ట్రంప్ క్రిస్మస్ పార్టీలో మల్లికా షెరావత్.. పిక్స్ వైరల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ మెరిశారు.;

Update: 2025-12-20 05:58 GMT

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ లో ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ మెరిశారు. ఈ విషయాన్ని ఇన్ స్టా వేదికగా ఆమె స్వయంగా వెల్లడించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన పలు ఫోటోలను పంచుకున్నారు. ఈ సందర్భంగా స్పందిస్తూ.. వైట్ హౌస్ క్రిస్మస్ విందుకు ఆహ్వానించబడటం పూర్తిగా అవాస్తవంగా అనిపిస్తుంది.. థాంక్యూ.. అని రాసుకొచ్చారు.

అవును... ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు జన్మదిన వేడుకలు మొదలైపోయాయి. ప్రధానంగా డిసెంబర్ 25 కోసం ఇప్పటికే ప్రణాళికలు అన్నీ పూర్తై, షాపింగులు కూడా ముగించి ఎదురుచూస్తున్నారు. అయితే.. ఈ సందడి, ఈ ప్రత్యేకమైన వేడుక ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ కు కాస్త ముందుగానే వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. ట్రంప్ ఇచ్చిన క్రిస్మస్ పార్టీలో ఆమె స్వయంగా పాల్గొన్నారు.

శ్వేత సౌధంలో అమెరికా అధ్యక్షుడు ఇచ్చే క్రిస్మస్ విందుకు ఆహ్వానం దొరకడం ఏమాత్రం చిన్న విషయం కాదు. నూటికో కోటికో చాలా అరుదుగా ఆ అవకాశం లభిస్తుంటుంది. ఈ క్రమంలో ఆ అత్యంత అరుదైన ఛాన్స్ మల్లికా షెరావత్ కు లభించింది. ఈ క్రిస్మస్ వేడుకకు ఆమెకు ట్రంప్ నుంచి ఆహ్వానం అందింది. దీంతో.. అగ్రరాజ్యంలో వాలిపోయిన మల్లిక.. తనదైన స్టైల్లో శ్వేత సౌధంలో మెరిసింది.

ఇందులో భాగంగా పాస్టెల్, మల్టీ కలర్ లో మెరిసే గౌన్ ధరించి కనిపించింది మలిక. దీనికి తోడు ఓపెన్ హెయిర్, మేకప్, రెడ్ కలర్ లిప్ స్టిక్ తో మరింత అద్భుతంగా కనిపించింది. ఇదే క్రమంలో.. చేతిలో సిల్వర్ కలర్ బ్యాగ్ ధరించి, చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిస్తూ వైట్ హౌస్ లో సందడి చేసింది. దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా... అత్యంత ప్రత్యేకమైన, ప్రతిష్టాత్మకమైన వైట్ హౌస్ లోని క్రిస్మస్ వేడుకలకు మల్లికా షెరావత్ కు ఆహ్వానం అందడంపై కొంతమంది ఆశ్చర్యపోతుంటే, ఆమె అభిమానులు ఆనందపడిపోతున్నారు. ఇంకొంతమంది మాత్రం ఇది ఎలా సాధ్యమైందంటూ ఆలోచిస్తున్నారని అంటున్నారు. ఏది ఏమైనా.. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉందంటూ మరికొందమంది చెబుతున్నారు.



Tags:    

Similar News