విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌కు ఎన్ని సమస్యలు బాబోయ్!

సోషల్ మీడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అదే పెద్ద సమస్యగా మారుతుంది.

Update: 2026-10-29 16:35 GMT

తమిళ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్‌కు వరుసగా సమస్యలు ఎదురవుతూ ఉన్నట్లు కనిపిస్తునాయి. ఇప్పటికే కుటుంబానికి సంబంధించిన విషయాలతో వార్తల్లో నిలుస్తున్న ఆయనకు, ఇప్పుడు సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు మరో సమస్యగా మారాయి. దీంతో తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల గురించి జేసన్ సంజయ్ కీలక ప్రకటన చేశారు.

 

సోషల్ మీడియా అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు అదే పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా సినీ ప్రముఖుల కుటుంబాలకు చెందిన వారు సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారి పేరుతో ఎవరైనా నకిలీ ఖాతాలు సృష్టించి పోస్టులు పెడితే, వాటి వల్ల అనవసరమైన వివాదాలు వచ్చే అవకాశం ఉంటుంది.

జేసన్ సంజయ్ కూడా ఇప్పుడు ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు. తనకు సంబంధించిన అధికారిక ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్ ఖాతాల వివరాలను ఆయన వెల్లడించారు. ఈ ఖాతాలు కాకుండా తన పేరు, ఫొటోలు ఉపయోగిస్తూ ఇతరులు నిర్వహిస్తున్న ఖాతాలన్నీ నకిలీవని స్పష్టం చేశారు. వాటి ద్వారా వచ్చే పోస్టులు, సందేశాలు, వ్యాపార సంబంధిత అభ్యర్థనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

అంతేకాదు.. తనకు ప్రస్తుతం ఎలాంటి అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదని కూడా జేసన్ స్పష్టం చేశారు. తన పేరుతో ఎవరైనా అధికారిక ఫ్యాన్ క్లబ్ లేదా అభిమానుల సంఘం ఉందని చెబితే నమ్మవద్దని పరోక్షంగా హెచ్చరించారు. ఈ ప్రకటనతో తన పేరుతో జరిగే తప్పుడు ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరోవైపు, జేసన్ సంజయ్ సినీ రంగంలో కూడా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం సిగ్మా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. తన కొడుకు సినిమా విడుదలైన సమయంలో విజయ్ కూడా బహిరంగంగా మద్దతు తెలిపారు. ఒక కార్యక్రమంలో సినిమా పోస్టర్‌ను పైకి ఎత్తి చూపిస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అయితే..ఆ సినిమా ఆశించినంత విజయం సాధించ లేదు. కుటుంబానికి సంబంధించిన వార్తలు, సినిమా ఫలితాలు, ఇప్పుడు నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. ఇలా ఒక్కో సమస్య ఆయనను వార్తల్లో నిలుపుతోంది.

Tags:    

Similar News