'పొలిమేర 3' రూట్ మారుతోందా?

అయితే ఈ కొత్త కాస్టింగ్ ఎంట్రీతో పొలిమేర తన ఓరిజినల్ రూట్ ను మార్చుకుని రెగ్యులర్ మాస్ యాక్షన్ వైపు షిఫ్ట్ అవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Update: 2026-07-27 10:26 GMT

చిన్న బడ్జెట్ తో వచ్చి సంచలనం సృష్టించిన ఫ్రాంచైజీల్లో 'పొలిమేర' ఒకటి. చేతబడులు, మిస్టరీ, ఊహించని ట్విస్టులు, డార్క్ అట్మాస్ఫియర్ తో ఈ సినిమాలు ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకున్నాయి. లోకల్ పల్లెటూరి నేపధ్యం, రా అండ్ రియలిస్టిక్ మేకింగ్ తో సాగే ఈ కథలకు సత్యం రాజేష్ పెర్ఫార్మెన్స్ ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఇప్పుడు రాబోతున్న మూడో భాగంలో సీనియర్ యాక్టర్ అర్జున్ ఒక కీలక పాత్రలో కనిపించబోతుండటంతో ఈ సిరీస్ తీరుపై ఫిల్మ్ నగర్ లో కొత్త టాక్ మొదలైంది.

లేటెస్ట్ గా యాక్షన్ కింగ్ అర్జున్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఇప్పటివరకు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టిన పొలిమేర వరల్డ్ లోకి ఈ రకమైన పవర్ ఫుల్ క్యారెక్టర్ రావడం ఆసక్తికరంగా మారింది. అయితే అర్జున్ పాత్ర స్వభావం ఎలా ఉండబోతోందనే దానిపై మేకర్స్ ఇంకా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వలేదు. ఆయన కథలో భాగమైన ఆఫీసర్ గా కనిపిస్తారా లేక మిస్టరీని ఛేదించే క్యారెక్టరా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గానే ఉంది.

 

అయితే ఈ కొత్త కాస్టింగ్ ఎంట్రీతో పొలిమేర తన ఓరిజినల్ రూట్ ను మార్చుకుని రెగ్యులర్ మాస్ యాక్షన్ వైపు షిఫ్ట్ అవుతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు ఈ ఫ్రాంచైజ్ సాధించిన సక్సెస్ కి ప్రధాన కారణం అందులోని రా అండ్ రస్టిక్ అట్మాస్ఫియర్, సహజమైన పాత్రలు మాత్రమే. ఒక బిగ్ స్టార్ రాకతో కమర్షియల్ హంగులకు ప్రాధాన్యం పెంచితే, కథలో ఉండాల్సిన అసలైన డార్క్ సీన్స్, బ్లాక్ మ్యాజిక్ మిస్టరీ ఎలిమెంట్స్ ప్రభావం తగ్గే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు రావచ్చు.

ఒక బిగ్ స్టార్ ని ఫ్రాంచైజీలోకి తెచ్చినప్పుడు వాళ్ల ఇమేజ్ కి తగ్గట్టుగా బిల్డప్స్, ఫైట్స్ పెట్టాలనే ఆలోచన సాధారణంగా మేకర్స్ కి వస్తుంది. కానీ అలా చేయడం వల్ల పొలిమేర బ్రాండ్ కి ఉన్న ఓరిజినల్ సోల్ దెబ్బతినే ఛాన్స్ ఉంది. డార్క్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో నడిచే సినిమాల్లో యాక్షన్ మోతాదు పెరిగితే ఆడియన్స్ ఇచ్చే ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అర్జున్ పాత్రను కథలోని మిస్టరీకి ఎలాంటి విఘాతం కలగకుండా సహజంగా ఎలా ఇన్వాల్వ్ చేశారనేది పాయింట్.

దర్శకుడు అనిల్ విశ్వనాథ్ కి ఈ పొలిమేర ప్రపంచంపై పక్కా గ్రిప్ ఉంది. మొదటి రెండు భాగాల్లో క్యారెక్టర్లను డిజైన్ చేసిన తీరు, ట్విస్టులు రాబట్టిన విధానం ఆయన మేకింగ్ స్టైల్ ని నిరూపించాయి. అందుకే అర్జున్ లాంటి అనుభవజ్ఞుడైన నటుడి క్రేజ్ ని వాడుకుంటూనే, ఒరిజినల్ కథలోని సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్ ని ఏమాత్రం మిస్ కాకుండా బ్యాలెన్స్ చేయగలరనే ఆశతో ఫ్యాన్స్ ఉన్నారు. స్టార్ ప్రెజెన్స్ తో పాటు కంటెంట్ లోని డార్క్ మిస్టరీ సరిగ్గా కుదిరితే ఈ మూడో భాగం కూడా సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక సినిమా యాక్షన్ వైపు వెళ్లిందా లేక పాత తరహా మిస్టరీ థ్రిల్ నే కంటిన్యూ చేసిందా అనేది నెక్స్ట్ అప్డేట్ తో తేలిపోనుంది. మరి మేకర్స్ అర్జున్ ను స్క్రీన్ పై ఎలా ప్రెజెంట్ చేస్తారో వేచి చూడాలి.



Tags:    

Similar News