మరో వైపు టెన్షన్‌ క్రియేట్‌ చేసే విధంగా రాజీవ్‌ కనకాల వ్యాఖ్యలు ఉన్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఎన్టీఆర్‌ డ్రాగన్ గురించి రాజీవ్‌ కనకాల...

ఇంతకు రాజీవ్‌ కనకాల ఏమన్నాడంటే... డ్రాగన్‌ సినిమా అందరి అంచనాలను అందుకుంటుంది అన్నాడు. అంతే కాకుండా తారక్‌, ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, మైత్రి మూవీ మేకర్స్‌.. ఇన్ని కలిశాయి, ఇన్ని కలిసినప్పుడు ఫలితం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక అణుబాంబు ఎలా ఉంటుందో డ్రాగన్‌ సినిమా అలా ఉంటుంది. కచ్చితంగా ఎన్టీఆర్‌ అభిమానులు అంతా కాలర్‌ ఎత్తే విధంగా ఉంటుందని, కాలర్‌ ఎత్తి మరీ చూపించాడు. దాంతో ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లో విపరీతమైన హైప్‌ క్రియేట్‌ అయింది. ఎన్టీఆర్‌ సినిమాల గురించి, ఆయన వ్యక్తిగత విషయాల గురించి రాజీవ్‌ కనకాలకు బాగా తెలుసు. అందుకే ఆయన నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో కచ్చితంగా పాజిటివ్‌ బజ్‌ ఉంటుంది. ఏకంగా అణుబాంబు అంటూ చెప్పడంతో ఫ్యాన్స్‌ లో ఒకింత ఆందోళన కూడా మొదలైంది. ఎన్టీఆర్‌ సినిమాకు గతంలో విపరీతమైన క్రేజ్ వచ్చి నిరాశ పరిచాయి.

ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ లో రచ్చ...

డ్రాగన్‌ విషయంలో అలాంటి సందేహం ఏం అక్కర్లేదు అంటూ ఒక వైపు ఫ్యాన్స్‌ మాట్లాడుకుంటూనే మరో వైపు డ్రాగన్‌ సినిమా సౌత్‌ ఇండియన్‌ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. డ్రాగన్‌ సినిమాలో మాస్‌ ఆడియన్స్‌ కి కావాల్సిన యాక్షన్‌ తో పాటు, అన్ని వర్గాల వారికి కావాల్సిన డ్రామా సైతం పుష్కలంగా ఉంటుందని అంటున్నారు. ఎన్టీఆర్‌ సినిమాలంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ ప్రేక్షకులు ఉంటారు. కనుక ప్రశాంత్‌ నీల్ తన మార్క్‌ కొనసాగిస్తూనే, ఫ్యామిలీ టచ్ సైతం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే రాజీవ్‌ కనకాల ఈ సినిమాను అణుబాంబు అంటూ పోల్చుతున్నాడు. ఆయన మాట ప్రకారం ఈ సినిమా అణుబాంబు మాదిరిగా పేలితే ఇండస్ట్రీలో ఉన్న రికార్డ్‌లు అన్ని మట్టిలో కలిసి పోయి, కొత్త రికార్డ్‌లు నమోదు కావడం ఖాయం. ప్రశాంత్‌ నీల్‌ సినిమా కనుక కచ్చితంగా ఆ స్టామినా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇక ఎన్టీఆర్‌కి మంచి సబ్జెక్ట్‌ దొరికితే ఏ స్థాయిలో ఉంటుందో ఆయన టీనేజ్‌ లో ఉండగానే నిరూపించాడు. కనుక ఈ సినిమా గురించి ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. ఫ్యాన్స్ కాలర్‌ ఎగరవేసేందుకు రెడీగా ఉండండి అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News