గ్లామర్ తో పిచ్చెక్కిస్తున్న సిమ్రాన్ చౌదరి!

ఇలా ఎప్పటికప్పుడు యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్న సిమ్రాన్ చౌదరి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలతో దర్శనమిచ్చింది.;

Update: 2026-02-04 17:05 GMT

సిమ్రాన్ చౌదరి.. ఈ పేరుకు పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో, హుందాతనంతో, అమాయకత్వంతో ఇలా అన్ని విధాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అబ్బాయిల కలల రాకుమారిగా పేరు సొంతం చేసుకుంది. తను నటిస్తే చాలు తన కోసమే సినిమా థియేటర్కు వెళ్లే ఆడియన్స్ కూడా లేకపోలేదు.. అలా విలక్షణమైన నటనతో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న సిమ్రాన్ చౌదరి.. స్టార్ హీరోయిన్గా ఎదిగే ప్రయత్నం చేస్తుంది కానీ అందుకు తగ్గట్టు అవకాశాలైతే పడడం లేదు అని స్పష్టంగా తెలుస్తోంది

 

అందులో భాగంగానే ఇటు సోషల్ మీడియా ద్వారా ఫాలోవర్ లను పెంచుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా రోజుకొక ట్రెండీ ఔట్ ఫిట్ తో దర్శనమిస్తూ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఈమె ఫ్యాషన్స్ కి ఫిదా అవుతున్నారు. అలాంటి డ్రెస్లను రీ క్రియేట్ చేస్తూ తమ అందంతో అటు తమ స్నేహితులను కూడా ఆకట్టుకుంటున్నారు. ఇలా ఎప్పటికప్పుడు యువతలో విపరీతమైన క్రేజ్ దక్కించుకుంటున్న సిమ్రాన్ చౌదరి తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలతో దర్శనమిచ్చింది. షర్టును తలపించేలా బ్లాక్ డ్రెస్ ధరించిన ఈమె అందులో టాప్ అందాలను హైలెట్ చేస్తూ హీట్ పుట్టించింది. జుట్టును అలా గాలికి వదిలేసి తన అందంతో మాయ చేసింది.

 

ముఖ్యంగా మత్తెక్కించే ఈమె కళ్ళు కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాయని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆమె స్మైల్ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మొత్తానికైతే తన అందంతోనే కాదు తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో కూడా ఆకట్టుకుంటుంది సిమ్రాన్ చౌదరి. సిమ్రాన్ చౌదరి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి అటు అభిమానులు కూడా భిన్న విభిన్నమైన కామెంట్లు పెడుతూ కామెంట్ బాక్స్ నింపేస్తున్నారు.

 

1996లో హైదరాబాదులోనే జన్మించిన ఈ తెలుగమ్మాయి.. హైదరాబాదులోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ లో పదవ తరగతి పూర్తి చేసింది. సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నుండి డిగ్రీ పట్టా అందుకుంది సిమ్రాన్ చౌదరి. 12 ఏళ్ల వయసు అనగా 8 లేదా 9వ తరగతి చదువుతున్న సమయంలోనే కమర్షియల్ యాడ్స్ లో నటించి అభిమానులను సంపాదించుకున్న ఈమె ఆ తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అక్కడ తన ఫ్యాషన్ సెన్స్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకొని.. 2012లో మిస్ ఆంధ్ర ప్రదేశ్ గా , టాలీవుడ్ మిస్ హైదరాబాద్ గా టైటిల్ అందుకున్న ఈమె 2017లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ అవార్డును కూడా దక్కించుకుంది.

2014లో హమ్ తుమ్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలో నటించి మరింత పాపులారిటీ అందుకుంది. ప్రస్తుతం ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో కూడా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags:    

Similar News