తొలి సినిమాతోనే ఘట్టమనేని వారసుడు లిప్ లాక్!
ఇలాంటి వాటన్నింటిని అదిమిపెట్టి ఆ ఇద్దరు కెమెరా ముందు పెర్పార్మెన్స్ చేయాల్సి ఉంది. రషా తడానీ బాలీవుడ్ గాళ్ కాబట్టి కాస్త పోష్ గానే ఉంటుంది.;
ఘట్టమనేని కుటుంబం నుంచి మరో వారసుడు జయకృష్ణ రంగంలోకి దిగుతోన్న సంగతి తెలిసిందే. తాతయ్య సూపర్ స్టార్ కృష్ణ, బాబాయ్ మహేష్ ల వారసత్వాన్ని కొనసాగించడానికి మ్యాకప్ తో ముస్తాబవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తోన్న `శ్రీనివాస మంగాపురం` అనే సినిమాతో లాంచ్ అవుతున్నాడు. ఇప్పటికే పరిశ్రమలో భారీ పోటీ ఉన్నా? జయకృష్ణ ఎక్కడా నెరవకుండా బరిలోకి దిగుతున్నాడు. ఈ సినిమా టైటిల్ ని బట్టే డిఫరెంట్ చిత్రమని తెలుస్తోంది. దర్శకుడు అజయ్ భూపతి సక్సెస్ ట్రాక్ కూడా పాజిటివ్ గానే ఉంది.
ఇవన్నీ జయకృష్ణకు కలిసొచ్చే అంశాలే. ఇదే సినిమాతో బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కుమార్తె రషా తడానీ టాలీవుడ్ లో కి ఎంట్రీ ఇస్తోంది. మామ్ వారసత్వాన్ని కొనసాగించడానికి అమ్మడు రంగంలోకి దిగుతోంది. ఇలా ఇద్దరు వారసులతో `శ్రీనివాస మంగాపురం` ఓస్పెషల్ చిత్రంగా నెట్టింట హైలైట్ అవుతుంది. అయితే అంతకు మించిన ఓ స్పెషాల్టీ ఈ సినిమాలో ఉందని తెలుస్తోంది. హీరో-హీరోయిన్ల మధ్య ఘాటైన లిప్ లాక్ సన్నివేశం ఒకటుందని చిత్ర వర్గాల నుంచి లీకైంది. `రెండు జీవితాలు ఒక ప్రయాణం , రెండు చేతులు ఒక వాగ్దానం..రెండు మనసులు ఒక విధి` అన్నది సినిమా కాన్సెప్ట్ గా తెలుస్తోంది.
ఈ పాయింట్ ని బేస్ చేసుకునే శ్రీనివాస మంగాపురం తెరెకెక్కుతోంది. ఈ కథా గమనంలో భాగంగా హీరో-హీరోయిన్ మధ్య అదర చుంబనాన్ని దర్శకుడు డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగానే అజయ్ కథలు రొమాంటిక్ గా ఉంటాయి. అది బోల్డ్ కంటెంట్ అయితే అంతే బోల్డ్ గా తీయడానికి వెనుకాడని దర్శకుడు. ఈ నేపథ్యంలో జయకృష్ణ-రషా తడానీల మధ్య పెదవి ముద్దు అన్నది ఎంతో ప్రత్యేకమయ్యే అవకాశం ఉంది. పైగా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కాబట్టి కెమెరా ముందు ఎన్నో రకాల టెన్షన్స్ తప్పవు. ఎంతో భావోద్వేగం అందులో దాగి ఉంటుంది.
ఇలాంటి వాటన్నింటిని అదిమిపెట్టి ఆ ఇద్దరు కెమెరా ముందు పెర్పార్మెన్స్ చేయాల్సి ఉంది. రషా తడానీ బాలీవుడ్ గాళ్ కాబట్టి కాస్త పోష్ గానే ఉంటుంది. ధైర్యంగానే సాహసించడానికి అవకాశం ఉంటుంది. జయకృష్ణ జర్నీ రషా ప్రయాణానికి భిన్నమైంది. సరైన పరిచయం..అనుభవం ఉంటే తప్ప చొరవ అంత సులభం కాదు. పైగా ఘట్టమనేని హీరోలంటే చాలా ప్రయివేట్ గా ఉంటారు. మీడియాతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తారు. సోషల్ మీడి యాకు దూరంగానే ఉంటారు. కానీ కెమెరా ముందు ప్రయివేట్ స్పేస్ కంటే చొచ్చుకుపోయే తత్వమే కీలకం.
నటుడికి ఉండాల్సిన మొదటి లక్షణం అదే. మరి ఈ విషయంలో జయకృష్ణ ఎంత చొరవ తీసుకుంటాడో చూడాలి. అయితే రొమాంటిక్ సన్నివేశాలకు మహేష్ తొలి నుంచి దూరంగానే ఉన్నారు. సీన్ డిమాండ్ చేసిందంటే దర్శకుడు అడ్జెస్ట్ అవ్వాలి తప్ప మహేష్ అయింది చాలా తక్కువ సందర్భాల్లోనే. కానీ ఆ జనరేషన్ జమానా లో అలా చెల్లింది. ప్రస్తుతం జనరేషన్ హీరోల్లో అలా మడికట్టుకుంటానే పనవ్వదు. దర్శకుల క్రియేటివిటీని మించి మెప్పిస్తేనే పోటీలో నిలబడేది.