ప్రభాస్ కెరియర్ లో బెస్ట్ లుక్స్ ఇవే...
తెలుగు చిత్రసీమలో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.డిఫరెంట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు.
తెలుగు చిత్రసీమలో కెరీర్ మొదలుపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.డిఫరెంట్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. కటౌట్ చూడగానే హీరో అంటే ఇలానే ఉండాలి అనేంతలా ప్రేక్షకుడి మెప్పు పొందిన నటుడు... వింటేజ్ క్లాసిక్ లవర్ బాయ్ నుంచి పాన్ ఇండియా విజనరీ వీరుడి వరకు ప్రభాస్ కెరీర్ లో నిలిచిపోయిన బెస్ట్ లుక్స్ పై ప్రత్యేక కథనం...
మిర్చి (స్టైలిష్ అవతార్)
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక హీరో తన గెటప్ తో ట్రెండ్ క్రియేట్ చేసిన మూవీ మిర్చి. ప్రభాస్ ఇన్షర్ట్ వేసుకొని స్లిమ్ ఫిట్ కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. స్టైలిష్ లుక్ లో కనిపిస్తూనే మాస్ ఆడియన్స్ ను అలరించేలా యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడు. క్లాస్ విత్ మాస్ అనేలా తన లుక్ ను బాగా డిజైన్ చేసుకున్నారు.
బిల్లా (అల్ట్రా మోడరన్ కటౌట్)
మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీలో బిల్లా క్యారెక్టర్ లో హాలీవుడ్ హీరోల కనిపిస్తాడు. 6 అడుగుల హైట్ కి సూట్ వేసుకొని హెలికాప్టర్ నుంచి దిగి నడుచుకుంటూ వస్తుంటే ప్రభాస్ ను చూడటానికి 70 ఏం ఏం స్క్రీన్స్ కూడా సరిపోలేదనే చెప్పాలి. చాలా ఫ్రెష్ లుక్ లో ప్రభాస్ చాలా డైనమిక్ గా కనిపించాడు.
మున్నా (రాక్ స్టార్)
కాలేజ్ కుర్రాడైన అందరిలోకి డిఫరెంట్ గా కనిపించే మున్నా...తన బాడీ లాంగ్వేజ్ తో పాటు తన గెటప్ లో కూడా స్టైలిష్ గా కనిపిస్తాడు. పొడుగాటి జులపాలతో కండలు తిరిగిన దేహంతో యూత్ ను అట్రాక్ట్ చేసే టి షర్ట్స్ వేసుకొని బస్ కోసం పరిగెడుతుంటే అతని అభిమానుల ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి.
బాహుబలి (రాచరికం ఉట్టిపడే యోధుడు)
అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అనే రెండు క్యారెక్టర్లలో వేరియేషన్స్ ను చూపిస్తూ ఒక రాజు ఎలాంటి రాజసం తో ఉంటాడో అలాంటి పర్ఫెక్ట్ లుక్స్ తో ప్రేక్షకులను మెప్పించాడు. నిజంగా రాజు అంటే ఇలానే ఉంటాడేమో అనేంతలా మ్యాజిక్ చేశాడు. తన పొడుగాటి హెయిర్ కి తన కష్ట్యూమ్స్ తన హావభావాలు అతని లుక్స్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి.
కల్కి (ఫ్యూచరిస్టిక్ భైరవ)
సైన్స్ ఫిక్షన్ డిస్టోపియన్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో ప్రభాస్ చాలా కొత్తగా కనిపించారు. పోనీ టెల్ ఆర్మోర్ కాస్ట్యూమ్స్, గడ్డం తో కనిపించాడు. భైరవ పాత్ర లుక్స్ ప్రేక్షకులందరి దృష్టిని ఆకర్షించింది.
ఛత్రపతి (మాస్ అండ్ ఇంటెన్స్)
బానిసలుగా బతికుతున్న మనుషుల మధ్య ఛత్రపతి అనే రా క్యారెక్టర్ లో చాలా ఇంటెన్సిటీ తో కనిపించాడు. ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్ లుక్ లో కనిపిస్తాడు. సెకండాఫ్ లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ తో ఒక స్టైలిష్ లుక్ లో కనిపిస్తాడు...
డార్లింగ్ అండ్ మిస్టర్ పెర్ఫెక్ట్ (ఛార్మింగ్ అండ్ లవర్ బాయ్)
నిజానికి ఈ రెండు సినిమాలు కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేమకథ మిళితమై ఉన్న సినిమాలు. వీటిలో చాలా క్లాస్ లుక్స్ తో మెప్పించాడు. డార్లింగ్ లో లూజ్ గా ఉండే టి షర్ట్స్ వేసుకొని ఒక ఛార్మింగ్ కుర్రాడిలా కనిపించి మ్యాజిక్ చేశాడు. మిస్టర్ పెర్ఫెక్ట్ లో చిన్న జుట్టు తో ఒక క్లాసిక్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు.
వర్షం (ఫ్రెష్ అండ్ యంగ్ కటౌట్)
యంగ్ అండ్ డైనమిక్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఒక పాతికేళ్ల సాధారణ కుర్రాడిలా కనిపించినప్పటికి ఫ్రెష్ లుక్ తో అప్పుడున్న యూత్ లో ఒక జోష్ నింపాడు.
సాహో (స్టైలిష్ అండర్ కవర్ ఏజెంట్)
ఈ సినిమాలో ప్రభాస్ మెకోవర్ అధ్బుతంగా ఉంటుంది. ఒకవైపు క్యాజువల్ షర్ట్స్ లో సైలెంట్ గా ఉంటూనే మరోవైపు క్లైమాక్స్ లో కాస్ట్లీ సూట్ ధరించి రాయల్ చైర్ లో కూర్చొనే పర్టిక్యులర్ సీన్ అభిమానులకు విజువల్ ఫీస్ట్ అనే చెప్పాలి...
రాబోయే సినిమాల లుక్స్ తో ప్రభాస్ తన అభిమానులను ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి...