మొన్నటి వరకు త్రిష రియల్‌ జయలలిత.. ఇప్పుడు రీల్‌?

ఆ వ్యాఖ్యలు తప్పకుండా భవిష్యత్తులో నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ రాజకీయ వారసురాలిగా తప్పకుండా త్రిషకు ఛాన్స్ దక్కుతుంది.

Update: 2026-10-29 18:30 GMT

తమిళనాడు ముఖ్యమంత్రిగా సూపర్‌ స్టార్‌ విజయ్‌ ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ముందు వరుసలో త్రిష కూర్చుని ఉండటం దేశం మొత్తం చూసింది. ఇప్పుడు కూడా విజయ్‌, త్రిష మధ్య ఏం లేదు అంటే నమ్మడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరు. త్రిష ని ఒక మాట అంటే ఏకంగా తమిళనాడు పెద్ద నాయకుడినే జైల్లో వేసేందుకు సీఎం విజయ్ రెడీ అయ్యాడంటే ఏ స్థాయిలో వారిద్దరి మధ్య బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చాలా మంది విజయ్‌, త్రిష మధ్య ఉన్న బంధం గురించి, భవిష్యత్తులో జరగబోతున్న దాని గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. విజయ్‌ సీఎంగా అయిన తర్వాత చాలా మంది త్రిషను మాజీ ముఖ్యమంత్రి జయలలిత తో పోల్చడం జరిగింది. జయలలిత మాదిరిగా తాను కూడా తప్పకుండా భవిష్యత్తులో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతాను అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.

విజయ్‌ రాజకీయ వారసురాలు అంటూ ప్రచారం...

ఆ వ్యాఖ్యలు తప్పకుండా భవిష్యత్తులో నిజం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయ్ రాజకీయ వారసురాలిగా తప్పకుండా త్రిషకు ఛాన్స్ దక్కుతుంది. ఇప్పుడు కాకున్నా ఇంకో ఇరవై ఏళ్లకు అయినా విజయ్ పార్టీని నడిపించేది త్రిష అంటూ తమిళనాట ప్రచారం జరుగుతోంది. గతంలో ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత కీలక పాత్ర పోషించారు. ఆ సమయంలో చాలా మంది ఆమెను విమర్శించారు, చాలా మంది ఆమెను ఎంజీఆర్‌ కి దూరం చేయాలని ప్రయత్నించారు. కానీ ఎంజీఆర్‌, జయలలిత మధ్య ఉన్న ప్రేమ విడదీయలేనిది అని నిరూపితం అయింది. ఎంజీఆర్‌ తర్వాత జయలలిత ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నిజయమైన రాజకీయ వారసురాలు త్రిష మాత్రమే అని తమిళనాడు జనాలు సైతం ఒప్పుకుని ఆమెకు ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టిన విషయం తెల్సిందే.

ఎంజీఆర్‌ బయోపిక్‌లో త్రిష ప్రధాన పాత్ర...

ఎంజీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలిత ఏం చేసింది, ఇంకా ఎంజీఆర్‌ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి అనే విషయాలతో ఒక బయోపిక్‌ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ బయోపిక్‌ లో ఎంజీఆర్‌ పాత్రను ఎవరు చేస్తారు అనే విషయం పక్కన పెడితే కచ్చితంగా జయలలిత పాత్రను త్రిష చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. పెద్ద ఎత్తున పారితోషికం ఆఫర్‌ చేసి మరీ అమ్మ పాత్రను త్రిష తో చేయించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొన్నటి వరకు జయలలిత మాదిరిగా త్రిష రాజకీయాలు చేయబోతుందని, విజయ్‌ తో పాటు త్రిష రాజకీయ చక్రం తిప్పడం ఖాయం అని అంతా మాట్లాడుకుంటూ వచ్చారు. ఇప్పుడు తమిళ సినీ వర్గాల్లో రీల్‌ జయలలితగా త్రిషను చూడబోతున్నామనే చర్చ చేస్తున్నారు. మొత్తానికి విజయ్‌, త్రిషల అనుబంధం కారణంగా ఎంజీఆర్‌ బయోపిక్‌ లో త్రిషకు ఛాన్స్ వచ్చిందా అనే టాక్‌ మొదలైంది.

జయలలిత పాత్రలో త్రిష ఎంత వరకు నిజం...?

ఎంజీఆర్‌ సినీ నటుడిగా, రాజకీయ నాయకుడిగా తమిళ సినీ, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆయన జీవిత చరిత్రను వెండి తెరపై తీసుకు రావడం అనేది కచ్చితంగా ఆయనకు గౌరవం ను తెచ్చి పెడుతుంది. ఆయన గురించి అంతా తెలుసుకునే అవకాశం దక్కుతుంది. అలాగే అమ్మ జీవితం ను గురించి కూడా చాలా మంది తెలుసుకోవాలి అనుకుంటున్నారు. వారందరికీ ఇక్కడ తప్పకుండా సమాధానాలు లభిస్తాయని అంటున్నారు. ఎంజీఆర్‌ సినిమాలో నిజంగానే త్రిష నటించబోతుందా, అలా చేయడం వల్ల విజయ్‌ కి రాజకీయంగా నష్టం అనే అభిప్రాయంలో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది కాలమే నిర్ణయించాలి. త్రిష ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా చేయగలదని ఇప్పటికే రెండు దశాబ్దాలుగా నిరూపితం అవుతూనే ఉంది. ఇప్పుడు అమ్మ జయలలిత పాత్రలో కచ్చితంగా ఒదిగి పోతుందని ఫ్యాన్స్ అంటున్నారు. మరి నిజంగానే త్రిషకు ఆ ఛాన్స్ వచ్చిందా అనేది చూడాలి.


Tags:    

Similar News