Koffee With Karan: ఎప్పుడూ ఇతరుల వ్యక్తిగత జీవితాలే ఎందుకు టార్గెట్ చేస్తారు?
బాలీవుడ్లో సినిమాల గురించి, నటీనటుల నటన గురించి మాట్లాడటం కంటే.. ఒక హీరో లేదా హీరోయిన్ వ్యక్తిగత జీవితం గురించి టాక్ షోలలో మాట్లాడడం ఎక్కువైపోయింది.
బాలీవుడ్లో సినిమాల గురించి, నటీనటుల నటన గురించి మాట్లాడటం కంటే.. ఒక హీరో లేదా హీరోయిన్ వ్యక్తిగత జీవితం గురించి టాక్ షోలలో మాట్లాడడం ఎక్కువైపోయింది. ముఖ్యంగా బాలీవుడ్ టాక్ షోలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఒక నటుడు మరో నటుడిపై కామెంట్స్ చేయడం, ఒక హీరోయిన్ గురించి ఇంకొకరు పరోక్షంగా మాట్లాడటం కామన్ అయిపోయింది. తాజాగా జాన్వీ కపూర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది.
బాలీవుడ్లో ప్రముఖ టాక్ షో అయిన కాఫీ విత్ కరణ్ సీజన్ 9లో జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోస్ట్ కరణ్ జోహార్.. వీర్ పహారియాకు డేటింగ్ విషయంలో ఏ సలహా ఇస్తావని జాన్వీని అడిగారు. దీనికి ఆమె స్పందిస్తూ.. అమ్మాయిని ఎప్పుడూ కాన్సర్ట్ తీసుకెళ్లవద్దు అని సరదాగా సమాధానం ఇచ్చింది.
అయితే..ఈ వ్యాఖ్యలు గురించి సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. వీర్ పహారియా, తారా సుతారియా మధ్య వచ్చిన బ్రేకప్ వార్తలకు జాన్వీ కామెంట్స్‌కు సంబంధం ఉందని కొందరు భావిస్తున్నారు.
2025 డిసెంబర్లో ముంబైలో జరిగిన ఏపీ ధిల్లాన్ సంగీత కార్యక్రమంలో తారా సుతారియా వేదికపైకి వెళ్లారు. అక్కడ గాయకుడు ఆమెను హత్తుకుని చెంపపై ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సమయంలో ప్రేక్షకుల్లో ఉన్న వీర్ పహారియా రిప్లై గురించి కూడా చాలానే చర్చ జరిగింది. అయితే, ఎడిట్ చేసిన వీడియోల ఆధారంగా తప్పుడు ప్రచారం జరుగుతోందని ఈ వ్యవహారంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి.
వీర్, తారా విడిపోయారంటూ 2026 జనవరిలో వార్తలు వచ్చినప్పటికీ, వారిద్దరూ అధికారికంగా తమ బ్రేకప్ను ప్రకటించలేదు.
ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే.. బాలీవుడ్ టాక్ షోలలో ఇతరుల వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎంతవరకు ఉంది.. అనేది వస్తున్న ప్రశ్న. ఒక నటుడు తన సినిమాల గురించి, కెరీర్ గురించి, తన అనుభవాల గురించి మాట్లాడితే ప్రేక్షకులకు కొత్త విషయాలు తెలుస్తాయి. కానీ మరొకరి రిలేషన్‌షిప్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తే వివాదాలు పెరిగే అవకాశం ఉంటుంది.
నిజానికి ఇలాంటి కార్యక్రమాల్లో సరదా ప్రశ్నలు, ఆటపట్టించే మాటలు సహజమే. కానీ ఆ మాటలు మరో వ్యక్తి వ్యక్తిగత జీవితానికి ముడిపడినప్పుడు వాటికి కొత్త అర్థాలు వస్తాయి. సోషల్ మీడియాలో వాటిపై ఊహాగానాలు మొదలవుతాయి.
ఒకరు సరదాగా అన్న మాటను మరొకరు వివాదంగా మార్చే పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు అసలు విషయం కంటే దాని చుట్టూ వచ్చే గాసిప్పులకే ఎక్కువ వినిపిస్తాయి. ఈమధ్య ఈ షోకి అతని అయిన విజయ్ దేవరకొండ, రష్మిక విషయంలో కూడా ఇలాంటివే చాలా జరిగాయి.
సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై ప్రేక్షకులకు ఆసక్తి ఉండొచ్చు. అయితే, ప్రతి టాక్ షోలోనూ ఇతరుల గురించి కామెంట్స్ చేయడం కంటే, తమ అనుభవాలు, సినిమాలు, కెరీర్ గురించి మాట్లాడితే మరింత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే ఒకరిని టార్గెట్ చేయడం ద్వారా వచ్చే వైరల్ న్యూస్ కొద్దిరోజులే ఉండవచ్చు.. కానీ మంచి విషయాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం మాత్రం ఎక్కువకాలం గుర్తుండిపోతుంది.